కడప

మహాశివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, మార్చి 6: వై ఎస్సార్ కడపజిల్లాలో మహాశివరాత్రి మహోత్సవాలు జిల్లాలోని శైవ క్షేత్రాలను నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే శైవ క్షేత్రాలు భక్తుల కోసం సర్వం సిద్ధమయ్యాయి. వివిధ శైవ క్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తాదుల కోసం ఆయా దేవాలయాల ఇ ఓలు, ఛైర్మన్లు, యాజమాన్యాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలువపందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. అయినా కొన్ని దేవాలయాలలో వసతుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఉత్సవాలకు సంబంధించి వివిధ దేవాలయాలు విద్యుత్ కాంతుల మధ్య మిరమిట్లు గొలుపుతూ వెలుగొందుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తాదుల కోసం ఆయా దేవాలయాలలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను సైతం దాతలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇవ్వని విధంగా ఈ ఏడాది కలెక్టర్ కెవి.రమణ ప్రత్యేక చొరవ తీసుకొని లంకమల్ల, పొలతల, నిత్యపూజయ్యకోన, కన్యతీర్థం, గోపవరంలోని మల్యెం కొండ, నాగనాదేశ్వరకోన, లక్కిరెడ్డిపల్లె, సికెదినె్న గంగమ్మ ఆలయాలకు వెళ్లే రహదారుల నిర్మాణం కోసం ఈ నిధులతో తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు కూడా అరకొరగా ఏర్పాటు చేశారు. హింధువులకు మహాశివరాత్రి ముఖ్యమైన పండుగ. కనుక ఈ పర్వదినం రోజున కొండకోనల్లో వెలసిన పరమశివుడు, పార్వతిల దర్శనం కోసం జిల్లా వ్యాప్తంగా భక్తులు పోటెత్తుతారు. కొండకోనల్లో వెలసిన శివయ్య సన్నిధికి చేరుకోవాలంటే వసతులు సరిగా లేవని, ప్రతి ఏటా భక్తజనం అవస్థలు పడుతున్నారు. భక్తుల కోసం కావలసిన వసతులు ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పాలి. శైవక్షేత్రాల ద్వారా లక్షల్లో ఆదాయం వస్తోంది. వివిధ ఆలయాలలో కోనేర్లు వున్నా పట్టించుకోకపోవడం, గుంతలమయంగా మారిన రోడ్లను కాకతాలియంగా చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు మహిళలు పెద్ద ఎత్తున శైవ క్షేత్రాలకు తరలి వస్తారు. వారు స్నానాలు చేసేందుకు తగిన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం అధికారులకు తెలిసిందే. వాటిపై కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని భక్తుల నుంచి ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. త్రాగునీటి సమస్య కూడా ఆయా క్షేత్రాలలో నెలకొననుంది. ఎటువంటి వసతులు, రోడ్లు లేకపోయినా, వౌళిక సదుపాయాలు కల్పించకపోయినా భక్తులు మాత్రం ఆ పరమశివుడిపై నమ్మకం వుంచి ఓం నమఃశివాయ అంటూ లక్షలాదిగా తరలి వచ్చి ఆయా దేవాలయాలలో శివయ్యను దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకోనున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రొద్దుటూరు పురపాలిక పట్టణం నడిబొడ్డున వెలసియున్న అగస్త్యేశ్వరాలయం (శివాలయం), రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరాలయం, హనుమత్‌లింగేశ్వరాలయం, పెన్నానది ఒడ్డున వెలసిన అమృతేశ్వరాలయాలలో ఆయా దేవాలయాల కార్యనిర్వహణాధికారులు, పాలకమండలి ఛైర్మెన్ల ఆధ్వర్యంలో భక్తుల కోసం చలువపందిళ్లతోపాటు త్రాగునీరు, ఇతర వౌళిక వసతులను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయాలకు తరలి వచ్చే భక్తాదుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుజాగ్రత్త చర్యగా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయడంతోపాటు భక్తుల కోసం ప్రసాదాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అదేవిధంగా చాపాడు మండలంలోని అల్లాడుపల్లెలో జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి తనకు గురువుకావాలని కుందూనదిలో నుంచి తెచ్చిన ప్రతిష్టించిన అల్లాడుపల్లె శ్రీ వీరభధ్రస్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలను భక్తుల కోసం సిద్ధం చేశారు. ఆలయాన్ని అన్ని విధాలా అలంకరించడంతోపాటు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు. ఖాజీపేట మండలంలోని నాగనాదేశ్వరస్వామి దేవాలయంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న దృష్ట్యా నిర్వాహకులు ఆలయాన్ని అన్ని విధాలా సిద్ధం చేసినా అక్కడ వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా లంకమల అడవులలో వెలసిన లంకమల్ల అభయారణ్యంలో వెలసిన లంకేశ్వరుడితోపాటు నిత్యపూజకోన స్వామి ఆలయాలను సిద్ధం చేసినా సరైన సదుపాయలు లేవని సమాచారం. ఆయా దేవాలయాల్లో వున్న గుండంలో అంతంతమాత్రంగా వున్న నీటిలో మహిళలు స్నానం చేసిన తర్వాత దుస్తులు మార్చుకొనేందుకు