యువ

తేనె, నిమ్మరసంతో సైజ్ జీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నబడాలి...యువతీ యువకుల్లో నూటికి తొంభై శాతం మంది లక్ష్యమిదే. లావుగానే ఉండక్కర్లేదు..ఓ మోస్తరుగా ఉన్నా సరే సైజ్ జీరో అయిపోవాలన్న లక్ష్యంతో వాకింగ్, జాగింగ్, ఇతర ఎక్సరసైజులూ చేసేస్తూంటారు. అయితే ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత సునాయాసంగా సన్నబడతారు. ముఖ్యంగా తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని గోరువెచ్చటి నీటితో కలిపి రోజూ ఉదయానే్న క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేక రకాలుగా ప్రయోజనం ఉందనేది ఆయుర్వేద డాక్టర్లే కాదు...అల్లోపతి డాక్టర్లు కూడా చెప్పేమాట. ఇంతకీ తేనె, నిమ్మరసంలో ఏముంది? దానివల్ల ఏమిటి ప్రయోజనాలు అనేగా మీ సందేహం. అయితే చదవండి మరి.
* గ్లాసెడు గోరు వెచ్చటి నీటిలో ఓ నిమ్మ చెక్కను పిండి, టీ స్పూన్ పరిమాణంలో తేనెను కలిపి ఉదయానే్న తాగడం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. పేగులు శుభ్రపడతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
* తేనె, నిమ్మరసం మిశ్రమంలో పెక్టిన్ అనే పీచు పదార్థాన్ని పెంచే ప్రోటీన్లు ఉంటాయి. దీనివల్ల తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వీటికి బరువు తగ్గించే గుణం కూడా ఉంది.
* తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల ఇన్‌ఫెక్షన్లు సోకవు. అలాగే జీర్ణాశయంలో మ్యూకస్ ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడుతుంది. మ్యూకస్ కడుపులో ఉండే టాక్సిన్లను తరిమికొట్టడంలో సహాయపడుతుంది.
* పేగుల గోడల్లో టాక్సిన్లు పేరుకుపోయి ఉంటాయి. క్యాన్సర్ సహా అనేక రోగాలకు ఇవే కారణం. తేనె, నిమ్మరసం మిశ్రమం ఈ టాక్సిన్లను వదలగొట్టి, పేగులను శుభ్రపరిచేందుకు దోహదం పడుతుంది.
చూశారా! తేనె, నిమ్మరసం మిశ్రమంతో ఎన్ని ప్రయోజనాలో! మరి ఇంకేమిటి ఆలస్యం? రోజుకు ఓ చెంచాడు తీసుకుంటే ఆరోగ్యం మీ వెంటే! *