శిప్ర వాక్యం

వోట్లమీద యావ.. ‘మైనార్టీ’లకు సేవ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత్రుఘ్న సిన్హా సుప్రసిద్ధ హిందీ చలనచిత్ర నటుడు. డబ్బూ పేరూ రెండు చేతులతోనూ సం పాదించుకున్న తర్వాత రాజకీయ అరంగేట్రం చేశాడు. భాజపాలో చేరి బిహార్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆ తర్వాత మంత్రి పదవిని ఆశించినా నిరాశే మిగిలింది. దాంతో సొంత పార్టీపై అలిగి కాంగ్రెస్‌లో చేరాడు. ‘కాంగ్రెస్ ఘన చరిత్ర గల పార్టీ.. గాంధీ, నెహ్రూ, జిన్నా వంటివారు మన అగ్ర నాయకులు..’ అన్నాడు. ఇదేమి దుర్మార్గం? భారత్‌ను మూడుముక్కలు చేసిన మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ అగ్రనేత ఎట్లా అవుతాడు?’ అని ప్రశ్నిస్తే- ‘నేను వౌలానా అబుల్ కలాం అజాద్ అనాలని అనుకొని పొరపాటున మహమ్మద్ అలీ జిన్నా అన్నాను..’ అంటూ వివరణ ఇచ్చాడు. శత్రుఘ్న సిన్హా నోరు జారి ఇలా అనలేదు. ఆది నుంచీ తాము ముస్లింల కోసమే పాటుపడుతున్నామని కాంగ్రెస్ వారు భావించడమే ఇందుకు కారణం. గాంధీజీ చేసినంత ముస్లిం సంతుష్టీకరణ మరెవ్వరూ చేయలేదు. దేశ విభజన తర్వాత కూడా పాకిస్తాన్‌కు భారీ వాటా రావాలని ఢిల్లీలో నిరశన వ్రతానికి గాంధీ కూర్చున్నాడు. కాగా, తమ పార్టీకి వోట్లు వేస్తే- మసీదుల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. ముస్లింలపై ఇలా అభిమానం చాటుకోవడం కాంగ్రెస్ వారికి అలవాటే. ఈ విషయంలో మిగతా పార్టీల వారూ తక్కువేమీ తినలేదు. ఒక ముస్లింను పోలీసులు అరెస్టు చేశాక, అతను నిర్దోషి అని కోర్టు ప్రకటిస్తే నష్టపరిహారం ఇవ్వాలని ఓ సీపీఎం నేత ఆమధ్య అన్నాడు. ఇలాంటి నష్టపరిహారాలకు హిందువులు అనర్హులా? ఇలా ముస్లిం సంతుష్టీకరణ ప్రాతిపదికగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం జరిగింది. భాజపా తరఫున సాథ్వి ప్రజ్ఞాసింగ్ భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేసింది. ఈమె మాలెగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. ఐనా సరే- ఆమెను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది.
దేశంలో హిందువులు తమ బానిస మనస్తత్వాన్ని ఇంకా వదులుకోలేదని అర్థమవుతున్నది. దాదాపు వెయ్యేళ్లపాటు మన దేశం పరాయి పాలనలో మగ్గింది. తత్ఫలితంగా జాతి తన స్వాభిమానాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయింది. స్వామి వివేకానంద, అరవింద యోగస్వామి, దయానంద తిలక్ వంటివారు శ్రమించినా భారత జాతి తన బానిస బుద్ధుల నుండి విముక్తం కాలేకపోయింది. శత్రుఘ్న సిన్హా ఏ పార్టీలో ఉన్నాడనేది సమస్య కాదు. కానీ- మహమ్మద్ అలీ జిన్నాను మహా నాయకునిగా ప్రశంసించే బుద్ధి ఆయనకు ఆయనకు నిజమే! 1947లో దేశం నుండి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. పాక్ శ్రేయస్సు కోసం జీవిస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. ‘మేము అధికారంలోకి వస్తే కశ్మీరు నుండి సైన్యాన్ని తొలగిస్తాం’ అన్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తాలిబన్ల కన్నా హిందూ ఉగ్రవాదం ప్రమాదకరం అని కూడా ఆయన సెలవిచ్చాడు. హిందూ టెర్రరిజం అనే పదాన్ని దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, సుశీల్‌కుమార్ షిండే, రాహుల్‌గాంధీలు విస్తృత ప్రచారంలోకి తెచ్చారు.
కమల్ పాషా బుర్కా విధానాన్ని నిషేధించినట్లు చరిత్రలో చదివాము. బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో బుర్కాను రద్దు చేశారు. ముంబయిలో బుర్కా వేసుకొని వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని లోగడ శివసేన అధినేత బాల్ థాకరే ఆరోపించాడు. తమ మతానికి చెందిన మహిళలు బుర్కా వేసుకోవడం, త్రిపుల్ తలాక్ వంటివి షరియత్‌లో భాగం అన్నారు ముల్లాలు. త్రిపుల్ తలాక్‌ను పునరుద్ధరిస్తామని రాహుల్ ప్రకటించాడు.
