శిప్ర వాక్యం

ఎదురుదాడిలో భాజపా వైఫల్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ‘పత్రికల్లో మన పేర్లు రాకూడదు. టీవీల్లో మన ముఖాలు కన్పడకూడదు’ అని ఆ సంస్థల నేతలు చెబుతున్నారు. దీనికి ప్రసిద్ధి పరాన్ముఖత్వం అని పేరు. అంటే ఎట్టి యశస్సు, ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజసేవ చేయండి- అని వీరి మూల సిద్ధాంతాలలో ఒకటి. ‘వనవాసీ కల్యాణ ఆశ్రమం’ అనే సేవా సంస్థలో వందలాది మంది కార్యకర్తలు ఆదివాసీలకు ఇతోధిక సేవలు అందిస్తున్నారు. వీరి ఊరు, పేరు కూడా ఎవరికీ తెలియదు. వీరి నేతృత్వంలో ఎన్నో ఆశ్రమ పాఠశాలలు, అనాథాశ్రమాలు నడుస్తున్నాయి. ఇందుకు భిన్నంగా మావోయిస్టులు వనవాసీల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆదివాసీల సేవ పేరుతో మహాశే్వతాదేవి వంటి రచయిత్రులు జ్ఞానపీఠ పురస్కారాలు తెచ్చుకొని ఆనందించారు. ఆదివాసీలు అమాయకులు అని వేరే చెప్పనక్కరలేదు. వారిని ‘రాడికలైజ్’ చేయటం, మోసం చేయటం చాలా సులభం. ఇదిగో ఇలాంటి వర్గాలనే చైనా తన ఆయుధంగా ఉపయోగించుకుంటున్నది.
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నెహ్రూ యుగం నాటి ‘హిందూ-చీనీ భారుూ భారుూ’ నినాదం వదిలిపెట్టలేదు. ఇదొక మాయ. ఈ అవాస్తవం నుండి మోదీ ప్రభుత్వం బయటకు రాలేకపోయింది. ఫలితంగా ఉగ్రవాదం దేశంలో అగ్రవాదం అయింది. మోదీ అమాయకత్వానికి చైనా అధినేత జిన్‌పింగ్ చాటుమాటుగా నవ్వుకుంటున్నాడు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు అసలు ప్రచారమే అక్కరలేదు. భాజపా ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకోవటంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు, సాహిత్య సంగీత నాటక ఎకాడమీలు, పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం.. ఇలా ఒక్కొక్కటీ చైనా చేతిలోకి వెళ్లిపోయాయి. రోహిత్ వేముల అనే విద్యార్థి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంటే దానిని అంతర్జాతీయ సమాజం ముందుంచి భారతదేశాన్ని దోషిగా చూపించటంలో వామపక్షీయులు ఘన విజయం సాధించారు. గౌతం నవలఖ్ అనే లాయర్‌ను, మరో ఐదుగురిని కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్టుచేస్తే ఈ వార్తను అంతర్జాతీయ సమాజానికి గంటలో చేరవేసి, భారత చీఫ్ జస్టిస్‌ను కదిలించగల శక్తిని వామపక్షీయులు సంపాదించగలిగారు. భాజపా తన వైఫల్యాలకు సిగ్గుపడాలి. ప్రధాని నరేంద్ర మోదీని హత్యచేయాలని కుట్ర పన్నితే అది సమస్యే కాదు- అన్నట్లు మీడియాలో ఒక వర్గం ప్రచారానికి దిగింది. ‘మోదీ హత్యకు పన్నిన కుట్ర సఫలమైతే ఏమవుతుంది? మాకు ఒకరోజు సెలవు వస్తుంది కదా?’- అని ఒక ప్రభుత్వోద్యోగి సంబరపడతాడు..!
నాలుగేళ్ల ఎన్‌డిఏ పాలన ప్రచార మాధ్యమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, బీభత్సకారులు వాటిని ఆక్రమించుకున్నారు. వీరిని ప్రేరేపిస్తున్న వారందరినీ ప్రభుత్వం అరెస్టు చేయలేకపోయింది. భీమా కోరెగావ్ సంఘటనలో దోషులు చైనా ప్రేరేపిత మావోయిస్టులు. వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చంపాలని ప్రణాళిక రచించారు. కాని జరిగిందేమిటి? మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విలన్‌గా చిత్రించటంలో మావోయిస్టులు గెలిచారు. ‘జాతీయవాదులు’ ఘోరంగా ఓడిపోయారు.
