నిజామాబాద్

శిఖం భూముల గుర్తింపు జరిగేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, డిసెంబర్ 18: గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో శిఖం భూముల గుర్తింపునకు మార్గం సుగగమైంది. ప్రతియేటా నీటి నిల్వల కారణంగా పూర్తిస్థాయిలో శిఖం భూములను గుర్తించడంలో అధికార యంత్రాంగం చేపట్టలేకపోయింది. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలన్నీ దాదాపుగా పూర్తిగా ఎండిపోయే దశలో ఉన్నాయి. ఏ ఒక్క చెరువులోనూ నీటి నిల్వలు తూములను దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శిఖం భూములను గుర్తించేందుకు అధికార యంత్రాంగం సర్వేలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. చాలా చెరువుల కింద శిఖం భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. ప్రతియేటా సర్వే నిర్వహిస్తున్న అధికారులు మండలంలో ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో శిఖం భూములు ఉన్నాయంటూ నిర్ధారిస్తున్నారు. పైగా గ్రామంలోని చెరువుల కింద ఉన్న శిఖం భూములు, దేవాదాయ శాఖ, వక్ఫ్‌బోర్డు భూములు తదితర వివరాలన్నింటిని గ్రామాల్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద అందరికి కనిపించేలా గోడలపై నమోదు చేస్తున్నారు. అన్ని భాగానే ఉన్నా, శిఖం భూముల గుర్తింపులోనే అసలైన సమస్య ఏర్పడుతోంది. చెరువులు పూర్తిగా నిండినప్పుడు పెద్దమొత్తంలో దాని శివారు ప్రాంతంలోని పంట భూములన్నీ ముంపునకు గురవుతున్నాయంటే, శిఖం భూములు ఎంత మేర అన్యాక్రాంతమవుతున్నాయో నిర్ధారించవచ్చు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ విజయలక్ష్మి చెరువులో దాదాపు 120ఎకరాల భూమిని ఆక్రమించేశారని, దీనివల్ల చేపల ఉత్పత్తి జరుగక జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయిన మత్స్య కార్మికులు, దాని విషయంలో ఓ ఉద్యమమే చేశారు. గత సీజన్‌లో నెల రోజుల పాటు ఈ సమస్య మండలంలో చర్చనీయాంశంగా మారింది. అయితే భూములను గుర్తించారా, లేదా అన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టం కాలేదు. ఒక్క తిమ్మాపూర్‌లోనే కాకుండా మండలంలోని చాలా చెరువులు, కుంటల్లో శిఖం భూములే కాకుండా చెరువు భూములు కూడా కబ్జాకు గురైనట్లు సమాచారం. కుంటల పరిస్థితి అయితే మరీ దారుణం. అధికారికంగా మోర్తాడ్ మండలంలో 32కుంటలు ఉన్నట్లు రికార్డుల్లో తెలుపుతున్నా, అందులో చాలావరకు కాగితాలకే పరిమితమైనట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రభుత్వ అసైన్‌మెంట్ భూముల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించవద్దని, గ్రామాల్లో చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాటి పరిరక్షణపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం చెరువులు, కుంటలన్నీ నీటి నిల్వలు లేక ఖాళీగా ఉన్నందున పూర్తిస్థాయిలో కొలతలను చేపట్టే అవకాశం ఉందని, అందువల్ల అధికారులు దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. శిఖం భూములను గుర్తించడంతో పాటు చెరువు చుట్టూ పూర్తిస్థాయిలో కందకాలు తీయిస్తే భవిష్యత్‌లో శిఖం భూముల సమస్య ఉండదని వారు పేర్కొంటున్నారు.

కార్పొరేషన్ ఎదుట ధర్నా
కంఠేశ్వర్, డిసెంబర్ 18: తాగునీటి సమస్యతో పాటు ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం కార్పొరేషన్ ఎదుట ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రమేష్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం జిల్లాలోని 36మండలాలను కరవు మండలాలుగా ప్రకటించడం జరిగిందని, ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నగరానికి తాగునీటిని అందించే అలీసాగర్, మంచిప్ప, రఘునాథ చెరువులు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల మంజీరా, సింగూరు నుండి నిజాంసాగర్ ప్రాజెక్టుకు 8టిఎంసిల నీటిని విడుదల చేయించి, తద్వారా నగర ప్రజల దాహార్తి సమస్యను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఏర్పడిన కరవుతో గ్రామీణ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో ప్రజలు పట్టణాలకు వలసబాట పడుతున్నారని, దీంతో పట్టణాల్లో కూడా ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయని అన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహా, నగరంలో కూడా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నగరంలో ఏర్పడిన తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు కరవు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ నాగేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు మల్యాల గోవర్ధన్, వెంకట్‌గౌడ్, మధు, అనసూయతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పటిష్ట భద్రత అవసరం
బ్యాంకర్ల సమావేశంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
ఇందూర్, డిసెంబర్ 18: బ్యాంక్ అధికారులు తమతమ శాఖల ఆధ్వర్యంలో వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏటిఎంల వద్ద చోరీల నివారణకు పటీష్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేయాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏటిఎంల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత బ్యాంక్ మేనేజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఏటిఎంల వద్ద భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, అవసరానికి మంచి ఎక్కువ డబ్బులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాన్నారు. ఏటిఎంల యందు ఉంటే అలారమ్, సిసి కెమెరాలను సంబంధిత బ్యాంక్ సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి, ఏటిఎంకు వచ్చిపోయే వారి సమాచారాన్ని అక్కడి నుండే ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఏటిఎంల డిజైనింగ్‌లో మార్పులు చేసి, దుండగులు ధ్వంసం చేసిన నాశనం కాని విధంగా తయారు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆయా బ్యాంకుల మేనేజర్లు ఎమ్‌విఎస్‌ఎస్.ప్రసాద్, ఎ.సరుూద్‌రెడ్డి, సుజాతరెడ్డి, ఎంవిఎస్‌ఎస్.నాగరాజుకుమార్, ఎం.అప్పారావు, సూర్యనారాయణ, డి.సతీష్, పిఆర్.పడేట్‌వార్ తదితరులు పాల్గొన్నారు.