బిజినెస్

కేజీ వెండి ధర రూ. 47 వేలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర గురువారం రూ. 47వేలకు చేరింది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టి, రూ. 44వేల వరకు చేరిన వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో నిన్న ఒక్క రోజే రూ. 750 పెరగగా.. గురువారం మరో రూ. 50 పెరిగింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో 30 నెలల గరిష్ఠ స్థాయి నుంచి దిగొచ్చింది. రూ. 250 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పదిగ్రాముల పసిడి ధర రూ. 31,300గా ఉంది.