జాతీయ వార్తలు

సమైక్యతే తారకమంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్ ప్రవాసీ సదస్సులో మోదీ

సింగపూర్, నవంబర్ 24: సమైక్యత, సమగ్రతే తారకమంత్రంగా ప్రపంచంలో దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. భారత్‌లో అసహన ధోరణులు ప్రబలమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ భారతీయులనుద్దేశించి మాట్లాడిన మోదీ ‘సమైక్యత, సమగ్రత భారతీయ సంస్కృతిలో భాగం. ఇదే నినాదంతో, ఇదే మంత్రంతో, ఇదే సందేశంతో ముందుకు సాగండి’ అని అన్నారు. భారత్‌లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి విధానాలను వివరించిన మోదీ, సమైక్యత, సామరస్య భావనలను బలోపేతం చేయడం ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే భారతీయుల ఆత్మ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ‘ఉపాధి కల్పన, రైతులకు సంపద కల్పన, మహిళల సాధికారతే లక్ష్యంగా సమైక్యత, సమగ్రత మంత్రంతో ముందుకు సాగుతున్నాం’అని మోదీ అన్నారు. విశ్వ రక్షణే ధ్యేయంగా త్వరలో జరుగనున్న ప్యారిస్ పర్యావరణ సదస్సు ఆవశ్యకతను వివరించిన మోదీ భూతాపాన్ని తగ్గించేందుకు భారత్ అన్ని విధాలుగా తోడ్పడుతుందని తెలిపారు. దేశాభివృద్ధి కోసం భారత్‌కు అపారమైన పరిమాణంలో ఇంధన అవసరం ఉన్నప్పటికీ వాతావరణ మార్పులను నిరోధించే విషయంలో ప్రపంచ దేశాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. సౌర, అణు, పవన ఇంధనంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రానున్న ఏడేళ్ల కాలంలో 175గీగా వాట్ల విద్యుత్ ఉత్పత్తే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు.
దీని వల్ల బొగ్గు తదితర ఇంధన మార్గాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందన్నారు. 2022లో భారత్ తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోందని, అప్పటికల్లా దేశంలోని అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్‌ను అందించే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు. ‘మాకు ఇంధనం అవసరమే అయినా ఇందుకోసం ప్రపంచానికి సమస్యల సృష్టించబోము’అని ఉద్ఘాటించారు. (చిత్రం) సింగపూర్ ప్రవాసీ సదస్సులో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