రాష్ట్రీయం

అడ్డేలేని షి‘కారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ ఉప ఎన్నికలో ఓట్ల పెనుతుపాను
తెరాస అభ్యర్థి దయాకర్‌కు 4,59,092 ఓట్ల అఖండ మెజార్టీ
డిపాజిట్లు దక్కని జాతీయ పార్టీలు
రెండోస్థానంలో కాంగ్రెస్, మూడోస్థానంలో బిజెపి
ఉనికేలేని వామపక్షాలు

వరంగల్, నవంబర్ 24: నువ్వా..నేనా అనుకున్న వరంగల్ లోక్‌సభ సీటు ఉప ఎన్నిక ఎకపక్షంగా జరిగింది. అధికార తెరాస కారుజోరు ఓట్ల వర్షం కురిపించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనా పటిమ, సంక్షేమ పథకాలు, ఆయన జనాకర్షక శక్తి మరోసారి ఓటర్లను సమ్మోహితం చేశాయి. ఏడాదిన్నర పాలనలో తెరాస చేసిందేమీలేదన్న విపక్షాల మాటలు నీటిమూటలే అయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ విజయ దుందుభి మోగించారు. బిజెపి-తెలుగుదేశం కూటమి, కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా ఏకంగా నాలుగున్నర లక్షల రికార్డు మెజార్టీతో అనూహ్యమైన రీతిలో ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపుతొలి రౌండ్ నుంచి తుది రౌండ్ వరకూ దయాకర్ అప్రతిహతమైన ఆధిక్యాన్ని కొనసాగించారు. వరంగల్ సీటు తెరాసదే అన్న విషయం ముందే ఊహించిందే అయినప్పటికీ ఇంత భారీ మెజార్టీ దక్కుతుందని, విపక్షాలకు డిపాజిట్లు కూడా రావని ఎవరూ ఊహించలేకపోయారు. మంగళవారం నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ చివరి వరకూ తెరాసలో విజయోత్సాహం ఇనుమడిస్తూనే వచ్చింది. ప్రతిరౌండ్‌లోనూ విపక్షాలకు నిరాశానిస్పృహలే ఎదురయ్యాయి. అంతిమంగా అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి తిరుగులేని ఆధిక్యత నమోదు చేసుకుని పెనుతుపానే సృష్టించారు. దయాకర్‌కు 6,15,403 ఓట్లు రాగా రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,311 ఓట్లు వచ్చాయి. మూడో స్థానాన్ని దక్కించుకున్న బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు 1,30,178 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి జాజుల భాస్కర్ 28,541 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. కేవలం 23వేల 532ఓట్లు పోలైన వైఎస్సార్‌సిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ఐదోస్థానానికి పరిమితమయ్యారు.
వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌కు కేవలం 14,788 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరి 3,92,137 ఓట్ల మెజార్టీతో అప్పటి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యపై విజయం సాధించారు. కడియం శ్రీహరికి 6,95,918 ఓట్లు రాగా సిరిసిల్ల రాజయ్యకు 3,2,981 ఓట్లు వచ్చాయి. అప్పటి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ 2లక్షల 62వేల ఓట్లు సాధించారు. అప్పటితో పోలిస్తే కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు నేటి ఎన్నికలో భారీగానే ఓట్లు తగ్గిపోయాయి. ఈ రెండు జాతీయ పార్టీల అభ్యర్థులు కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉప ఎన్నికలో కొట్టొచ్చినట్లు కనిపించింది. కనీసం రెండో స్థానాన్ని అయినా నిలుపుకుంటుందనుకున్న బిజెపి నాయకులకు గట్టి షాక్ ఎదురైంది. ఇక వైఎస్సార్‌సిపి అధినేత, ఏపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజులు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికి ఏ ఆ పార్టీ అభ్యర్థి ఏ మాత్రం ప్రభావం చూపించలేక పోయారు. స్వతంత్ర అభ్యర్థి కంటే ఘోరంగా ఓటమి చవిచూశారు. స్టార్ ప్రచారకర్తగా ఆ వైకాప ఎమ్మెల్యే రోజా వచ్చి నాలుగు రోజులు ప్రచారం చేసినా ప్రయోజనం దక్కలేదు. కేవలం బొటాబొటీ ఓట్లతో ఐదో స్థానంలో నిలిచిన వామపక్షాల పరిస్థితి ఈ ఫలితంతో మరింత అధ్వాన్నంగా మారింది. (చిత్రం) విజయ చిహ్నం చూపిస్తున్న దయాకర్