శిప్ర వాక్యం

సంక్షోభంలో విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైలు ఎక్కినవాడు దిగక తప్పదు. రైలు ఎవరి స్వంతమూ కాదు. ప్రయాణం ఒక మజిలీ మాత్రమే. దిగాల్సిన స్టేషన్ వచ్చినపుడు దిగిపోవాల్సిందే. ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగుదేశం’ ఒక పార్టీ కాదు. ఒక చారిత్రక ఉద్యమం. అక్రమాలకు, అరాచకాలకు నిలయంగా మారిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో గద్దె దింపేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అవతరించిన ‘ప్రజావాణి’ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ సినీ గ్లామర్, కమ్మ సామాజిక వర్గం కఠోర సంకల్పం, సైద్ధాంతిక నిబద్ధత అన్నీ ఆనాడు కలిసి వచ్చాయి. మరి అదే సినీ గ్లామర్‌తో వచ్చిన చిరంజీవి, పవన్‌కల్యాణ్, కమల్ హాసన్, శివాజీ గణేశన్ స్థాపించిన రాజకీయ పార్టీలు ఫ్లాప్ అయ్యాయి.
తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు రూపంలో ముప్పు తప్పలేదు. పదవి నుంచి తప్పించినపుడు ఎన్టీఆర్‌ను బాబు అనుచరులు నానారకాలుగా అవమానించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న తెదేపా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూసింది. చంద్రబాబుకు తన రాజకీయ జీవితంలో కోలుకోలేని రీతిలో పరాజయం ఎదురైంది. ఈ పరాభవానికి తెలుగువారు ఎవరూ ఇపుడు బాధ పడడం లేదు. రైలు ఎక్కినవాడు దిగకమానడు అని అనుకున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు మాత్రం- పార్టీకి ఈ దుస్థితి వచ్చినందుకు కన్నీరు పెట్టుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. లోక్‌సభలో భాజపాకు తిరుగులేని ఆధిక్యత రావడంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోయారు. ఏక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు వచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా వాంటి ప్రముఖులే కాదు, వారి వందిమాగధులైన అహ్మద్ పటేల్, అభిషేక్‌సింగ్ సాంఘ్వి, సంజయ్ ఝా, రాజీవ్ దేశాయ్, అంబికా సోనీ, షీలా దీక్షిత్ తదితర నేతలు సైతం భంగపడ్డారు. 1947లోనే కాంగ్రెస్ తన మహోన్నత చారిత్రక బాధ్యతను ముగించింది. ఇక, కాంగ్రెస్ పార్టీ పేరు చరిత్ర పుటల్లో మిగిలిపోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఐదేళ్లకే ప్రాభవం కోల్పోయింది. జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పవన్‌కల్యాణ్ ఓడిపోయినంత మాత్రాన కాపు ఉద్యమం ఆగదు. అది మరో ముద్రగడ రూపంలో ప్రారంభం కావచ్చు. రాజకీయ పార్టీల, సామాజిక సంస్థల ఉత్థాన పతనాలు సహజం అని గ్రహించాలి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు కీలకపాత్ర పోషించి, ఇపుడు దాదాపు అదృశ్యమైపోయాయి.
లోక్‌సభలో ఇపుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. ఫలితంగా ఆ పార్టీలో సంక్షోభం ద్విముఖంగా సాగింది. మొదటిది- ఆనువంశిక నాయకత్వం అంటే నెహ్రూ కుటుంబ వారసత్వం. దీనిని కొందరు వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్‌కు సోనియా గాంధీ నేతృత్వం అనివార్యమైంది. ఇటలీ దేశస్థురాలైన ఆమె మూడు దశాబ్దాల పాటు పార్టీని శాసించింది. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేకపోయినప్పటికీ సోనియా కుమారుడు అనే గౌరవంతో ఆయనను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో సాక్షాత్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అమేథీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు.
