జాతీయ వార్తలు

ఆప్‌తో పొత్తు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆప్‌తో పొత్తు ససేమిరా అంటున్నారు కాంగ్రెస్ వృద్ధనేత షీలాదీక్షిత్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన ఈ కురువృద్ధ నాయికి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఓ లేఖ సమర్పించినట్లు భావిస్తున్నారు. షీలాదీక్షిత్ ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్టానం కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఆప్, కాంగ్రెస్ మధ్య చర్చలు సఫలమవుతున్నాయని అనుకునే సమయంలో షీలా దీక్షిత్ ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది.ఇదిలా వుండగా జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ హవాను నిలువరించాలంటే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోయి మహాకూటమిగా ఏర్పాటైంది. అయితే ఈ కూటమిలో ఆప్‌కు కూడా చోటు కల్పించేందుకు కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్న సమయంలో షీలా చేసిన ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించటం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఆప్‌తో వెళితే ప్రమాదకరమని, ఆది పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని షీలాదీక్షిత్ తన లేఖలో పేర్కొన్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమికి దూరంగా ఉన్నాయి. ఈ కూటమిలో ఆర్జేడీ, జేడీఎస్, డీఎంకే లాంటి స్థానిక పార్టీలు ఇప్పటికే చేరాయి. అయితే మొదటి నుంచి మిత్ర పక్షంగా వ్యవహరించిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ లాంటి పార్టీలు కాంగ్రెస్‌తో విబేధించాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ఛాఖో మరో విధంగా స్పందించారు. షీలా దీక్షిత్‌కు ఆయన పూర్తి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఆప్ అవసరముందనే విధంగా వ్యాఖ్యానించారు.షీలాదీక్షిత్ ప్రతిపాదనపై చర్చ జరిగిన తరువాతే ఆప్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలా లేదా నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది.