తెలంగాణ

పనులు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మినీ స్ట్టేడియంలో అసంపూర్తిగా పనులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
అభివృద్ధి పనులు ప్రారంభించకుండానే వెనుతిరిగిన మంత్రి
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయిస్తానని హౌసింగ్ ఇఇపై మండిపాటు

సిద్దిపేట, డిసెంబర్ 28 : మెదక్ జి ల్లా సిద్దిపేట మినీస్టేడియంలో అసంపూర్తిగా పనులు చేపట్టడంపై అధికారులపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకా కుండా సో మవారం జరగాల్సిన అభివృద్ధి పనులను ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. మినీస్టేడియంలో వివిధ అభివృద్ధి పనులకు 2.1 కోట్లు మం జూరు చేశారు. స్టేడియంలో ఇండోర్ షటిల్ కోర్టు, లాంగ్ టెన్నిస్, ఖోఖో, పుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ కోర్టు లు ఏర్పాటు చేయాల్సి వుంది. లాంగ్ టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టులు అసంపూర్తిగా ఉండడం, కోర్టులో పో ల్స్, లైట్స్ ఏర్పాటు చేయాలని హౌ సింగ్ ఇఇ విజయ్‌కుమార్‌పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు పనులు పూర్తి చేయకుండా తనను ప్రారంభోత్సవానికి ఎందుకు పిలిచారని అడిగారు. హౌసింగ్ సిఇ ఈశ్వరయ్యతో ఫోన్ లో మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు పనుల నిర్లక్ష్యంపై తీవ్ర జా ప్యం చేశారని, నారాయణఖేడ్ నియోజకవర్గంలో పనులు ప్రారంభించాలని సూచించినా ఇంతవరకు ఎందు కు ప్రారంభించలేదన్నారు. నిధులు మంజూరు చేసి, టెండర్ ప్రక్రియ పూర్తయి 15 రోజులు గడుస్తున్నా పనులు ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. హౌసింగ్ ఇఇ విజయ్‌కుమార్‌ను 15 రోజులు ఇక్కడే మకాం వేసి స్టేడియంలో మిగిలిన పనులు త్వరగా చేయించాలని ఆదేశించారు. నిధులు తక్కువైతే తన దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరుకు చేయిస్తానని హామీనిచ్చారు. పనుల్లో నాణ్యత లేకున్నా, పనుల చేయకున్నా.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సస్పెండ్ చేస్తానని హౌసింగ్ ఇఇ హెచ్చరించారు.
ఆర్‌విఎం డిఇ పై ఆగ్రహం
ఇదిలావుండగా, సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న బాలికల హాస్టల్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతుండడంపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశా రు. హాస్టల్ పూర్తి చేయడానికి ఎన్ని నెలలు కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేసినా నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఆర్‌డబ్లుఎస్ డిఇ సారీ చెప్పేందుకు యత్నించినా ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావని, సారీ అనే పదానికి అర్థం లేకుండా పోతోందన్నారు.