తాత్కాలిక షెడ్లు అందుబాటులో లేవని పెదవి విరుస్తున్నారు. అదేవిధంగా కన్యతీర్థం క్షేత్రం శివరాత్రికి ముస్తాబైంది. అక్కడ కూడా వసతులు అంతంతమాత్రంగానే ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా జిల్లాలో మూడు నుంచి ఐదురోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ శివరాత్రి మహోత్సవాలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల తదితర ఆర్టీసీ డిపోల నుంచి దేవాలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను పెద్ద ఎత్తున నడుపుతున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని డీ ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తును చేపడుతున్నారు. అధికారులు జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలను సందర్శించి భక్తులకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను తాత్కాలికంగానైనా ఏర్పాటు చేయాలని, శైవ క్షేత్రాలకు తరలి వెళ్లే భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పొలతలకు భారీగా భక్తులు
పెండ్లిమర్రి,మార్చి 6: రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పొలతల మల్లేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి ఆదివారం వేకువ జాము నుంచే భక్తులు ప్రత్యేక వాహనాల ద్వారా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్సుల ద్వారా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మొదటగా అక్కదేవతల గుడి, బండన్నస్వామి, మల్లేశ్వరస్వామి పార్వతీదేవిలను దర్శించుకుని వారు మొక్కుబడులను చెల్లించుకొని కోరికలను నెరవేరాలని ప్రార్థించుకుంటున్నారు. ఆదివారం ఉదయం పెండ్లిమర్రి మండలాధ్యక్షురాలు సి అనురాధ కుటుంబ సభ్యులతో స్వామి దర్శనానికి రాగా, అధికారులు ఆలయ మర్యాదాలతో స్వాగతం పలికి స్వామివారిని ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆలయ ఇవో క్రిష్ణనాయక్ మండలాధ్యక్షురాలు అనురాధ, ఆమె భర్త రామమోహన్‌రెడ్డిలను శాలువ కప్పి సన్మానించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసు అధికారులు, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే ఉన్న కాశినాయన అన్నదాన సత్రంలో భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
సిద్దవటం: శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవాల ప్రత్యేక అధికారి వెంకట్రావు తెలిపారు. ఆదివారం శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మండల అదనపు భవనంలో అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. మండల ప్రత్యేకాధికారి వెంకటసుబ్బారావు , ఎంపిపి అర్.నరసింహారెడ్డి, ఎంపిడివో జయసింహనాయుడు, సిఐ శ్రీరాములు, ఎస్‌ఐ లింగప్ప, ఫారెస్టు అధికారి సుబ్బారెడ్డి, సెక్రటరీలు, సర్పంచ్‌లు సమావేశానికి హాజరయ్యారు. వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులతో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని సిఐ పేర్కొన్నారు. ఆర్టీసి పాయింట్ వరకు మాత్రమే వాహనాలు పంపించాలన్నారు. పంచలింగాలవరకు ఒక ఎస్‌ఐను ఏర్పాటుచేసి మద్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. నడిచి వేళ్లే దారిలో వృద్ధులకు, వికలాంగులకు పోలీసులు సహాయం చేయాలన్నారు. అనంతరం నిత్యపూజయ్యస్వామికోన, పంచలింగాల గుడి వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.
భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
నిత్యపూజయ్యస్వామి కోనకు వచ్చే భక్తులతో పోలీసులు మర్యాదగా మెలగాలని ఒంటిమిట్ట సిఐ శ్రీరాములు పేర్కొన్నారు. మండల పరిధిలోని సిద్దవటం పోలీసుస్టేషన్‌లో ఆదివారం శివరాత్రి నిత్యపూజయ్యస్వామి ఉత్సవాల బందోబస్తుపై సిఐ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సిఐ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ఉత్సవాలకు వచ్చే భక్తులపట్ల దురుసుగా ప్రవర్తించకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. భక్తులు రహదారిని తప్పించి గుట్టలు ఎక్కకుండా వారిని అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
ఉత్సవాలకు భారీ బందోబస్తు
శివరాత్రి ఉత్సవాలకు నిత్యపూజయ్యకోనలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. డిఎస్పీతోపాటు ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు ఏఆర్ ఎస్‌ఐలు, 20మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 40మంది పోలీసులు , హెడ్‌క్వార్టర్ నుంచి 30మంది హోంగార్డులు, 20 మంది రిజర్వు బలగాలు ఏర్పాటుచేసినట్లు సిఐ తెలిపారు. పోలీసులు విధుల్లో ఓర్పుగా బందోబస్తు నిర్వహించాలన్నారు.