శ్రీకాకుళం

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 4: పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 7వ వార్డు పరిధిలో పెద్ద రెల్లివీధిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ఆహార భద్రతా చట్టం కింద ప్రతీ ఒక్కరికీ 5 కేజీల బియ్యం చొప్పున కుటుంబంలో అందరికీ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. నిరంతర విద్యుత్ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిని ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎక్కడ రిజర్వు స్తలం ఉంటే వాటిని కబ్జాచేయడమే వారికి ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,400కోట్లు కేటాయిచడం జరిగిందని తెలియజేశారు. పేదవాళ్ల మీద భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేశారు. టిడిపిని ముందుకు నడిపించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఈనెల 12న రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్పొరేషన్‌కు రానున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందించేందుకే పల్స్ సర్వే అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతోపాటు అభివృద్ధిని కూడా చేపడుతున్నామని దీనికి ప్రతీ ఒక్కరూ సహకరించి నగరాన్ని స్వచ్ఛ శ్రీకాకుళంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. వాస్తవాలు తెలుసుకొని టిడిపిని ఆశీర్వదించాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, వార్డు ఇంచార్జ్ కళ్యాణ వెంకటరావు, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, పివి రమణ, ఎస్ వి రమణమాదిగ, తవుడు, రవీంద్ర, జామి భీమశంకరరావు, సీపాన రమాదేవి తదితరులు పాల్గొన్నారు.