శిప్ర వాక్యం

ఫెడరల్ ప్రయోగం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. మా చిన్నతనంలో ఈయన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చదువుకున్నాము. బెంగాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్క్సు, ఎంగెల్స్, లెనిన్ వంటి వారి జీవితాలు పాఠ్యాంశాలుగా పెట్టారు. ఇదే పని త్రిపురలోను, కేరళలోనూ జరిగింది.
కలకత్తాలో విద్యాసాగర్ పేరుమీద ఒక కళాశాల ఉంది. అక్కడ సాగరుని విగ్రహం ఉంది. దానిని 14-5-2019నాడు విద్యార్థులు ధ్వంసం చేశారు. సందర్భం ఏమిటంటే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కలకత్తాలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఒక రోడ్‌షో నిర్వహించారు. దానిపై తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు దాడి చేశారు. వాహనాలు తగలబెట్టారు. కార్యకర్తలపై రాళ్లు, కర్రలు ప్రయోగించారు. బాంబులు విసిరారు. కలకత్తా యూనివర్సిటీ ప్రాంగణంలో నుండి జరిగిన దాడిలో పెద్దఎత్తున ప్రజలు గాయపడ్డారు. బెంగాల్‌లో హింస కొత్తకాదు. కమ్యూనిస్టులు హింసమీద ఆధారపడి రాజ్యాధికారం సంపాదించారు. సోనియాగాంధీతో రాజకీయంగా విభేదించి మమతా బందోపాధ్యాయ అనే ముస్లిం వనిత తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ స్థాపించింది. ఆమె అధికారంలోకి వచ్చాక బెంగాల్, భారతదేశంలో అంతర్భాగం అని మరచిపోయింది. దాదాపు వందమంది ప్రత్యర్థులను హత్య చేయించింది. పంచాయితీ ఎన్నికల సందర్భంలో సి.పి.యం., బి.జె.పి. కార్యకర్తలను హత్య చేయించి నెగ్గింది. ఈమె మీద శారదా చిట్‌ఫండ్ స్కాం, నారదా టేపుల స్కాం, రోజ్‌వాలీ స్కాం, కలకత్తా ఫ్లైఓవర్ నిర్మాణాల అవినీతి వంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ‘నాకెవరైనా ఎదురొస్తే నాశనం చేస్తాను’ అని ఈ కలకత్తా కాళి ప్రతిజ్ఞ చేసింది. మా మమతమ్మ చాలా మంచిది అని కర్ణాటక నాయకుడు హెచ్.డి.దేవగౌడ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కితాబునిచ్చారు. విద్యాసాగర్ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారు? బి.జె.పి. వారే అంటున్నది మమత. అంటే తమ వాహనాలను తామే ధ్వంసం చేసుకొని తమ కార్యకర్తలను తామే కొట్టుకొని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ నేరాన్ని టి.ఎం.సి. మీదికి బి.జె.పి. వారు నెట్టారా?
విగ్రహాలను ధ్వంసం చేసే ఉగ్రవాద సంస్కృతి కమ్యూనిస్టులది. హైదరాబాదులో టాంక్‌బండ్‌పై అన్నమయ్య, పోతన, శ్రీనాథుడు, బళ్లారి రాఘవ వంటి ఎందరో మహనీయుల విగ్రహాలను ప్రొఫెసర్ కోదండరాం మిత్రులు ధ్వంసం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అత్యంత ఉన్నతమైన గౌతమబుద్ధుని విగ్రహాన్ని నేలకూల్చారు. నేపాల్‌లో పురాతన తాళపత్ర గ్రంథాలయాన్ని భట్టరాయ్ అనే చైనా ఏజెంటు తగలబెట్టాడు. నిన్న విశాఖపట్నం బీచ్‌రోడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు విగ్రహాలను తొలగించారు. ఇదంతా ఇటీవలి చరిత్రయే. ఈ పనులు చేసిన వ్యక్తులు ప్రాంతాలు ఒక్కటికాకపోవచ్చు కాని వీటి వెనుక ఉన్న మనస్తత్వం మాత్రం ఒక్కటే. అది విధ్వంసం. కుమారి మమతాబెనర్జీ విధ్వంసక శక్తి. ఆమెను ముఖ్యమంత్రిణిగా ఎన్నుకోవటం వర్తమాన భారత ప్రజాస్వామ్య దుర్గతికి అద్దంపడుతున్నది. తన రాష్ట్రంలోకి భారత ప్రధాని నరేంద్రమోడీ అడుగుపెట్టడానికి వీలులేదు అన్నది.