ముస్లిం మహిళల దుర్భర పరిస్థితికి త్రిపుల్ తలాఖ్ ఒక కారణంగా భావించి, దానిని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిషేధించింది. కాంగ్రెస్ వారు మళ్లీ త్రిపుల్ తలాఖ్‌ను తెస్తారట! దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? తాను యాదృచ్ఛికంగా హిందూ కుటుంబంలో పుట్టానే కానీ మత విశ్వాసం దృష్ట్యా ముస్లింను అని అన్నాడు జవహర్‌లాల్ నెహ్రూ. ‘మతమన్నది మా కనులకు మసకైతే మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు అల్లా- అల్లా అని గేయం రాసిన దేవులపల్లి కృష్ణశాస్ర్తీ జలియన్‌వాలా బాగ్ దురంతాలపై, నౌకాలీ (బంగ్లాదేశ్) ఘోర హత్యలపైనా కవితలు రాయలేదు ఎందుకని?
ఒక వ్యక్తి ముస్లిం అయినంత మాత్రాన దుర్మార్గుడు కాడు. హిందువుగా పుట్టినవారంతా దైవ స్వరూపులు కారు. కానీ, ఎక్కడ మెజారిటీలో హిందువులు ఉంటారో అక్కడ ముస్లిములు, క్రైస్తవులు సుఖ జీవనం చేయగలరు. ఎక్కడ హిందువులు మైనారిటీలో ఉంటారో అక్కడ వారికి అస్తిత్వం లేదు. ఇది చారిత్రక సత్యం! శ్రీలంకలో తాజాగా వందలాది మంది క్రైస్తవులు హత్య చేయబడ్డారు. ఈ దారుణాన్ని ప్రపంచ నే తలంతా ఖండించారు. కానీ సోని యా గాంధీ ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. రాయబరేలీ నుంచి ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ముస్లిం వోట్లపై బెంగతో సోనియా శ్రీలంకలో క్రైస్తవులను ‘ఐసిస్’ హతమార్చడాన్ని ప్రస్తావించలేదు. ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ కార్యకర్తలు శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ సంస్థ సిరియాలో పుట్టింది. వాహిబ్ ఫండమెంటలిజం వీరి మూల సిద్ధాంతం. హిందువులు, క్రైస్తవులు, యూదులు, కుర్దులు భూమి మీద ఉండకూడదనేది వీరి లక్ష్యం. ఐసిస్ ఉగ్రవాద మూలాలు కేరళలోకి వ్యాపించాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వీరికి సానుభూతిపరులున్నారు. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై రష్యా, చైనాలు విమాన దాడులు చేశాయి. ఇప్పుడు శ్రీలంక కూడా దాడులు మొదలుపెట్టింది. ఎల్‌టీటీఈ (తమిళపులుల) వేర్పాటువాదం వల్ల అన్ని విధాలా నాశనమైన శ్రీలంకలో ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదలైంది. ఇవన్నీ చూశాకైనా మన నేతలకు కనువిప్పు కలుగుతుందా?
***
ఒకప్పుడు రైల్వేమంత్రిగా ఉన్న లాల్‌బహదూర్ శాస్ర్తీ ఓ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇలాంటి త్యాగ ధనులు ఈ తరంలో ఎందుకు లేకుండాపోయారు? తెలంగాణలో ఇంటర్ మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణలో అనేక లోపాలు జరిగాయి. దాదాపు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఈ విషాదానికి బాధ్యులు ఎవరు? జవాబుపత్రాలు దిద్దిన లెక్చరర్లదా? ఇంటర్ బోర్డుదా? కంప్యూటర్లదా? గ్లోబరీనా సంస్థదా? ఆ సంస్థకు అనుకూలగా వ్యవహరించిన రాజకీయ నేతలదా? గోరంతలు కొండంతలు చేసి అల్లరి చేస్తున్న విపక్షాలదా? ఎవరిది బాధ్యత? తెలంగాణలో పరీక్షలు రాసిన విద్యార్థులదే బాధ్యత. ఒకప్పటి నేతలు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఈతరం నాయకులు రాజకీయాల్లోకి వచ్చి, కార్పొరేట్ సంస్థల సేవలో తరిస్తున్నారు. ఆత్మహత్యలు మహాపాపం అని వివిధ మతాల పెద్దలు సెలవిస్తుంటారు. మరి- ఈ మహాపాపాలకు కారణమైన ప్రభుత్వాన్ని వీరు ఎందుకు ప్రశ్నించరు? *

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్