శిప్ర వాక్యం

ఔను.. భ్రమలు తొలగిపోయాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే..! హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి ఒకే జాతిగా ఈ సువిశాల దేశంలో జీవించటం జరుగదు! అలాంటి భ్రమలు ప్రజలు వదలుకోవటం మంచిది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇక ఎన్నటికీ జాతీయభావాన్ని బలపరచవు. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వనె్నల జెండాను అన్ని వర్గాల వారూ ఎగురవేస్తారు. ఆ జెండా జాతికి సంకేతం, మన సంస్కృతికి స్వాభిమానానికి ప్రతీక. ఈ ఏడాది ఆగస్టు 14న రాత్రి వేళ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లాల్‌చౌక్‌లో ఒక పౌరుడు జాతీయ జెండాను ఎగురవేస్తుండగా- కొందరు ముస్లింలు అతణ్ణి కొట్టారు. ఆ జెండాను నేలపై పడవేసి, ఐసిస్ ఉగ్రవాద సంస్థ పతాకాన్ని ఎగురవేశారు. పాకిస్తానీ జాతీయ జెండాను ఊపుతూ ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలిచ్చారు. ఈ దృశ్యాన్ని టీవీలో చూశాక- హిందువులు, ముస్లింలు జాతిగా ఉండజాలరని అనిపించింది. అదే రోజు ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఓ ముస్లిం మత నాయకుడు మాట్లాడుతూ, భారత జాతీయ జెండాను కాశ్మీర్‌లో ఎగురవేసే రోగం మాకెందుకు? అని అన్నాడు. దీనికి సీపీఎం వృద్ధనేత సునీల్ చోప్రా ‘నిజమే’ అన్నాడు. భారత్‌లో ముస్లిం లీగ్, కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ఇక ఎప్పటికీ దేశభక్తులు కాలేరు. దేశభక్తి అనే మాట వారికి కాలకూట విషం లాంటిది. కాశ్మీర్‌లో ఇలాంటి సంఘటనలు జరగటం ఇది తొలిసారి కాదు, చివరిసారి కాదు. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను ఎగురవేశారు. హైదరాబాదు పాతబస్తీలోనూ ఆగస్టు 15న కొందరు పాకిస్తాన్ జెండాను ఎగురవేశారు. ఎక్కడ ముస్లిం మెజారిటీ ప్రాంతం ఉంటుందో అక్కడ మన జాతీయ జెండా ఎగరదు. ఇక అన్ని మతాల వారూ ఐక్యంగా ఉంటారని ఆశించడం దండగే.
ఇలాంటి సంఘటన లండన్‌లోనూ జరిగింది. అక్కడ కొందరు సిక్కు యువకులు తమకు ప్రత్యేక ఖలిస్తాన్ కావాలంటూ ఊరేగింపు జరిపారు. పంజాబ్ ప్రాంతం ప్రత్యేక దేశం కావాలంటూ 1950వ దశకంలో తారాసింగ్ ఫతేసింగ్ ఉద్య మాలు నడిపాడు. 1980 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సహకారంతో భింద్రేన్‌వాలా అనే ఒక ఉగ్రవాది ప్రత్యేక సిక్కు దేశం కోసం అమృతసర్‌లోని పవిత్ర స్వర్ణదేవాలయం నుండి ఉద్యమం నడిపాడు. భద్రతాదళాలు అతడిని కాల్చి చంపాయి. అందుకు ప్రతీకారంగా- సెక్యూరిటీ గార్డుగా ఉన్న ఒక సిక్కు యువకుడు 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపాడు. దీంతో దాదాపు 4000 మంది సిక్కులను ఢిల్లీ వీధులలో ఊచకోత కోశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలే ఈ మారణకాండ జరిపించారన్న ఆరోపణలు వచ్చాయి.
