జాతీయ వార్తలు

యెడ్డీ మెడకు ‘క్రూయిజర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటకలో ఖరీదైన బహుమతుల వార్తలు కలకలం రేపుతున్నాయి. లక్షలాది రూపాయల హాబ్లెట్ వాచీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గిఫ్ట్‌గా పొందారన్న వార్తలు ఆ మధ్య పెద్ద దుమారానే్న రేపాయి. ఈ వివాదం నుంచి సిఎం అతికష్టం మీద బయటపడ్డారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప ల్యాండ్ క్రూయిజర్ కారు వార్తల్లోకి ఎక్కింది. కోటీ పదిహేను లక్షల రూపాయల టయోటా ల్యాండ్ క్రూయిజర్ యెడ్యూరప్ప బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బహుమతిగా వచ్చింది. చక్కెర దిగ్గజం మురుగేశ్ నిరానీ అనే పారిశ్రామిక వేత్త బిజెపి సారధికి గిఫ్టుగా అందించారు. ఈ విషయాన్ని బిజెపి వర్గాలూ ధృవీకరించాయి. పార్టీ పనులపై రాష్టమ్రంతటా పర్యటించాలి కాబట్టి ఈ సెవన్‌సీటర్ క్రూయిజర్ అవసరం ఎంతో ఉందని వారు చెబుతున్నారు. 70 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన హాబ్లేట్ వాచీ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దుమ్మెత్తిపోసిన ప్రతిపక్ష బిజెపిపై క్రూయిజ్ అస్త్రాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ వివాదంపై యెడ్యూరప్ప శనివారం ఇక్కడ స్పందించారు. ‘పార్టీ పనిమీద మైళ్లకొద్దీ పర్యటించాల్సి ఉంది. మురుగేశ్ ఇచ్చిన ఎస్‌యువి కారును పార్టీ పని కోసం వాడుకుని తరువాత ఆయనకే తిరిగి ఇచ్చేస్తాను’అని మాజీ సిఎం వివరించారు.