శిప్ర వాక్యం

రాహుల్‌జీ.. ఎందుకీ అబద్ధాలు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రధాని నరేంద్ర మోదీని- రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘దొంగ’ అని నేను ఎన్నికల సభల్లో అన్నాను.. ఐతే అది అబద్ధం- మోదీ దొంగ కాదు..’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేశాడు. 110 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. తాను అబద్ధం చెప్పానని ఆ పార్టీ అధ్యక్షుడు సర్వోన్నత న్యాయస్థానం ముందు ఒప్పుకోవటం ఇదే తొలిసారి. రాహుల్ తాను బ్రాహ్మణుడినని లోగడ అబద్ధం చెప్పాడు. ఇతని పేరు రాహుల్ విన్సీ అని బ్రిటీషు రికార్డులో ఉంది. తన విద్యార్హతల గురించి సైతం ఇతను అబద్ధం చెప్పాడు. తాను విదేశాల్లో డబ్బు దాచుకోలేదని కూడా రాహుల్ అసత్యం చెప్పాడు. బ్రిటీషు పౌరసత్వం ఉన్నాసరే తాను భారతీయ పౌరుణ్ణి అని అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుంది? మహారాష్ట్ర, కర్నాటకల్లో తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌ను గెలిపించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. మరి రాహుల్‌జీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఎన్నికల సమయంలో పార్టీల మధ్య పరస్పర విమర్శలు సహజమే. కాని అసత్య భాషణం తగదు. పార్టీ అధినేతలే అబద్ధాలు చెబితే కార్యకర్తల మానసిక స్థైర్యం దెబ్బతింటుంది.
***
శ్రీలంకలో దశాబ్దాలుగా ఎల్‌టీటీఈ ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటి వెనుక తమిళనాడులోని ప్రముఖులు ఉన్నారు. చైనా జోక్యం ఉంది. శ్రీలంకను బలహీన పరచేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకలో వందలాదిమంది క్రైస్తవులను ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడుల్లో హతమార్చారు. వీరు వాహిబ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. ఆప్ఘనిస్థాన్, నేపాల్, కశ్మీర్ ప్రాంతాల్లో జియాబందీ-సున్నీ- సూఫీ- షియా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటోంది. ఐసిస్ కార్యకర్తలు వాహిబ్ ఉగ్రవాద సిద్ధాంతానికి చెందినవారు. వాహిబ్ ఫండమెంటలిస్టులు హిందూ- కుర్దు- క్రైస్తవ-యూదు జాతుల మీద మాత్రమే కాదు, ముస్లింలలోని షియా, సున్నీ వర్గాలను నిర్మూలిస్తున్నారు. ఈ సంస్థ సానుభూతిపరులు తెలంగాణ, తమిళనాడు, కేరళ, యూపీల్లో ఉన్నారు. వీరికి అరేబియా, చైనానుండి మద్దతు లభిస్తున్నది. శ్రీలంకలో జరిగిన సంఘటనలు త్వరలోనే భారత్‌లోనూ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, భైంసా (తెలంగాణ), మాల్దా (బెంగాల్), ముజఫర్‌నగర్, అలీగఢ్ (ఉత్తర ప్రదేశ్) ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఇండియాలోని ఉగ్రవాద ఘాతుకాలను చూస్తూ తమకెందుకులే అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. పక్కింటికి అంటుకున్న నిప్పు తమ ఇంటికి కూడా అంటుకుంటుందని ఇప్పటికైనా క్రైస్తవ ప్రపంచం గుర్తించిందా?
***
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్‌పై భాజపా తరఫున సాధ్వి ప్రజ్ఞాసింగ్ పోటీ చేస్తున్నది. ఈమె మాలెగావ్ పేలుళ్ల కేసులో జైలుకు వెళ్లింది. హేమంత్ కర్కరే అనే పోలీసు ఆఫీసర్ ఆమెను శారీరక హింసకు గురిచేశాడట! ఆ తర్వాతి కాలంలో హేమంత్ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ మాలెగావ్ పేలుళ్ల కేసులో నేరస్థురాలని రుజువుకాలేదు. కోర్టు కేసులున్నా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్, శశి ధరూర్ వంటి ఎందరో నిందితులు ఎన్నికల్లో పోటీచేయవచ్చు. కాని సాధ్వీ మాత్రం పోటీచేయకూడదని కొందరు నేతలు అంటున్నారు. ఇదెక్కడి తర్కం? భారత రాజ్యాంగంలో ద్వంద్వ ప్రమాణాలు లేవుకదా? చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకోవటం అని అంటారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అనేది అలాంటి నినాదమే. ప్రియాంక గాంధీ వైనాడ్‌లో ఎన్నికల ప్రచారంచేస్తూ ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి రాహుల్ గాంధీని గెలిపించండి’ అని ఓటర్లను కోరింది.