***
న్యూ ఢిల్లీలో ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ (తిరుపతి) పార్లమెంటు వద్ద హిట్లర్ వేషం వేసుకొని ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ వెకిలి చేష్టలు చేశాడు. అంటే మోదీ, హిట్లర్‌లు సమానం అని ఇతని భావం. గతంలో శివప్రసాద్ శ్రీకృష్ణుని వేషం వేసుకొని సోనియా గాంధీకి మహాభారతంలోని కొన్ని పద్యాలు వినిపించాడు. తెలుగు జాతిని చీల్చకండి అంటూ మొరపెట్టుకున్నాడు. శివప్రసాద్‌ను ఢిల్లీ వీధుల్లో చంపేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్ ఆగ్రహంతో అన్నారు. సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. తెదేపా ఎంపీపై కాంగ్రెస్ నాయకుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ- అదే కాంగ్రెస్ పార్టీతో ఇపుడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొనేందు తెదేపా సిద్ధపడింది. ఇలాంటి సంఘటనలు దేనిని తెలియజేస్తున్నాయి? భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని నిలుపుకోలేరని తేలటం లేదా?
***
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులు దాక్కొని విధ్వంసక కార్యకలాపాలు జరుపుతున్నారు. చైనా అధ్యక్షుడు తమ అధినేత అని బహిరంగంగానే నినాదాలిస్తున్నారు. ఇందులో తప్పేముందని అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశే్వశ్వరరావు లాంటి మేధావులు. చత్తీస్‌గఢ్‌లో మావోలు మందుపాతర్లు పెట్టి పెద్ద సంఖ్యలో మన జవాన్లను హతమార్చినపుడు కొందరు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అంటే కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదన్నది సుస్పష్టం. రైనా విల్సన్ అనే వ్యక్తి అర్బన్, రూరల్, జంగిల్ నక్సలైట్ల మధ్య సమన్వయకర్త. ప్రధాని నరేంద్ర మోదీని, భాజపా నేతలు వెంకయ్య నాయుడు, సుషమ స్వరాజ్, మనోహర్ పారీకర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తదితరులను ఎన్నికల ప్రచారం సందర్భంగా హతమార్చాలని మావోలు కుట్ర పన్నినట్లు ఇటీవల పోలీసులకు లేఖలు లభించాయి. ఇలా హత్యలు చేసేందుకు పథక రచన చేసేవారు భారతీయులేనా?
***
కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో 2014లో భాజపా అధికారంలోకి వచ్చింది. ఐనా ఉగ్రవాదులను నిర్మూలించలేకపోయింది. దేశంలో భారీగా జరుగుతున్న క్రైస్తవీకరణాన్ని ఆపలేకపోయింది. తెలంగాణలో అధికార తెరాస పార్టీ మజ్లిస్ పార్టీతో దోస్తీ కొనసాగిస్తోంది. ‘నేను ముస్లిములకు నాయకుణ్ణి. ఇకమీద పొరపాటున కూడా హిందూ దేవాలయాలకుపోను’- అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో ప్రకటించాడు. ఇప్పుడు ఆయన రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం హిందూ ఆలయాలను సందర్శిస్తున్నాడు. కొన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థలు రాబోయే ఎన్నికలలో మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు వోట్లు వేయాలని, మోదీని ఓడించాలని బహిరంగంగా పిలుపునిచ్చాయి. అలాగే న్యూ ఢిల్లీ ఆర్చిబిషప్, అహమ్మదాబాదు ఆర్చిబిషప్ ఫత్వాలు విడుదలచేస్తూ ఎన్నికలలో క్రైస్తవులంతా జాతీయవాదులకు వ్యతిరేకంగా వోట్లు వేయాలని కోరారు. బ్రిటీషు ప్రభుత్వం ఈ దేశం నుంచి పోయినా ఇప్పటికీ క్రైస్తవీకరణం ఆగలేదు. దీనిని హిందూ పీఠాధిపతులు నిరోధించలేకపోయారు. ‘అంబేద్కర్‌ను ముసుగుగా వాడుకోండి. లాల్ నీల్ నినాదంతో దళితులను రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించండి’-అని భీంకోరెగాం ఘటన సందర్భంగా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశానికి దిక్కెవరు?
