శ్రీకాకుళం

ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన చెరకు రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, నవంబర్ 4: స్థానిక సహకార చక్కెర కర్మాగారాన్ని ఏపిఐఐ సికి అప్పగించడంకు గాను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక చెఱకు రైతులు, షేర్‌హోల్డర్లు తరపున దన్నాన లచ్ఛయ్య అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సహకార చక్కెర కర్మాగారానికి 32 మండలాల్లో సుమారు 500మంది షేర్ హోల్డర్లు ఉండగా వీరి అనుమతి లేకుండా కొద్దిపాటి నష్టాల పేరుతో ఫ్యాక్టరీని గత 14 ఏళ్లక్రితం అప్పటి తెలుగుదేశం ప్రభు త్వం అంబికా లామినేషన్ సంస్థకు రూ.6.20కోట్లకు విక్రయించి చేతులు దులుపుకొంది. దీనిపై ఫ్యాక్టరీని విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని ఇక్కడి చెఱకు రైతులు తమ పిటీషన్‌లో కోరుకున్నారు. గత ఎన్నో ఏళ్లు చెఱకు రైతులు పోరాటం చేయగా ఇటీవల కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీ పరిధిలోగల రైతు ల సమిష్టి ప్రయోజనాలు కాపాడి సహకార రంగంలోనే నడిపించాలని కోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నెల 2న ఈ ఫ్యాక్టరీని ఏపి ఐ ఐ సి కి అప్పగించి అంబికా లామినేషన్ సంస్థకు వడ్డీతో కలిసి రూ.4.16కోట్లు చెల్లించాలని ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఏపి ఐ ఐ సి చైర్మన్, ఆయా శాఖ ఉన్నతాధికారులు గత 20 రోజుల క్రితం ఇక్కడకి వచ్చి ఫ్యాక్టరీ ఆస్తుల వివరాలు సేకరించారు. ఫ్యాక్టరీకి సం బంధించిన 76 ఎకరాల భూమిలో 60 శాతం భూములను 99సంవత్సరాలకు లీజుకు ఇచ్చి మిగిలిన స్థలంలో మినీ చెఱకు మిల్లు, డెయిరీ ఫారం, టీ పొడి ,సబ్బుల ఫ్యాక్టరీ వంటి ఏర్పాటు చేసేందుకు ఏ సి ఐ ఐ సి ప్రతిపాధన చేసింది. వేల మంది చెఱకు రైతు భవిష్యత్‌కు ముడిపడి కోట్లాది రూపాయల షేర్‌హోల్డర్ల పెట్టుకలిగిన ఈ ఆస్తిని విక్రయించే అధికారం ఎవ్వరికీ లేదని వీరు పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీని ఆదుకోని తెరిపించలేనప్పుడు ప్రభుత్వం హేర్‌హోల్డర్లు, రైతులకు అప్పగించాలని కోరుతూ దన్నాన లచ్ఛయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నాడు.