శ్రీకాకుళం

‘చేదు’ నిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
నలభై కోట్ల రూ.లు పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ తాళాలు తెరిచి మళ్లీ చెరకు రైతులకు అండగా నిలిచి, క్రషర్ ప్రారంభించేందుకు ఉగాది రోజున జిల్లా రైతాంగానికి ‘తీపి’కబురు చెప్పేందుకు ముఖ్యమంత్రితోపాటు ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సమాలోచన చేసిన విషయం తెలిసిందే! కానీ, చక్కెర పరిశ్రమ తాళాలు తెరిచి, యంత్రాలు పనిచేసేందుకు కావల్సిన చెరకు దిగుబడిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధ్యయనం చేయాలంటూ వ్యవసాయశాఖకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లాఅంతటా నాలుగు బృందాలు చెరకు పంట, దిగుబడి వివరాలు సేకరించడంతోపాటు, ఆమదాలవలస సుగర్‌ఫ్యాక్టరీ తెరిచేందుకు అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులపై సర్వే నిర్వహించారు.
ముడిసరుకు కొరత
చెరకు పరిశ్రమకు ‘చేదు’ అడ్డంకులు ఎదురవుతున్నట్టు ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ నివేదికలు ఇచ్చింది. ఆమదాలవలస సుగర్స్ ఫ్యాక్టరీ జోన్‌లో 11 మండలాలకు 4.5 లక్షల టన్నుల చెరకుపంట దిగుబడి అయితేనే సుగర్స్ క్రషర్‌కు అనువైన ముడిసరుకు ఉన్నట్టు భావించాలని పేర్కొంది. కానీ, ఈ జోన్ పరిధిలో కేవలం 1.5 లక్షల టన్నుల చెరకు మాత్రమే ప్రతీ ఏటా దిగుబడి ఉంది. మిగిలిన 3.5 లక్షల టన్నుల చెరకుపంట పండించేందుకు రైతులు ముందుకువస్తేనే సుగర్స్‌కు తాళాలు తీసే అవకాశం ఉంటుందంటూ ఆ నివేదికలో వ్యవసాయ శాఖ వివరించింది.
పెరిగిన లేబర్ చార్జీలు
అంతేకాకుండా, లేబర్ చార్జీలు నూటికి రెండువందల శాతం పెరిగిపోవడంతో చెరకుపంట ఫ్యాక్టరీ వద్దకు తరలించేందుకు అయ్యే ఖర్చులు ఆకాశమంతగా మారిపోయాయన్న మరో అంశాన్ని కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
సుగర్స్‌కు తాళాలతో మొక్కజోన్నపై ఆసక్తి
ముఖ్యంగా ఆమదాలవలస సుగర్స్‌కు తాళాలు వేసిన తర్వాత జిల్లా రైతాంగం చెరకుపంటను మరిచిపోయి, మొక్కజోన్న పంటపై ఆసక్తికనబరిచి ప్రస్తుతం ఆ పంటే లాభసాటిగా ఉండడంతో చెరకు వేసేందుకు ససేమిరా అంటూ జిల్లా రైతాంగం పేర్కొంటున్న అంశాలు సైతం సర్కార్‌కు అధికారులు తెలిపారు.
ఆమదాలవలస ‘తీపి’ ఖరీదే...
