రాష్ట్రీయం

శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పాతాళగంటలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూలో నిలబడి ఎదురుచూస్తున్నారు. . చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తితో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. మహానంది, మురమళ్ల, కుండలేశ్వరం, ముక్తేశ్వరం, కోటిపల్లి, గుంటూరు జిల్లాలోని కోట్టప్పకొండ తదితర పుణ్యక్షేత్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన కీసరగుట్ట, వరంగల్‌ వేయి స్తంభాల ఆలయం, వేములవాడ, చెరువుగట్టు, కాళేశ్వరం కోటిలింగాల తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పరమశివుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజన్నకు టీటీడీ అర్చకులు, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాళేశ్వరంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నల్లగొండలోని చెర్వుగట్టు, పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ ఈస్‌గాంలోని శివ మల్లన్న ఆలయంలో భక్తుల సందడి ప్రారంభమైంది.మోతిగడ్డ వీరభద్రస్వామి, అన్నపురెడ్డిపల్లి మృత్యంజయ స్వామి ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.