తెలంగాణ

వివాహేతర సంబంధమే హత్యకు కారణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భార్యను హత్యచేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో తీసుకుపోయి శంషాబాద్ సమీపంలో భర్తే పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో పోలీసులు కొత్తకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని పద్మారావునగర్‌లో ఉంటున్న వ్యాపారి రూపేశ్ తన భార్య సింథియాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. సింథియా ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ మరో వ్యక్తితో ప్రేమలో పడినట్టు, అతడిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుసుకున్నాక రూపేశ్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆమెకు విడాకులు ఇచ్చేందుకు రూపేశ్ నిరాకరించాడు. ఎనిమిదేళ్ల పాపను సింథియాకు ఇచ్చేందుకు కూడా అతను సమ్మతించలేదు. వేరొకరితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నందునే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని రగిలిపోయిన రూపేశ్ సింథియాను అంతం చేయాలని పథకం రచించాడు. సోమవారం ఉదయం ఇంట్లో గొడవ పడిన అనంతరం భార్యను ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో పెట్టి కారులో శంషాబాద్ ప్రాంతానికి తీసుకుపోయాడు. కారులోనే కుమార్తెను కూర్చోబెట్టి మదనపల్లి వద్ద నిర్మానుష్య ప్రదేశంలో ఆ సూట్‌కేసుపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుపైన బురదలో కారు కూరుకుపోవడంతో సమీప గ్రామస్థులు సహాయం చేశారు. కొద్ది దూరంలోనే మంటలను చూసి వారు అనుమానించి రూపేశ్‌ను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తన నేరాన్ని రూపేశ్ అంగీకరించాడు.