AADIVAVRAM - Others

టర్కీ కోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లాయపాలెంలో ఒక రైతు కొన్ని కోడిపిల్లలను తెచ్చి పెంచుతున్నాడు. అందులో పుంజులు, పెట్టలు ఉన్నాయి. అందులో ఒక టర్కీ కోడి పిల్ల కూడా ఉంది. అది మిగిలిన వాటికి భిన్నంగా ఉండేది. వాటితో కలిసేది కాదు. పైగా రైతు కొడుకు పాక దగ్గర కూర్చుని ఇంగ్లీషు చదువుతుంటే చక్కగా వినేది. అలా దానికి ఇంగ్లీష్ మీద మక్కువ పెరిగింది. దాంతోపాటు దాని దర్పం కూడా పెరిగింది. ఇంగ్లీష్ మీద ఇష్టంతో తెలుగు నిర్లక్ష్యం చేసింది. తెలుగు పదాల అర్థం దానికి తెలియకుండా పెరిగింది. మిగిలిన కోళ్లు ఏం చెప్పినా వినేది కాదు. కారణం దాని తెలుగు తెలియకపోవడం. తల ఊపి వెళ్లిపోయేది. రోడ్ల మీద ట్వింకిల్.. ట్వింకిల్.. అని పాటలు పాడుకుంటూ తిరిగేది. అది అంతే అనుకుని మిగిలిన కోళ్లు అన్నీ కలిసి ఉండేవి. అవి అన్నీ ఒకచోట మేస్తే.. టర్కీకోడి వేరొక చోట మేతకు వెళ్లేది.
కోళ్లు పెద్దవయ్యాయి. ఒకనాడు ఊరిలో వారు ‘కోళ్లు ఎత్తుకుపోయే దొంగ ఊరిలోకి వచ్చాడట’ అని మాట్లాడుకోవడం వింది ఒక పెద్ద పుంజు. వెంటనే తన వారినందరినీ హెచ్చరించింది. అలాగే టర్కీ కోడి దగ్గరకు వెళ్లి ‘జాగ్రత్తగా ఉండు. కోళ్ల దొంగ వచ్చాడట.. మీద ముసుగు వేసి తీసుకుని పోగలడు’ అంది. దాని అర్థం తెలియక పోయినా ‘ఎస్...’ అంటూ తలూపింది టర్కీ కోడి. దొంగ రానే వచ్చాడు. దొంగ రాకను ముందుగా ఊహించిన కోళ్లు అన్నీ దాగున్నాయి, విషయం తెలీని టర్కీ కోడి మాత్రం ‘జానీ జానీ.. ఎస్ పప్పా..’ అని పాడుకుంటూ వీధిలో తిరుగుతోంది. మంచిగా బలిసిన టర్కీ కోడిని చూడగానే దుప్పటి దాని మీద వేసి పట్టేశాడు దొంగ. టర్కీ కోడిని పట్టేయడం చూసిన మిగిలిన కోళ్లన్నీ... బయటకి వచ్చి గట్టిగా అరిచాయి. గోలగోల చేశాయి. జనం గుమిగూడారు. దొంగని పట్టుకుని కొట్టి, టర్కీ కోడిని విడిపించారు.
అన్ని కోళ్లు టర్కీ కోడి దగ్గరకు వచ్చి.. హెచ్చరించినా.. వీధుల్లో తిరుగుతావు బుద్ధి లేదా అన్నాయి. వాటి మాటలు టర్కీ కోడికి అర్థం కాలేదు. అయినా అవి తన మంచి గురించి ఏవో చెప్పాయని గ్రహించింది. తనకు తెలుగు రాకపోవడం వల్లనే ఈ ప్రమాదం అని గ్రహించింది. ఆ రోజు నుంచి మిగిలిన కోళ్లతో కలసిమెలసి తిరుగుతూ అనతి కాలంలోనే తెలుగు బాగా నేర్చుకుంది.

-

- కూచిమంచి నాగేంద్ర