రాష్ట్రీయం

ఏ తల్లి కన్న బిడ్డో.. రోడ్డు పాలైన పసికందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపట్నం (విశాఖపట్నం) , నవంబర్ 22: తల్లి గర్భం నుంచి బయటపడిన కొద్ది క్షణాలకే రోడ్డు పాలయ్యాడా శిశువు. ఒంటిపై రక్తం చారలు ఆరకుండానే, బొడ్డు కోయకుండానే రోడ్డు మీద పారేసిన హృదయ విదారక సంఘటన ఆదివారం విశాఖ నగరంలోని గోపాలపట్నం జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న గణేష్‌నగర్ రోడ్డులో చోటు చేసుకుంది. ఉదయం 8.30 గంటలప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు చేతి సంచిలో అప్పుడే పుట్టిన మగ శిశువును రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. సంచిలో ఏదో కదులుతోందని గమనించిన స్థానికులు సంచి విప్పి చూసి నిర్ఘాంతపోయారు. అప్పుడే పుట్టిన శిశువును తీసుకొచ్చి పడేసారని గ్రహించి ముందు శిశువును గోరువెచ్చని నీటితో శుభ్రం చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ శిశువును ఒక ప్రైవేట్ పిల్లల ఆసుపత్రికి తరలించి విషయాన్ని శిశు సంక్షేమ శాఖ (చైల్డ్‌కేర్) అధికారులకు తెలియజేశారు. వారు వచ్చి శిశువును కెజిహెచ్‌కు తరలించారు. శిశువు వద్ద కెజిహెచ్‌లో ఉండేందుకు ఓ మహిళా కానిస్టేబుల్‌ను గార్డుగా నియమించామని గోపాలపట్నం సిఐ తెలిపారు.