కాగా, దేశాన్ని భాజపా రక్షిస్తుందనే నమ్మకం రానురానూ తగ్గుముఖం పడుతోంది. 2050 నాటికి ఇండియా ‘ముస్లిం మెజారిటీ దేశం’గా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుర్గాపూజ, శ్రీరామనవమి వంటి హిందూ పర్వదినాలపై ఆంక్షలు విధించింది. ‘నన్ను ముస్లిం సంతుష్టీకరణజేసే నేతగా భావించండి.. నాకు అభ్యంతరం లేదు’ అని ఆమె అన్నది. బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో రెండున్నర కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులున్నారు. వారి ఓట్లతో గతంలో కమ్యూనిస్టులు, ఇపుడు మమతా బెనర్జీ అధికారం దక్కించుకున్నారు. నౌగాంగ్, ముషీరాబాదు జిల్లాలు ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా మారిపోవడంతో అక్కడ భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతుందని, మన జాతీయ జెండా రెపరెపలాడుతుందని ఆశించలేం. ముస్లింలు బలంగా ఉన్న ప్రాంతాల్లో వేర్పాటువాదం బలపడుతోంది. ప్రత్యేక దేశాలు కావాలంటూ ఆ మతం వారు ఉద్యమించే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు 1947లోనూ మనం చూశాము.
ఇక హిందూ మతానికి చెందిన కొందరు స్వామీజీలను కూడా మనం నమ్మలేం. వీరు మోక్షం గురించి గంటలకు గంటలు మాట్లాడతారే కాని దేశభక్తి, జాతీయ సమైక్యతలపై ప్రజలకు బోధించరు. హిందువులకు వ్యతిరేకంగా కొందరు రచయితలు పుస్తకాలు రాస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దళిత క్రైస్తవవర్గాలు హిందువులతో కలవరని స్పష్టంగా తేలిపోతోంది. ‘నా గొంతుకోసినా సరే.. నేను భారత్‌మాతాకీ జై అని అనను’ అన్నాడు హైదరాబాద్‌లోని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ. దేశభక్తిని ద్రోహంగా భావించే ఇలాంటి మతపరమైన పార్టీలతో తెరాస, కాంగ్రెస్ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం జగమెరిగిన సత్యం.
హైదరాబాద్‌లోని వీరశైవ విద్యావర్ధన్ హాస్టల్‌లో ఇప్పుడు బసవ జయంతి ఉత్సవాలు ఆగిపోయాయి. బ్రాహ్మణుడైన బసవన్న కులాంతర వివాహాలు ప్రోత్సహించాడు. అయితే- కర్నాటకలోని ఓ ‘వెలివాడ’లో బసవన్న జన్మించాడని ఓ రచయిత అసత్యాలతో పుస్తకం రాశాడు. ‘బసవన్న మతం అవైదికం.. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లకండి- లింగాయతులది ప్రత్యేక జాతి’ అని రాజకీయ నాయకులు, మతోన్మాద నేతలు విష ప్రచారం చేస్తున్నారు. దీంతో భారతీయులంతా ఒక్కటేనన్న విషయమై- భ్రములు తొలగిపోయాయి. మరోవైపు ‘సెక్యులరిస్టుల’ ముసుగులో వామపక్ష నేతలు, మేధావులు భారత జాతిని చీల్చేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీరి దృష్టిలో ‘జాతీయ వాదం’ తీవ్రమైన నేరం! పరిస్థితులిలా దిగజారుతూ ఉంటే- జాతి ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాలంటూ నినాదాల్చినా ఫలితం ఉంటుందా? అన్నది ప్రశ్నార్థకమే!
*