శిప్ర వాక్యం

‘కోదండ’ పార్టీకి కాంగ్రెస్ అండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దికాలం క్రితం తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ‘తెలంగాణ జన సమితి’ పార్టీకి ఎవరు ఆర్థిక సహాయం చేస్తున్నారో తనకు అంతా తెలుసునని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలను మీడియా అంతగా పట్టించుకోలేదు. కాగా, మహారాష్టల్రోని పూణె నగరంలో పోలీసులకు కొన్ని రహస్య పత్రాలు దొరికాయి. అందులోని అంశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఓ కుట్రకు సంబంధించి పోలీసులు కొన్ని విషయాలను బహిర్గతం చేశారంటే ఏవో కొన్ని ఆధారాలు ఉండే ఉంటాయి. ఆ విధంగానే కేసీఆర్ మాటలను సైతం మనం విశ్వసింపక తప్పదు. అంటే- కేసీఆర్ మొదట భావించినట్లు కోదండరాం పార్టీ ‘తెజస’ తాడూ బొంగరం లేనిది కాదు. దీని వెనుక ఏదో నిర్దిష్ట వ్యూహం ఉన్నది అనేది సుస్పష్టం.
ఆందోళనకర కుట్ర..
పూణెలో పోలీసులకు లభించిన కొన్ని రహస్య పత్రాల్లోని సారాంశం ఏమిటంటే- భారతదేశంలో విచ్ఛిన్న కార్యకలాపాలకు కాంగ్రెస్ పార్టీ నిధులను సమకూరుస్తుంది.. ప్రధాని నరేంద్ర మోదీ దిగ్విజయ యాత్రను నిరోధించడానికి ఉగ్రవాదులతో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక విధంగా చేతులు కలుపుతుంది.. దేశవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ముసుగుగా వాడుకొని దళిత ఉద్యమాలను విరివిగా ప్రోత్సహించడం, తద్వారా అరాచకాన్ని సృష్టించడం.. అరణ్యాలలోని తీవ్రవాదులతోబాటు అర్బన్ మావోయిస్టులు దళితులను ముసుగుగా వాడుకొని సాగించే అల్లర్లు, ఆందోళనలను ప్రోత్సహించడం.. జైలుశిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా వంటి మావోయిస్టు సానుభూతి పరులను విడిపించేందుకు ఆర్థిక, న్యాయపరమైన సహాయాలను అందించడం..
ఇలాంటి కార్యక్రమాలకు గుజరాత్‌కు చెందిన జిగ్నేశ్ మెమన్ వంటి దళిత నాయకులు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. పూణె పోలీసులకు లభించిన లేఖల్లో కొందరు మావోయిస్టు నాయకుల పేర్లు ఉదాహరింపబడి ఉన్నాయి. ఈ లేఖను ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు చెందిన టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈ ఏడాది జనవరిలో రాసిన ఈ లేఖలోని అంశాలు భారతజాతిని ఆందోళన కలిగించేవే. ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ఎందుకు వచ్చింది? వందేళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అలనాడు మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్, చిత్తరంజన్ దాస్, టంగుటూరి ప్రకా శం వంటి ప్రముఖుల నేతృత్వంలో దేశభక్తి, అహింస, త్యాగం లాంటి మూలసూత్రాలతో నడిచింది. ఇవాళ ఆ పార్టీ ఇటలీకి చెందిన సోనియా కనుసన్నలలో నడుస్తోంది.
ఇప్పుడు మనం తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు చెబుతున్న మాటలను విశ్వసించాలి. అంటే- ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమానికి, ఆయన స్థాపించిన పార్టీకి కాంగ్రెస్ నుండి నిధులు అందుతున్నాయని సారాంశం. కాగా, కేసీఆర్ చేస్తున్న రెండు ప్రయోగాలు ఇపుడు ప్రశ్నార్థకంగా మారాయి. మొదటిది ఫెడరల్ ఫ్రంట్. దేశంలోని కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రాంతీయ పార్టీలనన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొని రావాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ఆ ఫెడరల్ ఫ్రంట్‌కు తాను సారథ్యం వహించి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించాడు. ఐతే, ఈ ఊహకు పురిటిలోనే సంధి కొట్టిందన్న వ్యాఖ్యానాలు అపుడే వినిపిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. తెరాస అధినేత కేసీఆర్ జెడిఎస్‌తో మంతనాలు జరిపేందుకు బెంగళూరు వెళ్లిరాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించండని అక్కడి తెలుగువారికి పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అందరి అంచనాలు తారుమారయ్యాయి. అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించిన బిజెపికి బదులు, నలభై సీట్లు కూడా దక్కని జెడిఎస్ నేత కుమారస్వామి కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. కాంగ్రెస్ పార్టీ ఇలా జెడిఎస్‌కు మద్దతునివ్వటం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా తన తృతీయ ఫ్రంట్ అనే నినాదానికి