***
కేరళలో మూడు రాష్ట్రాల సరిహద్దులో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం వైనాడ్ నియోజకవర్గం. గత డెబ్బయి సంవత్సరాలుగా ఇదే గాంధీ కుటుంబం ఈ దేశాన్ని పాలించింది, శాసించింది, దోచేసింది. మోతీలాల్, జవహర్‌లాల్ , ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఇలా ఒకే కుటుంబం ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వ ధోరణులతో కొనసాగుతోంది. ఇదే కుటుంబం దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది, దేశాన్ని మూడుముక్కలు చేసింది. కశ్మీర్‌ను రావణకాష్టంలా రగిలించింది. పేదలను నిరుపేదలను చేసింది. రౌడీలను, హంతకులను ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చేసింది. ఈ పాపం నుండి నెహ్రూ కుటుంబం తప్పించుకోజాలదు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణం, అగస్టా కుంభకోణాలు, బోఫోర్స్, బొగ్గు కొనుగోళ్ళు, సబ్‌మెరైన్ల కొనుగోళ్ళు, స్విస్ బ్యాంకు ఖాతాలు, పనామా ఖాతాలు, హర్యానాలో భూకబ్జాలు, లండన్ హౌస్.. ఇలా లెక్కకు మిక్కిలి ఆరోపణల్లో సోనియా, రాహుల్ , ప్రియాంక, రాబర్ట్ వాద్రా ఇరుక్కున్నారు. వీటన్నింటి నుండి తప్పించుకోవాలంటే కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావలసిందే! అందుకని ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అనే నినాదాన్ని ప్రియాంక వైనాడ్‌లో వినిపించింది. ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేసి కేవలం నెల రోజులైంది. అప్పటివరకు ఈమె విలాస జీవితానికే పరిమితమైంది. ఒక్కసారి వేదికలెక్కి ప్రజాస్వామ్య నామస్మరణ చేయటం ఏమిటి?
***
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో ఎందుకింత హింస జరుగుతోంది? దీనిపై ఇటీవల శాస్ర్తియ విశే్లషణ జరిగింది. పరిశీలకులు లోతుగా అధ్యయనం చేసి కొన్ని వాస్తవాలను తెలుసుకోగలిగారు.
* మొదటి నుండి బెంగాలీ ప్రజలు ఉద్రేక స్వభావులు. స్వతంత్ర భారత సంగ్రామంలో కూడా బ్రిటీషువారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు ఇక్కడ జరిగాయి.
* 1940 నుండి ఇక్కడ కమ్యూనిజం బలపడింది. జ్యోతిబాసు, అజయ్‌కుమార్ వంటి నాయకులు రైతుకూలీ వర్గాలను భూస్వాములపైకి రెచ్చగొట్టారు.
* 1947లో దేశ విభజన జరిగినప్పుడు తూర్పు పాకిస్తాన్‌కు సంబంధించిన హిందువులు కట్టుబట్టలతో బెంగాల్‌లోకి ప్రవేశించారు. ఐతే మాల్దా వంటి ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఇండియాలోనే ఉంచి, పాకిస్తాన్ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చారు.
* సీపీఎం నాలుగు దశాబ్దాల పాటు బెంగాల్‌ను పరిపాలించింది. అప్పుడు వారు ప్రత్యర్థులను నిర్మూలించి తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం నిలబెట్టుకున్నారు.
* మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత మూకుమ్మడిగా కమ్యూనిస్టు గూండాలు ఈ కొత్త పార్టీలో చేరిపోయారు. అంటే తృణమూల్ పేరుతో నేడు మనం చూస్తున్న హింసకు కారణం పార్టీ ఫిరాయించిన మాజీ కమ్యూనిస్టులే.
* మమతా బెనర్జీ రాజ్యాధికారం కోసం మాజీ కమ్యూనిస్టుల మీద ఆధారపడింది. మరొకవైపు బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల మద్దతును ఆమె తీసుకుంటున్నది. *

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్