శిప్ర వాక్యం

‘ద్విజాతి సిద్ధాంతం’ ఇంకా సజీవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌లోని పుష్కర్ క్షేత్రంలో ప్రాచీన శివాలయానికి కార్తీక పూర్ణిమ నాడు ఒకాయన అభిషేకం చేయడానికి వచ్చాడు. ‘మీ గోత్రనామాలు చెప్పండి’ అని ఆయనను అక్కడున్న పూజారి అడిగాడు. ఆ వ్యక్తి ‘దత్తాత్రేయ గోత్రోద్భవస్య రాహుల్ వర్మ నామధేయస్య’అని చెప్పాడు. అలా గోత్రనామాలు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు.. సాక్షాత్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ శర్మ అయితే మనం ఆనందించవలసిందే. కేవలం ఇది ఎలక్షన్ స్టంట్ కాబట్టి రాహుల్ శర్మ పేరును ఎవరూ నమ్మరు. గతంలో హిందువుల గురించి రాహుల్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ముస్లింలకు ప్రత్యేక ఉద్యోగాలు, ప్రత్యేక ఆస్పత్రులు అంటూ వాగ్దానం చేసింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెరాస ప్రకటించింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15 ప్రకారం మతం పేరిట ఓట్లు అడగరాదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు. ఈ మేనిఫెస్టోలు రాజ్యాంగ విరుద్ధం అని ఎవరైనా కోర్టుకు వెళితే ఏమవుతుంది? పిటిషన్లు విచారించి తీర్పు ఇచ్చేనాటికి మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. మతం పేరిట ఇలా తాయిలాలు ఇవ్వడం అన్యాయం కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే- ‘అయోధ్యలో రామాలయం కడతామని భాజపా హామీ ఇవ్వడం తగునా’ అని విమర్శకులు ఎదురుదాడి చేస్తారు.
1947లో ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా మన దేశం మూడు ముక్కలైంది. ‘ఇప్పటికీ ఈ ద్విజాతి సిద్ధాంతం సజీవంగానే ఉంది. ఇది భారత జాతి విచ్ఛిన్నతకు దారితీస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇదే విధానాన్ని ఇప్పుడు తెలంగాణలో మహాకూటమి, తెరాస పార్టీలు పాటిస్తున్నాయి. ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్పటల్స్, మసీదులకు ఉచిత విద్యుత్, ప్రైవేటు ఉద్యోగాలలో ఉపాధి, ప్రత్యేక ఐటీ కారిడార్ వంటి అనేక హామీలను అధికార, విపక్ష పార్టీలు తమ తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. ఇందులో తప్పేముంది? తెలంగాణలో ముస్లిములు వెనుకబడే ఉన్నారు కదా? కాంగ్రెస్ వాదిస్తున్నది. మరి తెలంగాణలో దళితులు, బీసీలు, బంజారాలు, వంటలు చేసుకుని బతుకుతున్న లక్షలాది మంది బ్రాహ్మణులు వెనుకబడి లేరా? వీరికి ఈ ‘ప్రత్యేక’ హాస్పటల్స్, ప్రత్యేక ‘హాస్టల్స్’’ వంటివి ఏ మేనిఫెస్టోలోనూ లేవు.
‘ఎంతకైనా తెగించండి.. దేశవ్యాప్తంగా మోదీని, తెలంగాణలో కేసీఆర్‌ను ఎన్నికలలో ఓ డించండి’ అని సోనియాగాంధీ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు మీద గంపెడాశలు పెట్టుకుంది. తెలంగాణలో ఎంఐఎం-తెరాస పార్టీలు స్నేహపూర్వక ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్‌లో భాజపా తరఫున బరిలో నిలిచిన ఓ ముస్లిం మహిళను అంతం చేస్తామని మతోన్మాద పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. ఇదీ మన వర్తమాన సెక్యులరిజం. ఇలాంటి పరిస్థితులకు అన్ని పార్టీల నాయకులూ బాధ్యత వహించాల్సిందే.
* * *
‘ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానిని రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ఎలా ఇవ్వగలరు?’ అని భాజపా అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు, హిల్‌స్టేట్స్‌కు మాత్రమే వర్తించే ఈ సౌకర్యం ఆంధ్రప్రదేశ్‌కు వర్తింపజేసే అవకాశం లేదు. ఒకవేళ అలాంటిది జరగాలంటే పార్లమెంటులో బిల్లు తీసుకురావాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. రాహుల్ అధికారంలోకి వస్తే ఆ పని చేస్తారా? గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుపతిలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ‘ఇవ్వలేం’ అని తెలిసి కూడా మోదీ ఈ హామీ ఇచ్చారా? కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇస్తే తెలంగాణకు సైతం ఇవ్వాలని తెరాస నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నాలుగున్నర సంవత్సరాలు నిశ్శబ్దంగా ఊరుకొని ఎన్నికల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ఓ ఉద్యమంగా ఎందుకు మార్చారు? ఆంధ్రులకు ఆది నుంచీ అన్యాయం జరుగుతోంది. అప్పట్లో తమిళనాడు నుంచి వేరుపడ్డాక, ఇపుడు తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్రులు నిర్లక్ష్య భావానికి, నిరాదరణకు గురయ్యారు.