విరామం ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటివి మంచి పథకాలే. అయినా కాంగ్రెస్ వారు నిరంతరం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం జనధన్ యోజన, స్వచ్ఛ్భారత్ వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది. రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు వంటి వ్యవస్థలు విస్తరించాయి. అయినా సరే ‘మోడీ హఠావో’ అనే నినాదంతో మాయావతి, అఖిలేశ్ యాదవ్, రాహుల్‌గాంధీలు ఏకమై తబుస్సమ్ అనే ముస్లిం మహిళను ఖైరానా ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గెలిపించారు. దీని సారాంశం ఏమంటే అభివృద్ధి ఎంత జరిగినా ఉపయోగం కన్పడటం లేదు. ఓట్లుతెచ్చి పెట్టేందుకు కేవలం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు చాలవు. ఎన్నికల సమయానికి జనంలో విపరీతమైన భావోద్రేకాలు ఎగసిపడాలి. ఈ విధంగా ఆలోచిస్తే ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఓ ఆయుధంగా వాడుకొని, కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కాంగ్రెస్ నేతలు ఒకవైపు, కమ్యూనిస్టులు మరొకవైపు నిర్విరామంగా కృషిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రభుత్వాలు అర్ధంతరంగా కూలిపోయినా, పరిపాలన స్తంభించినా అరాచక పరిస్థితులు వస్తాయి. మన భూభాగాన్ని కబళిస్తున్న చైనాకు కావలసింది ఇదే. ఈ దృష్టితో పూణెలో పోలీసులకు అందిన రహస్య పత్రాలను విశే్లషింపవలసి ఉంటుంది.
నిజానికి తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పైకి కన్పడుతున్నంత బలంగా లేదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు వ్యక్తిగత కోణంలో విమర్శలు చేసుకుంటూ పరోక్షంగా తమ పార్టీని అభాసుపాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల ఆధిపత్య పోరాటం, క్రమశిక్షణారాహిత్యం వంటివి నిస్సందేహంగా కెసిఆర్‌కు కలిసివచ్చే అంశాలు. ఇక, భాజపా కేవలం కొన్ని నియోజకవర్గాలల్లో కాస్త బలంగా ఉన్నప్పటికీ మంత్రివర్గం ఏర్పాటుచేసేంత స్థాయిలో లేదన్నది నిజం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం అజేయుడు అన్నట్లు తోస్తున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండాలనుకుంటే అది నిజంగా ఆత్మహత్యా సదృశం. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా పరిస్థితి కాంగ్రెస్‌లానే తయారుకావడం ఖాయం.
కాంగ్రెస్‌లో ప్రస్తుతం పి.చిదంబరం, శశి ధరూర్, మణిశంకర్ అయ్యర్ వంటి సీనియర్ నేతలపై కేసులు నమోదుఅవుతున్నాయి. ఈ ముప్పు నుండి తప్పుకోవటం కోసం కాంగ్రెస్ నాయకత్వం మావోయిస్టులను ఆశ్రయించినట్లయితే అది- భారత రాజకీయాల్లో మరో కొత్తమలుపు అవుతుంది. ప్రధాని మోదీని వ్యతిరేకించే ఏ వ్యక్తులతోనైనా చేతులు కలిపేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోందా? ఈ నేపథ్యంలో కొన్ని ‘లాభాలను’ సైతం వదులుకునేందుకు ఆ పార్టీ సుముఖంగా ఉంటోంది. కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయడం ఇందులో భాగమేనని అనిపించక తప్పదు. భాజపా ఆధిక్యాన్ని నిలువరించేందుకు అరవింద్ కేజ్రీవాల్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ వంటి నేతలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. గుజరాత్‌కు చెందిన జిగ్నేశ్ మెమానీ, భరత్‌సింగ్ సోలంకీ, హార్థిక్ పటేల్ వంటి స్థానిక నేతలను సైతం కాంగ్రెస్ చేరదీస్తోంది. బిహార్‌లో ఆర్‌జెడి, కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీలు ఏకమైనాయి. వీరికి కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల మద్దతు లభిస్తున్నది. ఝార్ఖండ్‌లోనూ ఇదే పరిస్థితి. కలకత్తాలో మమతాబెనర్జీ దళితుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా బిఎస్పీ అధినేత్రి మాయావతి మమత పట్ల మెతకవైఖరిని అవలంబిస్తోంది. దళితోద్యమం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లిపోయిందని జిగ్నేశ్ మెమానీ నిరూపించాడు. కేరళకు చెందిన కొందరు వామపక్ష నాయకులు విదేశాల్లో పర్యటిస్తూ, మోదీ పాలనలో పేద ప్రజలు, మైనార్టీలు భయంకర జీవితం గడుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ‘్భరత్‌లో ముస్లిములకు రక్షణ లేదు. క్రైస్తవులకు స్వేచ్ఛలేదు’ అంటూ కొందరు పనిగట్టుకుని అమెరికా వంటి దేశాల్లో ప్రచారం చేస్తున్నారు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్