జాతీయ వార్తలు

పాక్‌తో దోస్తీ చేస్తే భారీ మూల్యం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత చరిత్రే ఇందుకు రుజువు ప్రధాని మోదీకి శివసేన హెచ్చరిక

ముంబయి, డిసెంబర్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆకస్మికంగా పాకిస్తాన్‌ను సందర్శించడంపై బిజెపి మిత్రపక్షమైన శివసేన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత నెత్తుటిలో ‘నానుతున్న’ పాకిస్తాన్ గడ్డను ‘ముద్దాడినందుకు’ మోదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, దాయాది దేశానికి చేరువయ్యేందుకు మోదీ ఎంతగా ప్రయత్నిస్తే, అంతలా పతనమవడం ఖాయమని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె.అద్వానీ వంటి బిజెపి మహానాయకుల రాజకీయ గ్రాఫ్ కూడా అలాగే పతనమైందని శివసేన సోమవారం హెచ్చరించింది.
‘పాకిస్తాన్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నించిన ఏ నాయకుడూ రాజకీయాల్లో ఎంతోకాలం కొనసాగలేడన్న విషయం గతంలో ఎన్నోసార్లు బలంగా రుజువైంది. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకోవలసిన అవసరం లేదు. అద్వానీ గతంలో పాక్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా సమాధిని సందర్శించి ఆయనను ప్రశంసించారు. ఆ తర్వాత నుంచి అద్వానీ రాజకీయ గ్రాఫ్ పతనవడంతో ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో మూలకు జరిగారు’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’లో ప్రచురితమైన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. బిజెపికి అత్యంత ప్రాచీన సైద్ధాంతిక భాగస్వామి అయిన శివసేన మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్‌పేయికి, పాక్ మాజీ నియంత జనరల్ పర్వెజ్ ముషారఫ్‌కు మధ్య జరిగిన భేటీలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది.
‘్భరత్-పాక్ మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు లాహోర్‌ను సందర్శించడంతోపాటు ఇరు దేశాల మధ్య బస్సు సర్వీసును ప్రారంభించారు. అంతేకాకుండా ఆగ్రాలో ముషారఫ్‌తో భేటీ అయ్యేందుకు వాజ్‌పేయి తన మార్గం నుంచి పక్కకు జరగడంతో ఆయన నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయింది’ అని శివసేన గుర్తుచేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి ముందస్తు ప్రకటన చేయకుండా పాకిస్తాన్‌ను సందర్శిస్తే బిజెపి ఎలా ప్రతిస్పందించేదో తెలుసుకోవాలనుకుంటున్నామని శివసేన పేర్కొంది.