ఏ.పి.లో చంద్రబాబునాయుడు, మోడీ అమరావతి, విశాఖపట్నం పర్యటనలకు వచ్చినప్పుడు నల్లజండాలు చూపించి అల్లరిచేశాడు. ఫెడరలిజం వికృత రూపాన్ని దాల్చింది అనడానికి ఈ సంఘటనలు స్పష్టమైన ఉదాహరణలు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ఇండియన్ యూనియన్‌లో అంతర్భగాలుగాకాక స్వతంత్ర దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకపోతే ప్రత్యేక దేశం కోరుతాము అని 2014 ప్రాంతంలో తెలంగాణా రాష్టస్రమితి నాయకులు అన్నారు. తమిళనాడు, ఏ.పి. శ్రీలంక కలిపి ప్రత్యేక ద్రవిడ దేశం నిర్మించాలని అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్ వంటి ద్రవిడ మునే్నత్ర కజగం నాయకులు ఉవ్విళ్ళూరారు. అందుకు ఎన్.టి.రామారావుతో ఎం.జి.రామచంద్రన్ మంతనాలు జరిపారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం అవతరణ ఈ దశలో ఒక ముందడుగు. కలకత్తాలో ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు. రోడ్లపై పబ్లిక్ నల్లాల కింద స్నానాలు చేయటం నేను స్వయంగా చూశాను. ప్రజలకు కూడు గుడ్డ ఉపాధి, ఉద్యోగాలు సమకూర్చలేని పాలకులు విధ్వంసం రెచ్చగొట్టి తమ రాజ్యాధికారం కాపాడుకుంటూ ఉండటం చరిత్రలో మనం చాలాసార్లు చూశాము. కలకత్తాలో జైశ్రీరాం అనకూడదు. కాళీమాతకీ జై అనకూడదు. భారత్ మాతాకీ జై అనకూడదు. మమతాదీదీ జిందాబాద్ అని మాత్రమే అనాలి. విష్ణునామం స్మరించకూడదు. జై హిరణ్యకశ్యపాయనమః అనాలి. అన్ని పురాణాలల్లో ఒక రాక్షసుడు శాసించాడనే కథ మనకు అందరికీ తెలుసు. రాక్షసులు కృతయుగం, త్రేతాయుగాల్లో ఉండరు. ఆధునికంగా కూడా చీరెలు కట్టుకొని పాంట్లువేసుకొని తిరుగుతూ ఉంటారు. వీరిని నియంత్రించటం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం విఫలమయింది. దేశ సమైక్యతకోసం ఇకనైనా ఫెడరలిజానికి స్వస్తి పలకండి. పినరాయ్ విజయన్ (కేరళ), మమత (బెంగాల్), చంద్రబాబునాయుడు (ఆంధ్ర), కెసిఆర్ (తెలంగాణా), స్టాలిన్ (తమిళనాడు), హెచ్.డి.కుమారస్వామి, సిద్ధరామయ్య (కర్ణాటక), మాయావతి (యు.పి), కమలనాథ్ (ఎం.పి), ఉద్ధవ్‌థాకరే (మహారాష్ట్ర), లల్లూప్రసాద్‌యాదవ్ (బీహార్) వంటి నియంతల నుండి భారతదేశ సమైక్యతను పరిరక్షించండి.
***
భారతీయులంతా కోతులు అన్నాడు శ్యాంపెట్రోడా. ఈయన రాజీవ్‌గాంధీకి మిత్రుడు. రాహుల్‌గాంధీకి ఒక రాజకీయ గురువు. ఇండియా బనానా రిపబ్లిక్ అన్నాడు రాబర్ట్ వాద్రా. అంటే వెనె్నముక లేని దేశం అని అర్థం. భారతదేశాన్ని ముక్కలుముక్కలు చేయండి అన్నాడు కన్నయకుమార్ అనే న్యూఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నాయకుడు. నా గొంతుమీద కత్తిపెట్టినా సరే నేను భారత్ మాతాకీ జై అని అనను అన్నాడు హైదరాబాద్‌లోని మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ. బెంగాల్‌లో నేను దుర్గాపూజలు జరుగనివ్వను అన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బంధోపాధ్యాయ. కేరళలో ఓణం ఉత్సవాల్లో ముగ్గులు ప్రభుత్వ కార్యాలయాల ముందు వేయడానికి వీలులేదు అని శాసించాడు మార్క్సిస్టు ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్. అయోధ్యలో రామాలయం కట్టడానికి బదులు యూరినల్స్ కట్టండి ప్రజోపయోగకరంగా ఉంటుంది అన్నాడు యుపి బి.ఎస్.పి. నాయకుడు కాన్షీరాం. ఇండియాలో హిందువుగా పుట్టడంకన్నా గాడిదగా పుట్టడం మంచిది అన్నాడు మోతీలాల్ నెహ్రూ. భారత మాతను కారం దంచిన రోకలితో దంచండి- అన్నాడు జ్వాలాముఖి అనే తెలుగు కవి. ఇదేమి దేశం? వీరేమి నాయకులు? 1947కు ముందు ప్రాణాలు అర్పించి, కొందరు సాధించిన స్వాతంత్య్రాన్ని ఈ దేశం నిలుపుకుంటుందనే నమ్మకం పోతున్నది. ఒకే జీవిత కాలంలో రెండుసార్లు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించిన వినాయక దామోదర్ సావర్కార్ స్మృతిచిహ్నాన్ని అండమాన్ జైలులో పగలగొట్టివచ్చి ‘మీరు చెప్పినట్లే చేశాను’ అని తన నాయకురాలికి నివేదించాడు మణిశంకర్ అయ్యర్ అనే తమిళనాడుకు చెందిన భ్రష్ట బ్రాహ్మణుడు.