ఇక రెండవ అంశం సిద్ధాంతపరమైనది. స్వాతంత్య్ర ఉద్యమం కాలంలో ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’కు మూలాధారం జాతీయ వాదం. ఇపుడు కాంగ్రెస్ పార్టీని సెక్యులరిస్టుల కబ్జా చేశారు. అహమ్మద్ పటేల్ ముస్లిం. పి.చిదంబరం క్రైస్తవుడు. సోనియా గాంధీ ఇటలీకి చెందిన రోమన్ కేథలిక్ మతస్థురాలు. ఇక- దిగ్విజయ్ సింగ్, శశిధరూర్, సుశీల్‌కుమార్ షిండే వంటి కోటరీ హిందూత్వ ద్వేషులు. మణిశంకర్ అయ్యర్ క్రైస్తవ కమ్యూనిస్టు. అండమాన్ వెళ్లి వీర దామోదర సావర్కర్ స్మృతి ఫలకాన్ని బద్దలుకొట్టి ఆయన పాశవికానందాన్ని అనుభవించాడు. రాహుల్ గాంధీని అడ్డం పెట్టుకొని వామపక్ష భావాలున్న కొందరు నాయకులు కాంగ్రెస్‌ను ‘హిందూ వ్యతిరేక పార్టీ’గా మార్చేశారు. ఇదే వర్తమాన సంక్షోభం.
కాంగ్రెస్ పార్టీలోకి కమ్యూనిస్టుల ప్రవేశం 1947లోనే వి.కె.క్రిష్ణమీనన్‌తో ప్రారంభమయింది. నెహ్రూ చేత ‘సోషలిస్టు పాటరన్ ఆఫ్ సొసైటీ’ని నిర్మింపజేస్తామని ఆనాడు కమ్యూనిస్టులు అనిపించారు. గోమాతపై, గాయత్రి మంత్రంపై గౌరవం అక్కరలేదు. ‘హిందూ’ అనే పదం వారి దృష్టిలో అత్యంత ప్రమాదకరమైనది. ముస్లింల రక్షణే తమ పార్టీ పరమావధి అనే అభిప్రాయం సమాజానికి కలిగేటట్లు కాంగ్రెస్ నాయకులంతా ప్రవర్తించారు. ఫలితంగా సిపిఐ- ముస్లిం లీగ్- కాంగ్రెస్ పార్టీలకు తేడా ఏమిటో ప్రజలకు తెలియకుండా పోయింది. ఈ దశలో మదనమోహన మాలవ్య, బాలగంగాధర తిలక్ వంటి మహాపురుషుల భావజాలంతో భాజపా అవతరించింది.
రాహుల్ పరాజయానికి ఆయన చుట్టూ ఉన్న కోటరీ (దుష్టగణం) కారణమనే మాట నేడు బలంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ క్రైస్తవుల వద్దకు వెళ్లి తాను బాప్టిజం పుచ్చుకున్న క్రైస్తవుడినని చెప్పుకున్నాడు. హిందువుల దగ్గరకి వచ్చి తాను యజ్ఞోపవీతం ధరించిన దత్తాత్రేయ గోత్రీకుడినైన బ్రాహ్మణుడినని ప్రకటించుకున్నాడు.
లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే కనీసం 55 సీట్లు ఉండాలి. 2014లో కాని 2019లో కానీ కాంగ్రెస్‌కు ఇలాంటి అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆశించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పదవులను ఆశింపవచ్చు. మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, హెచ్.డి.దేవగౌడ వంటి చాలామంది ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకొని విఫలురైనారు. గత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఓడిపోయాడు. ఈయన కర్ణాటక ప్రాంతానికి చెందిన దళిత నాయకుడు. లింగాయత మతం స్వీకరించాడు. నేటికి 800 సంవత్సరాలకు పూర్వం బసవన్న అనే ప్రవక్త ఈ మతాన్ని స్థాపించాడు. బసవన్న దేశభక్తుడు. ఆయన ఒక రాత్రి మల్లికార్జున ఖర్గే కలలోకి వచ్చి- ‘నువ్వు ఇండియా సేవకు బదులు ఇటలీకి సేవ చెయ్యి’ అని చెప్పాడా? ఖర్గేకు సోనియాపై ఎందుకింత అభిమానం? ఆమె పేరు చెప్పుకొని వేల కోట్ల స్థిరాస్తులను ఖర్గే వంటి కాంగ్రెస్ నాయకులు కర్ణాటకలో సంపాదించుకున్నాడు. బసవన్న కన్నడంలో ఇలా చెప్పారు. ‘‘పట్టులోన ఒక పోగును దాచను చిన్నమెత్తు బంగారము దాచను’’ అని దోచుకున్నవాడే కాదు దాచుకున్నవాడూ దొంగయే. వ్యక్తికి స్వంత ఆస్తి ఉండకూడదు- అన్నాడు బసవన్న. మరి ఖర్గే ఇంత ఆస్తి ఎలా కూడబెట్టాడు? ఈయనను కాంగ్రెస్ పార్టీ 2014లో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎలా నియమించింది?
దేవగౌడ, ఖర్గే ఓడిపోయినందుకు కర్ణాటకలో ఎవరూ బాధపడటం లేదు. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ సూడో సెక్యులరిస్టు. బెంగళూరు నగరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. ఓడిపోయినా, భారత జాతీయవాదంపై పోరాటం చేస్తానని ఆయన ప్రకటించాడు.
***
తెలంగాణలోని మంచిర్యాల ప్రాంతంలో ప్రవీణ్ అనే ఒక క్రైస్తవ మత బోధకుడున్నాడు. స్వస్థత కూటములు నిర్వహించి చాలా ప్రాచుర్యం పొందాడు. రోగుల నెత్తిపై చెయ్యిపెట్టి స్వస్థత కల్పిస్తాడట! కొబ్బరినూనె పూసి రోగం నయమైందని చెపుతాడు. రాజేశ్ అనే కుర్రవాడికి జ్వరం వచ్చింది. అతణ్ణి ఆస్పత్రికి బదులు స్వస్థత కూటమికి తల్లి తీసుకుపోయింది. సకాలంలో వైద్యం అందక రాజేశ్ మరణించాడు. ‘అయ్యో.. మత బోధకుడు ప్రవీణ్ ఆలస్యంగా వచ్చాడు. లేకుంటే నా కొడుకు బతికేవాడ’ని ఆమె విలపించింది. అలనాడు మదర్ థెరిసాకు అనారోగ్యం చేస్తే ఆస్పత్రిలో చేర్పించారు. క్రైస్తవ మతపెద్ద పోప్‌కు అనారోగ్యం వస్తే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతారు. పుష్పగిరి పీఠాధిపతికి కారు యాక్సిడెంటు జరిగినప్పుడు ఆరునెలలు సికిందరాబాద్ ఆస్పత్రిలో ఉన్నారు. జయేంద్ర సరస్వతి అపోలో హాస్పటల్‌లో వైద్యం చేయించుకున్నారు.
ఎంతటి వారికైనా అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం అవసరం. ప్రార్థనలు, పూజల వల్ల ఆత్మవిశ్వాసం- పాజిటివ్ ఎనర్జీలు పెరుగుతాయి. పాము కరిచినప్పుడు విషానికి విరుగుడుగా ఇంజక్షన్ ఇవ్వవలసిందే కాని ప్రార్థన చేస్తే నయం కాదు. మరి నేడు సమాజంలో వ్యాపారం కోసం, మత మార్పిడుల కోసం ఇలాంటి స్వస్థతా కుటములు నడిపి కొందరు జనం ప్రాణాలు తీస్తున్నారు. మూఢులు వీరిని నమ్మి మోసపోతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా- ‘కుంటివాడు పరుగెడుతున్నాడు.. గుడ్డివాడు చూడగలుగుతున్నాడు..’ అని టీవీ చానళ్లలో ప్రకటనలు ఇస్తూ కొందరు డబ్బు సంపాదిస్తున్నారు. దీనిని ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి.
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్