జిగ్నేశ్ మెవానీ గుజరాత్‌లో ఒక ఆయుధాల వ్యాపారి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇతనికి చెందిన ‘ఎల్గార్ పరిషత్’ అర్బన్ నక్సలైట్ల సంస్థ. ‘దళిత వాదాన్ని ముసుగుగా వాడుకోండి.. ఆందోళనలు, అరాచకాలను సృష్టించండి’- అని ఏచూరి సీతారాం (సీపీఎం) ‘లాల్ నీల్ ఉద్యమం’ పేరుతో పిలుపునిచ్చాడు. 1818లో పీష్వాల సామ్రాజ్యాన్ని కిందకు నెట్టి ఈస్టిండియా కంపెనీ మహారాష్టల్రో అధికారం చేజిక్కించుకుంది. ఎల్గార్ పరిషత్ ఈ ఉత్సవాలను భీమ్ కోరెగావ్‌లో ఇటీవల జరిపింది. అప్పుడు జరిగిన అల్లర్ల ఫలితంగా పోలీసు కాల్పులు జరిగాయి. రోనా విల్సన్ వంటి అర్బన్ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
జంగిల్, రూరల్, అర్బన్, మీడియా.. ఇలా మావోయిస్టులు నాలుగు విభాగాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని- రాజ్యాంగంలో పేర్కొన్న భావస్వేచ్ఛ, వ్యక్తిస్వేచ్ఛ వంటి కారణాలు చూపి విడిపించుకుంటున్నారు. విరసం నేత వరవరరావు సహా కొంతమందిని అరెస్టు చేయడం అన్యాయం అని అరుణారాయ్, అరుంధతిరాయ్ వంటివారు, కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి వాదించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై స్పందిస్తూ- లాయర్లను, ప్రొఫెసర్లను, కవులను అరెస్టుచేయడం దుర్మార్గం అని నిరసన వ్యక్తం చేశారు. దీంతో జంగిల్ మావోయిస్టులకు కాంగ్రెస్ పార్టీ నుండి నిధులు అందుతున్నాయనే ఆరోపణకు బలం చేకూరినట్లయింది. ప్రధాని మోదీని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను, మాజీ రక్షణమంత్రి మనోహర్ పారీకర్, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, సుష్మా స్వరాజ్, ఎం.వెంకయ్యనాయుడు వంటి నేతలను హత్య చేయండని ఆర్.రోనా విల్సన్ సందేశాలు పంపాడు. ప్రముఖుల హత్యలకు కుట్ర పన్నుతూ మా వోయిస్టు నేతల పేరిట తమకు లభించిన లేఖలు కల్పితాలు కాదని పూణె పోలీసు కమీషనర్ స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ లాబ్‌లో విచారణ జరిపాక, తమకు లభించిన ఆరు లేఖలు యదార్థమైనవేనని ఆయన తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం ముప్పు ఉందని నిఘా విభాగాలు హెచ్చరించాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును గతంలో అలిపిరి వద్ద హత్యచేయాలని మావోలు విఫలప్రయత్నం చేశారు. కాగా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఇటీవల మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నిరసన ‘సేఫ్టీ వాల్వ్’ అని వ్యాఖ్యానించారు. నిజమే- పాకిస్తాన్‌లో, చైనాలో నిరసన గళాలు విన్పించవు. కారణం- అక్కడ నియంతృత్వం ఉంది, ప్రజాస్వామ్యం సరిపడదు. అభివృద్ధి సాధించాలంటే సైనిక నియంతృత్వం ఉండితీరాలని పాక్ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బహిరంగంగా ప్రకటించాడు. భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ మానవ హక్కుల సంఘాలు ప్రతి చిన్న విషయానికీ నిరసనలు వ్యక్తం చేస్తాయి. ఉగ్రవాదులను అరెస్టు చేసినప్పుడు, తీవ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినపడు అంతా బూటకం అని హక్కుల సంఘాలు ప్రచారం చేస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లో వందలాది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినప్పుడు మానవ హక్కుల సంఘాలు గళం విప్పలేదు సరికదా జెఎన్‌యులో మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. కన్నయకుమార్ అనే ఉగ్రవాద సానుభూతిపరుడు కాశ్మీర్ ఉగ్రవాదులను జెఎన్‌యుకి ఆహ్వానించి ‘్భరతదేశాన్ని విభజించండి’ అని నినాదాలిస్తే అతడిని అరెస్టుచేశారు. ఈ అరెస్టు అప్రజాస్వామికం అని ఏచూరి సీతారాం, రాహుల్ గాంధీ, అరుంధతీ రాయ్, అరవింద్ కేజ్రీవాల్ వంటివారు బహిరంగంగా మద్దతునిచ్చారు. ఇదీ వర్తమాన భారతదేశ ముఖ చిత్రం.
‘ఎల్గార్ పరిషత్’ ఎందుకు విధ్వంసకాండకు పాల్పడిందని ప్రశ్నిస్తే శంభాజీ భిడే వంటి అతివాద నాయకులు ఎదురు ప్రశ్నవేశారు. రెండు తప్పులు ఒక ఒప్పు కాజాలదు. ఈ తర్కం ఎలా ఉన్నదంటే- ‘మమతా దీదీ.. నీవెందుకు కలకత్తాలో హత్యారాజకీయాలు జరుపుతున్నావు?’ అని ప్రశ్నిస్తే వామపక్షాల వారు ఇలా జరపటం లేదా? అని ప్రశ్నించింది- అంటే ఈ దేశంలో ఎవరికీ రాజ్యాంగం మీద గౌరవం లేదు. అలా ఉన్నట్టు రాజకీయవేత్తలు నటిస్తూ ఉంటారు. మన దేశంలో పరిస్థితి చూస్తూంటే- పర్వేజ్ ముషారఫ్ చెప్పినట్లు ‘ప్రజాస్వామ్యంలో ప్రగతి సాధ్యం కాదు. సైనిక నియంతృత్వమే మేలు’ నమ్మే దుస్థితి వస్తున్నది.
భాజపాను విలన్‌గా చిత్రీకరించటంలో వారి శత్రువులు విజయం సాధించారు. సునీల్ చోప్రా, రొమిల్లా థాపర్, ఘనశ్యాం తివారీ, అరుంధతీ రాయ్, కంచె ఐలయ్య, తస్లీం రహమానీ, అభిషేక్ సంఘ్వీల పదునైన దాడికి సంహిత్ పాత్ర, సుధాంశు త్రివేది, రాంమాధవ్ వంటి భాజపా నేతలు తట్టుకోలేకపోతున్నారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ కుటుంబం పీకల లోతున కూరుకుపోయింది. కాని ఇపుడు రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణం పేరుతో చేసే ఎదురుదాడిని అరుణ్ జైట్లీ వంటి మేధావులు సైతం సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు. ఆయుధాల వ్యాపారి, అర్బన్ ఉగ్రవాది జిగ్నేశ్ మెవాన్ ధాటికి గుజరాత్ ప్రభుత్వం విలవిలలాడుతోంది.
*

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్