***
కమ్యూనిస్టులు అప్పుడప్పుడూ నిజాలు ఒప్పుకుంటూ ఉంటారు. సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి తాజాగా ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు. దాని సారాంశం ఏమంటే.. ‘దేశంలో కమ్యూనిస్టు పార్టీల్లో ఐకమత్యం లేదు, ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు..’అని. వామపక్షాల ఏకత కోసం తాను చాలా కృషిచేసినప్పటికీ సిపిఎం నాయకులు ముఖ్యంగా తమ్మినేని వీరభద్రం వ్యతిరేకించారని ‘చాడ’ చెబుతున్నారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐ కలిసి పనిచేయడాన్ని తమ్మినేని వీరభద్రం తప్పుపట్టారు. మరి రాహుల్ గాంధీ, సీపీఎం అగ్రనేత ఏచూరి సీతారాంలు ఎందుకు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు? వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం ఎందుకు బహిరంగ మద్దతు నిచ్చింది?
నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను ఓడించడానికి సీపీఐ మహాకూటమిలో చేరితే, బహుజన వామపక్ష కూటమిని సీపీఎం ఏర్పరచి విపక్షాల ఓట్లు చీలుస్తున్నదని కూడా ‘చాడ’ ఆరోపించారు. వామపక్ష కూటమికి ఒక్క స్థానంలో కూడా గెలుపు దక్కదని అంటున్నారు. చాడ వెంకటరెడ్డి తనపై నిప్పులు చెరుగుతుంటే తమ్మినేని వీరభద్రం సమాధానం చెబితే- కమ్యూనిస్టుల కలహాలు వీధినపడినట్టే. ఈ ఘర్షణతో వామపక్షాలు మరింత బలహీనమవుతాయి. వామపక్ష నేతలు భూలోక స్వర్గం సృష్టిస్తారని ఆశలుపెట్టుకున్న బడుగు జీవులకు ఈ పరస్పర దూషణలు అశనిపాతం వంటివి.
గణితశాస్త్రంలో 1+1+1+= 3 అని చెప్తారు. ఐతే రాజకీయాల్లో ఈ గణాంకాలు వర్తించవు. 1+1+1= 0 కూడా కావచ్చు. కాంగ్రెస్, కమ్యూనిస్టు- తెలుగుదేశం పార్టీలు కలిస్తే సమష్టి లాభం కన్నా నష్టమే జరిగే అవకాశాలున్నాయి. తెలంగాణలో ఇంకా ఎంతోమంది ప్రజలు చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఉన్నారు. గతంలో జనం కాంగ్రెస్‌కు, టిఆర్‌ఎస్‌కు ఓటువేశారు. ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీచేస్తుంటే ఎవరికి ఓటువేయాలో తేల్చుకోలేక అయోమయంలో పడిపోతున్నారు. అంటే చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్‌కు అనుకున్న మేరకు లాభించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఉన్న బలం పరిమితం. అతడు అర్బన్ మావోయిస్టుల సానుభూతిపరుడు. కేవలం ‘కేసీఆర్‌పై ద్వేషం’అనే అంశంతో కోదండరామ్ విజయం సాధించగలరా? కేసీఆర్‌ది కుటుంబ పాలన అని ఆక్షేపించారు. నిజమే కదా! ఐతే- రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, లోకేశ్‌లది వారసత్వ పాలన కాదా? ఈ పార్టీలకు ఒకరినొకరు విమర్శించుకునే నైతికాధికారం లేదు. ఎవరు ఔనన్నా, కాదన్నా సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్న పార్టీలు రెండే ఉన్నాయి. ఒకటి వామపక్షాలు, రెండవది భారతీయ జనతాపార్టీ. ఈ రెండు పార్టీల్లో ఏక కుటుంబ పాలన అరుదు. నరేంద్ర మోదీ బంధువులెవరూ రాజకీయాల్లో లేరు.
* * *
ఎలమంచిలి సత్యనారాయణ అనబడే సుజనా చౌదరికి సంబంధించిన ‘ఫైల్ ఫొటో’లు వెలుగులోకి వచ్చాయి. ప్రతి ఫొటోలోను చంద్రబాబుకు ఒకవైపు సిఎం రమేష్, మరొకవైపు సుజనా చౌదరి ఉన్నారు. ఈ ఇద్దరూ చంద్రబాబుకు బినామీలని ఏపీలో విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అక్రమ సంపాదనపై విచారణ జరిగినా, సులువుగా తప్పించుకునేందుకు నాయకులు ప్రయత్నించటం సహజమే.’’
అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం భారీగా వలసలు ఉంటాయి. టిఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే- తెలుగుదేశం, కాంగ్రెస్‌ల నుంచి యథాప్రకారం ఫిరాయింపులు ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గెలిస్తే టిఆర్‌ఎస్ నుంచి వలసలు ప్రారంభమైనా ఆశ్చర్యపడనక్కరలేదు.
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్