AADIVAVRAM - Others

మనోదర్పణం (సిసింద్రి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఊరి చివరి ప్రదేశం. ఆ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా ఉంది. దూరంగా అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు కనిపిస్తున్నాయి. రహదారి పక్కనే ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతనికి సుమారు యాభై సంవత్సరాల వయసు ఉంటుంది. బట్టలు చిరిగిపోయాయి. గడ్డం పెరిగిపోయి ఉంది.
ఇంతలో అటువైపుగా ఓ దొంగ వచ్చాడు. కింద పడివున్న వ్యక్తిని చూసి ‘వీడు దొంగ అయి ఉంటాడు. జనం చేతిలో చిక్కి తన్నులు తిని స్పృహ తప్పి పడిపోయాడు. వేళాపాళా లేకుండా దొంగతనం చేస్తే అంతే మరి’ అనుకుంటూ వెళ్లిపోయాడు.
కొద్దిసేపయిన తర్వాత ఓ తాగుబోతు అటుగా వచ్చాడు. ‘వీడెవడో నాకన్నా పెద్ద తాగుబోతులా ఉన్నాడు. ఒళ్లు ఎరగకుండా తాగి పడి ఉన్నాడు. నేనే నయం. తాగినా నడవగలుగుతున్నాను’ అనుకుని తూలుకుంటూ వెళ్లిపోయాడు.
మరి కొద్దిసేపటికి ఓ సన్యాసి ఆ దారిన వచ్చాడు. ‘ఆహా! ఈయన ఎవరో గొప్ప సన్యాసిలా ఉన్నాడు. ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా ధ్యానంలో మునిగిపోయాడు’ అనుకుంటూ వెళ్లాడు.
వాస్తవానికి ఆ వ్యక్తి స్పృహలోనే ఉన్నాడు. వాళ్లు స్వగతంలా అనుకునే మాటలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ అతను ఆహారం లేక నీరసించి శోష వచ్చి పడిపోయాడు. కనీసం శరీరం కదిలించే ఓపిక కూడా అతనికి లేదు. వాళ్లు లేవదీసి ఇంత ఆహారం పెడతారేమోనని ఆశించాడు. వాళ్లు ఆ ప్రయత్నమేమీ చేయలేదు.
ఇంతలో ఓ స్ర్తి ఆ వీధిన వస్తోంది. ఆమె తెల్లటి వస్త్రాలు ధరించి ఉంది. ముఖంలో నిర్మలత్వం తొంగి చూస్తోంది. రహదారి పక్కన పడి ఉన్న ఆ వ్యక్తిని చూడగానే ఆతృతగా ముందుకు వచ్చింది. చేతిలోని బుట్టలోఉన్న పాత్ర తీసుకుని ముఖం మీద నీళ్లు చిలకరించింది. ఆ వ్యక్తి కళ్లు తెరచి చూశాడు. మెల్లగా లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించింది. బుట్టలో నుంచీ రెండు అరటి పండ్లు తీసి ఇచ్చింది. అతను ఆత్రంగా వాటిని తిన్నాడు.
‘తల్లీ! నీవెవరో సాక్షాత్తూ అన్నపూర్ణాదేవిలాగా వచ్చి నా ప్రాణం కాపాడావు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు’ అన్నాడు.
‘ఎవరు నాయనా నువ్వు?’ అని అడిగింది.
‘అమ్మా! నా పేరు రంగదాసు. ఒకప్పుడు బతికిన వాడినే. దాయాదుల వల్ల సర్వం కోల్పోయి బికారినయ్యాను. పని చేసుకునే శక్తిలేక భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. ఈ రోజు ఎవరూ నాకు భిక్ష వేయలేదు. ఆకలితో నీరసించి పడిపోయాను. ఈ దారిలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఒక దొంగ నేను కూడా దొంగననే అనుకున్నాడు. తాగుబోతు నన్ను కూడా తాగుబోతు అన్నాడు. సన్యాసి నన్ను తనని మించిన సన్యాసినని భావించాడు. కానీ ఎవరూ నన్ను ఆదుకునే ప్రయత్నం చేయలేదు’ అన్నాడు.
‘మన మనసు అద్దం లాంటిది నాయనా! మనం ఎలా ఆలోచిస్తే ఎదుటివారు కూడా అలాగే కనపడతారు. వారు ముగ్గురికీ వారి స్వభావాలని బట్టి అలా అనిపించావు. మన సమాజంలో కూడా ఎప్పుడూ చెడుగా ఆలోచించే వారికి అందరూ చెడ్డవాళ్లుగానే కనిపిస్తారు. ఎదుటి వాడిదే తప్పు అనుకుని ద్వేషిస్తూ దూరంగా ఉంటాడు. అందువల్ల సాటి మనుషులకు దూరం అవటమే కాక అనేక రుగ్మతలకు లోనవుతాడు’ అంటూ మళ్లీ
-నా పేరు కరుణ. నేను ఒక ఆశ్రమం నడుపుతూ ఉంటాను. నీకిష్టమైతే నా ఆశ్రమంలో ఉందువుగాని’ అన్నది.
‘అలాగే! మీలాంటి వారి జాలి, దయ వల్లనే మాలాంటి వారి ప్రాణాలు నిలుస్తున్నాయి. ఈ రోజు భిక్ష దొరకలేదు. నేనెంతో దురదృష్టవంతుడిని అనుకున్నాను. అది నిజం కాదు. నేనెంతో అదృష్టవంతుడిని కాబట్టే నీ ఆదరణ లభించింది. నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు’ అన్నాడు రంగదాసు సంతృప్తిగా.

-గోనుగుంట మురళీకృష్ణ