తెలంగాణ

ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో హైకోర్టు సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మెదక్ జిల్లా కుకునూరు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ తీరుపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త ఆత్మహత్యకు డిఎస్పీ, సిఐల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు రామకృష్ణారెడ్డి భార్య హైకోర్టుకు విన్నవించారు. దీంతో డిఎస్పీ, సిఐలపై ఎఫ్‌ఐఆర్‌లను ఎందుకు నమోదు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. వెంటనే ఆ ఇద్దరు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.