***
భారతీయ స్థాయిలో కమ్యూనిజం త్వరత్వరగా అంతరించిపోతున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను అదే జరిగింది. ఇది కాలంచేసిన ఇంద్రజాలం. 1952లో భారతీయ జనసంఘ్ అనే పార్టీ న్యూఢిల్లీలో ఆవిర్భవించింది. దానికి అధ్యక్షుడు శ్యామప్రసాద ముఖోపాధ్యాయ. ప్రధాన కార్యదర్శి దీనదయాళ్ ఉపాధ్యాయ. 1954లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి ఐదుగురు పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. అప్పుడు దేశమంతా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూగారి హవా సాగుతూ ఉండేది. కాంగ్రెసు కాదంటే కమ్యూనిస్టుపార్టీలు మాత్రమే ఉండేవి. కాలప్రభావంలో డెబ్బది సంవత్సరాలు గడిచిపోయాయి. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ మళ్లీ డిపాజిట్లు పోగొట్టుకునే స్థానంలోనే ఎందుకు ఉన్నది? ఐతే కమ్మ-లేకుంటే రెడ్డి మరో పార్టీకి స్థానం లేదు అంటున్నారు.
ఇలా ఎందుకు?
ఇటీవల కాపు కులస్థులు తమ అస్తిత్వంకోసం తీవ్రంగా పోరాడుతున్నారు. రుద్రమదేవి శ్రీకృష్ణదేవరాయలు తమ కులస్థుడేనని పుస్తకాలు వ్రాసి నాకు పంపారు. ఈ చారిత్రకాంశాలు ఎలా ఉన్నప్పటికీ కాపులకు చిరంజీవి, పవన్‌కల్యాణ్ వంటి సినీతారలు నాయకులు ఉండి పొలిటికల్ గ్లామర్ సృష్టించినా ఎలక్టోరల్ గ్రామర్ నేర్చుకోలేకపోయారు. అందువలన వారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేకపోతున్నారు. బి.జె.పి. తొలి దశలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులను నమ్ముకున్నది. తర్వాతి దశలో బి.సి. వర్గాలలోకి ప్రవేశించింది. ఐనా కమలం పేరుచెపితే ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాలు దూరంగా ఉంటున్నారు. వీరు మొత్తం భారతదేశంలో ముప్పది కోట్లకు పైగానే ఉన్నారు. వీరి ఓట్లే ఎన్నికల విజయానికి కీలకం అయినాయి. భారతీయ జనతాపార్టీ హిందూత్వ ఎజెండాతో సమాజంలోకి పోయింది. మాకు హిందూత్వం వద్దు ఉద్యోగాలు కావాలి అని స్పష్టంగా తెగేసి చెప్పారు కమ్యూనిస్టులు. దేశభక్తి సరిహద్దుల రక్షణ ఎవడికి కావాలి? ప్రజలకు ఉపాధి కావాలి అని శ్రీమతి ప్రియాంకా రాబర్ట్ వాద్రా మొన్న ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపన్యాసం దంచింది. కె.సి.ఆర్ అబద్ధాలు చెపుతాడు- నారా చంద్రబాబునాయుడు అవినీతిపరుడు పోలవరం పేరుతో వేల కోట్లు దోచేశాడు అని ఆరోపిస్తున్నారు. కాని ప్రజలు ఈ నాయకులనే ఇనే్నళ్లు ఎందుకు నమ్ముతున్నారు? నారా- కాకుంటే వైఎస్ జగన్ అంతే కాని కన్నాలక్ష్మీనారాయణ (బి.జె..పి) ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఆమోదింపబడటం లేదు? పార్టీ అగ్రనాయకులు స్థిమితంగా కూర్చొని ఆలోచించాలి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్