శిప్ర వాక్యం

అవస్థల్లో విపక్షం.. వ్యూహాలు అస్పష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఏర్పడిందనడానికి ఆ పార్టీలో పరిస్థితులు అద్దం పడుతున్నాయి. సోనియా గాంధీ ఇక క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనలేరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బాబు నిద్రాముద్రాంకితుడు. ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ‘పార్టీలో వృద్ధ జంబుకాలకు ఉద్వాసన చెప్పండి’ అని ఆయన ఇచ్చిన పిలుపు ‘బూమరాంగ్’ అయింది. ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపాలని మరో వర్గం ఆలోచిస్తున్నది. ఏమైనా సరే ‘గాంధీ ట్యాగ్’ పార్టీకి ఉండాల్సిందేనని దిగ్విజయ్ సింగ్ బహిరంగంగానే ప్రకటించారు. ప్రియాంక సమగ్ర స్థాయిలో రాజకీయ పగ్గాలు స్వీకరించే లోపే ఆమె భర్త రాబర్ట్ వాద్రా తీహార్ జైలు ఊచలు లెక్కించవచ్చు. స్విస్ బ్యాంకు, మారిషస్ వర్జిన్ ఐలండ్ పనామా బ్యాంకుల మొత్తాలు ఇండియాకు చేరితే కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఆగినట్టవుతుంది. ఈ దశలో కాంగ్రెస్‌కు త్యామ్నాం ఏమిటి?
అన్నా హజారే ప్రజల్లో చాలా గౌరవం కలిగిన సామాజిక కార్యకర్త. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో ఆయన చేసిన సేవలు ప్రశంసాపాత్రమైనవి. ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గతంలో అన్నా హజారేకు ప్రధాన సహచరుడు. అవినీతి రహిత భారతాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని కేజ్రీవాల్ ప్రారంభించారు. దాన్ని పంజాబ్‌కూ విస్తరింపజేశారు. కేజ్రీవాల్ క్యాబినెట్‌లో సోమనాథ్ భారతి, అశుతోష్, జితేంద్ర తోమార్, సందీప్ కుమార్ ఇలా ఒక్కొక్క మంత్రి అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. పార్లమెంటరీ సెక్రెటరీలుగా నియమితులైన ఇరవై ఒక్క మంది ‘ఆప్’ ఎంఎల్‌ఏలను అనర్హులుగా న్యాయస్థానం ప్రకటించింది. దీంతో ‘ఆప్’ సంక్షోభంలో పడింది. కేజ్రీవాల్ మీద తనకు విశ్వాసం పోయిందని అన్నా హజారే ప్రకటించారు. ఇక జెడియు సంగతి చూస్తే, ఈ పార్టీకి బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నాయకుడు. తాను పరమ నీతిమంతుడినని ఆయన అనుకుంటుంటాడు. ఎలాంటి విద్యార్హతలు లేని లాలూ ప్రసాద్ పుత్రరత్నానికి గతంలో నితీశ్ ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడు. బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ నడుస్తున్నది. అంటే ఎవరిని ఎవరు చంపినా కేసులు ఉండవు. పూర్వం ధగ్గులు, పిండారీలు వంటి దోపిడీ దొంగల ముఠాలుండేవి. ఇప్పుడు బిహార్, యూపీల్లో అలాంటి ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. 2019లో తాను ప్రధానమంత్రి కావాలని నితీశ్ తహతహ.
‘ఆప్’ నుండి ప్రశాంత భూషణ్, యోగేంద్ర యాదవ్ వంటి వారు నిష్క్రమించినట్లే జెడియులోను రెండు చిల్లర పార్టీలు మళ్లీ ఆవిర్భవిస్తున్నాయి. జనతాదళ్-ఎస్ అనే కొత్తపార్టీ పుట్టింది. దాని అస్తిత్వం అంతంత మాత్రంగానే ఉంది. ఇక ప్రాంతీయ పార్టీల్లో తమిళనాడుకు చెందిన డిఎంకె చాలా బలమైనది. దీనికి ద్రవిడ సిద్ధాంత భూమికతో బాటు బలం, బలగం కూడా బోలెడంత ఉన్నాయి. ‘యాదవ కులంలో ముసలం’ అన్నట్లు కరుణానిధి పుత్రరత్నాల మధ్య వైరం ముదిరి రసకందాయంలో పడింది. ఆయన కుమార్తె కనిమొళి ఇదివరకే తీహార్ జైలు ఊచలు లెక్టబెట్టి వచ్చింది. కరుణానిధి వృద్ధాప్యంతో డిఎంకేలో నాయకత్వ సమస్య స్పష్టంగా గోచరిస్తున్నది.
