జాతీయ వార్తలు

అత్యావసర విచారణ కోరని శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రో రాష్టప్రతి పాలన విధిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌పై శివసేన వెనక్కి తగ్గింది. తాము దీనిపై అత్యవసర విచారణ కోరట్లేదని శివసేన వివరణ ఇచ్చింది. ఈ పిటిషన్‌పై బుధవారం అత్యావసర విచారణ కోరట్లేదని ఆ పార్టీ తరపున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సునిల్ ఫెర్నాండెజ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాము ఎలాంటి కొత్త పిటిషన్లు దాఖలు చేయట్లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి మద్దతు లభించిన తరువాతే కొత్త పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.