జాతీయ వార్తలు

సిస్టర్ నిర్మల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 23: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు చేపట్టిన సిస్టర్ నిర్మల మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. 81 సంవత్సరాల నిర్మల గత కొన్ని నెలలుగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్నారని, గతనెల నుంచి ఆమె పరిస్థితి మరింత విషమించిందని కోల్‌కతా ఆర్కిబిషప్ థామస్ డిసౌజా తెలిపారు. పక్షం రోజుల క్రితం తాను నిర్మలను కలిసానని, మిషనరీస్ కార్యక్రమాల గురించే ఆమె మాట్లాడారని తెలిపారు. సిస్టర్ నిర్మలకు శ్రద్ధాంజలి ఘటించడానికి సెయింట్ జాన్స్ చర్చిలో ఆయన ప్రార్థనలు నిర్వహించారు.
తన జీవితాన్ని పూర్తిగా ఆపన్నుల సేవకే అంకితం చేసిన నిర్మలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తుది నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సెయింట్ జాన్స్ చర్చిని సందర్శించి సిస్టర్ నిర్మలకు శ్రద్ధాంజలి ఘటించారు. మదర్ థెరీసా తర్వాత చారిటీస్ బాధ్యతలు చేపట్టిన నిర్మల పనె్నండు సంవత్సరాల పాటు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.నిర్మల మరణంతో పూడ్చలేని నష్టం ఏర్పడిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కాగా, నిర్మల మృత దేహానికి బుధవారం సాయంత్రం నాలుగ గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి.
రాష్టప్రతి, ప్రధాని సంతాపం
సిస్టర్ నిర్మల మరణం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పేదల సేవకే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. పేదల కోసం అంకితమైన స్ఫూర్తిదాయక జీవితానే్న కొనసాగించారని ప్రణబ్ అన్నారు. ప్రజల సేవకే జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నిర్మల మరణం ఎంతో బాధ కలిగిస్తోందని, మిషనరీస్ ఆఫ్ చారిటీకి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని మోదీ తెలిపారు.
కోల్‌కతాలోని
సెయింట్ జాన్స్ చర్చిలో మంగళవారం సిస్టర్ నిర్మల మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న నన్స్.