ఇక అన్నా డిఎంకే మాటేమిటి? ఇది ఏకవ్యక్తి నియంతృత్వంలో సాగుతున్న పార్టీ. సినీ హీరో అయిన ఎంజీ రామచంద్రన్‌కు రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగింది. వెంటనే ఓ పార్టీ పెట్టుకున్నారు. అన్నాదురై అనే ద్రవిడ పార్టీ సిద్ధాంతకర్త ‘నాకు నిధి కావాలి- మేధి కావాలి’ అని 1955లో అన్నాడు. నిధి అంటే సంపద- మేధి అంటే ఇంటెలిజెన్స్ అంటే మేధాశక్తి. ఐతే ఈ మాటలకు వేరే అర్థాలున్నాయి. నిధి అంటే కరుణానిధి- మెధి అంటే మెధియళగడ. వీరిద్దరూ ఒక దశలో ఘర్షణకు దిగారు. అదీ అన్నాదురై వ్యాఖ్యలకు అర్థం. అలాగే రెండవ దశలో ఎంజీఆర్,కరుణానిధి ఘర్షణ పడ్డారు. ఆ నేపథ్యంలో ఎంజీఆర్ సీఎం పీఠం ఎక్కారు. ప్రఖ్యాత నటి జయలలితను తన పార్టీకి వారసురాలిగా ఆయన ప్రకటించారు. ‘పురుచ్చితలైవి’గా జయ తమిళ రాజకీయాలను శాసించారు. జయ మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని పూరించాలని భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు.
ఇక కర్ణాటక గురించి ఆలోచిస్తే అక్కడ దేవగౌడ రాజకీయ శకం ముగిసిందనే చెప్పవచ్చు. బిజెపి అధికారంలోకి రావచ్చు కాని యడ్యూరప్ప నాయకత్వానికి సవాళ్లు తప్పవు.కారణం అక్కడ లింగాయత్- వక్కళిగ- బ్రాహ్మణ వర్గాల మధ్య ఘర్షణ పెరిగింది. అంతరించి పోతున్న కాంగ్రెస్ నాయకత్వం కావేరి నదీ జలాల వివాదం అనే అంశంలో తిరిగి ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి అస్తిత్వం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నది. కేరళలో సీపీఎం అధికారంలో ఉంది. అందుకు కారణం కాంగ్రెస్‌పై ప్రజల్లో ఏర్పడిన నిరసన. కరుణాకరణ్, మురళీధరన్ శకం అక్కడ కాంగ్రెస్‌లో ముగిసింది. అట్లని వామపక్షాల్లో లుకలుకలు లేవని అనలేం. నంబూద్రిపాద్ వంటి మచ్చలేని రాజకీయ నాయకుల శకం సీపీఎంలో ముగిసింది. సీఎం రేసులో విఎస్ అచ్యుతానందన్ మీద పినరయి విజయన్ గెలుపు సాధించాడు. ‘హింస ద్వారా రాజ్యాధికారం’ అనే సిద్ధాంతాన్ని విజయన్ నమ్ముకున్నాడు. ఈయన హిందూ ద్వేషి. దేవాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలపై నిషేధం విధించాడు. రోమన్ కాథలిక్- ముస్లిం లీగ్ వర్గాలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. హత్యా రాజకీయాలను కన్నూరు జిల్లా పర్యాయ పదంగా మారింది. కేరళ మన దేశంలో సామ్యవాదుల చివరికోట. అక్కడ విజయన్ పరాజితుడైతే భారతదేశంలో సామ్యవాద శకం ముగుస్తుంది.