వీటన్నింటికంటే అతిముఖ్యంగా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్న పంచదారతో పోలిస్తే ఆమదాలవలస సుగర్స్‌లో తయారు చేసే పంచదార ధర కేజీకి వంద రూ.లు అధికంగా ఉంటోందని, అలాగే, జిల్లాలో 37 శాతం మంది ప్రజలు సుగర్ వినియోగాన్ని నిలుపుదల చేశారని, మధుమేహాం వ్యాధిగ్రస్తులు అత్యధికశాతం జిల్లాలో ఉండడంతో సుగర్‌ఫ్యాక్టరికీ తాళాలు వేయడానికి ముందు వినియోగం కంటే ఇప్పుడు 37 శాతం చక్కెర వినియోగం జిల్లాలో పూర్తిగా లేకుండాపోయినట్టు అధికారులు గణాంకాలు ప్రభుత్వానికి సమర్పించారు. ఇటువంటి అత్యంతకీలకమైన అంశాలతో ఆమదాలవలస సుగర్స్ తెరిపించేందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సాహసించినప్పటికీ, పరిశ్రమ నడిపించేందుకు కావల్సిన కనీస అవసరాలు, సౌకర్యాలు, చివరికి చెరకుపంట ఏవీ అనుకూలంగా లేవన్న గణాంకాలను జిల్లా వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇదిలా ఉండగా, జిల్లా అంతటా మూడు జోన్‌లుగా చెరకుపంట దిగుబడులతో సుగర్‌ఫ్యాక్టరీలు నడిచేవి. సంకలిలో పారిస్ సుగర్స్‌కు కేవలం ఎనిమిది మండలాల్లో గల చెరకుపంటనే క్రషింగ్ చేస్తుండగా, మిగిలిన 30 మండలాలను పాతపట్నం, టెక్కలి, శ్రీకాకుళం జోన్లుగా విడదీసి ఆమదాలవలస కోపరేటివ్ సుగర్స్‌కు కేటాయించారు. కానీ, జిల్లా అంతటా సుమారు 20 వేల ఎకరాల్లో పండించే చెరకు కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడి కావడంతో గతంలోగల పదివేల మంది షేర్‌హోల్డర్లు మరల చెరకుపంట వేసేందుకు అనుకూలంగా స్వతహాగా చర్యలు తీసుకుంటేగాని సుగర్స్ తెరిచే పరిస్థితులు కన్పించకపోవచ్చు. అంతేకాకుండా, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ విజయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ‘ఆమదాలవలస సుగర్స్ తెరిపిస్తా’ అన్న మెనిఫెస్టో అంశానికి ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబునాయుడు కూడా అందుకు మద్దతు పలికి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆమదాలవలస సుగర్స్ తెరుస్తామన్న మాట మేరకు ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ, జిల్లాలో మాత్రం ‘చేదు’ పరిస్థితులు ఉన్నాయడంలో అతిశయోక్తిలేదు.
రైతులను చైతన్యపరుస్తాం : విప్ రవికుమార్
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాసుగర్స్, కెసీపీ, నూజివీడు, తెలంగాణ ఎం.పి.ఎ ఇలా.. చాలా సుగర్ ఫ్యాక్టరీలు నడిపేందుకు అవకాశాలు లేకపోవడంతో తాళాలు వేసే పర్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆమదాలవలస సుగర్స్‌ను తెరిపించేందుకు సాయశక్తుల తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సోమవారం ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. అయితే, మూడున్నర లక్షల టన్నుల చెరకుపంట లోటు కన్పిస్తుండగా క్రషర్ చేసేందుకు అవకాశం లేదని, దీనిపై జిల్లా రైతుల్లో చైతన్యపరిచేందుకు పలు సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేవలం ఆమదాలవలస సుగర్స్ జోన్‌లో గల 11 మండలాల్లోనే కాకుండా జిల్లా అంతటా చెరకురైతులకు భరోసా కల్పించి, వారికి మొలకులు ఇచ్చి నాటించి, సమయానుకూలంగా కటింగ్‌కు ఆదేశాలు ఇచ్చి, తగు ఛార్జీలతో రవాణా చేయించి ఫ్యాక్టరీ షేర్‌హోల్డర్లకు అండగా నిలిచేవిధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వివరించారు. చెరకురైతులతో సమాలోచన చేసి, అధికారులతో సంప్రదింపులు ముగిశాక ఆమదాలవలస సుగర్స్ తెరవాలా? వద్దా? అన్న నిర్ణయంలో జిల్లా రైతాంగానిదే తుది నిర్ణయంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని రవికుమార్ సుస్పష్టం చేశారు. షేర్‌హోల్డర్ల తుది నిర్ణయంతోనే పర్సన్-ఇన్-ఇన్‌ఛార్జి, పాలకమండలి నియామకాలు జరుగుతాయని చెప్పారు.