ఏపీ సీఎం చంద్రబాబు కష్టించి పనిచేస్తున్నా ఆ రాష్ట్రం సమస్యల ఊబిలో చిక్కుకోవలసి వచ్చింది. ఏపీకి రాజధాని లేదు, నిధులు లేవు, ప్రత్యేక హోదా లేదు. చంద్రబాబుకు వయస్సు కూడా పెరుగుతోంది. ఈ కారణంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటి? అని రాజకీయ విశే్లషకులు ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్ సాగిస్తున్న దాడికి టీడీపీ తట్టుకోలేకపోతున్నది. ఇపుడు టీడీపీకి మిగిలిన ప్రత్యామ్నాయం ఎన్నికలకు ముందే జగన్‌ను జైలుకు పంపించటం. రెండవది బిజెపితో స్నేహపూర్వకంగా విడివడటం. ఈ రెండూ అమలు చేస్తే వచ్చే పరిణామాలేమిటి? ఏపీలో ‘ప్రత్యేక హోదా’ వేడికి బీజేపీ ప్రజాబలాన్ని కోల్పోతున్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరించిపోయినట్లే. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా వుంది. ఇక్కడ పార్టీకి నేటికీ బలమైన నాయకులున్నా, కార్యకర్తలు తగ్గిపోయారు. ఏ నాయకుణ్ణి టిఆర్‌ఎస్ ఎప్పుడు కొనేస్తుందోనన్న భయం వారిలో ఉంది. తెలంగాణలో బీజేపీకి కార్యకర్తల బృందం ఉంది. కాని మాటల మాంత్రికుడైన కెసిఆర్‌తో మరే పార్టీ కూడా పోటీ పడలేకపోతున్నది. కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు పోటాపోటీగా ఇఫ్తార్ విందులు ఇచ్చిన పార్టీలే. అయినా ముస్లింలు టిఆర్‌ఎస్‌నే ఎందుకు నమ్ముతున్నారన్నది కాంగ్రెస్‌కు అంతుచిక్కడం లేదు. ముస్లిం సంతుష్టీకరణలో అంతర్భాగంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని జరపడానికి ప్రభుత్వం నిరాకరించింది. కేంద్రంలో మంత్రి పదవులు దక్కవని తెలిశాక కెసీఆర్ సంతానం మోదీపై దాడికి దిగటం గమనార్హం.
తెలంగాణలో ప్రస్తుతానికి కెసీఆర్ నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేకపోయినప్పటికీ కింది స్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ప్రజాదరణను పెంచుకుంటున్నాడు. వామపక్షాలు టిఆర్‌ఎస్‌కు దూరమైనాయి. బిజెపితో ఢిల్లీలో దోస్తీ- హైదరాబాద్‌లో కుస్తీ అనే కెసీఆర్ వ్యూహం ఫలిస్తుందా? సోనియా గాంధీ గతంలో కేసీఆర్‌ను నమ్మి మోసపోయింది. మరి మోదీ అలా నమ్ముతారా? తెరాస పాలనలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయంటే అందుకు కారణం ఎవరు? కెటిఆర్, హరీశ్‌రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏ స్థాయికి చేరుతుంది? మజ్లిస్ మద్దతుతో ‘దొరలు’ ఎంతకాలం పరిపాలన సాగించలగరు? ఇవన్నీ నవతెలంగాణలో వర్తమాన ప్రశ్నలు.
ఇక, ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ సంక్షోభం స్పష్టంగా కన్పడుతున్నది. అఖిలేష్ యాదవ్ తండ్రి చాటుబిడ్డ. తన అస్తిత్వం కోసం పాకిస్తాన్ అనుకూల వర్గాలమీద ఆధారపడ్డాడు. ములాయం సింగ్‌కు ప్రధాని కావాలనే ఆకాంక్ష వుంది. దానిని సాకారం చేసుకునేందుకు ఆయన ఎవరితోనైనా ముఖ్యంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధపడ్డాడు. మహారాష్టల్రో ప్రస్తుతానికి ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఢోకా లేపోయినప్పటికీ శివసేన వారి అతివాద హిం దూత్వం బిజెపికి నచ్చడం లేదు. హర్యానాలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు తెరపడింది. ఈ ఏడాది మరికొన్ని రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668