శ్రీకాకుళం

రెడ్‌క్రాస్‌కు బ్లడ్ కాంపోనెంట్ సెల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 4: శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌కు బ్లడ్ కాంపోనెంట్ సెల్ రక్తకన విభజన కేంద్రం మంజూరైందని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. రక్తకణ విభజన కేంద్రం మంజూరయినట్లు గురువారం సమాచారం అందిందన్నారు. ఈ మేరకు శుక్రవారం రెడ్‌క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన కణ విభజన కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో సుదీర్ఘమైన జాతీయ రహదారి, డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘన వంటి పరిస్థితుల వలన ప్రమాదాలు జరగడంతో పాటు ప్రసవ సమయాల్లోనూ, వైద్య చికిత్సల సమయంలోనూ రక్తం అవసరం ఎక్కువగా ఉందన్నారు. ఈసమయంలో రక్తకణ విభజన కేంద్రం రెడ్‌క్రాస్‌కు మంజూరు కావడం ముదావహమన్నారు. కేంద్రం మంజూరులో కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జెపి నడ్డా సహకారం మరువలేనిదని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పరిస్థితులను వివరించి గత ఐదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలను వివరించిన వెంటనే మంజూరుకు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేశారని ఆయన చెప్పారు. ఇప్పటికే రెడ్‌క్రాస్ సంస్థ చాలా మంచి కార్యక్రమాలను నిర్వహించిందని, జిల్లా రెడ్‌క్రాస్‌కు రుణపడి ఉంటుందన్నారు. దీని అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ రక్తకణ విభజన కేంద్రం మంజూరు చేయడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న రెడ్‌క్రాస్‌కు అదనపు బాధ్యత ఏర్పడిందన్నారు. రక్తదానానికి ప్రజలు ముందుకు వచ్చి ఈ కేంద్రం సేవలు వినియోగించుకోవాలన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ 2011 నుంచి రక్తకణ విభజన కేంద్రం గురించి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్టబ్ల్రడ్ ట్రాన్స్‌ఫ్యూసన్ కౌన్సిల్ కణవిభజన యూనిట్ ఏర్పాటుకు 2011లో అనుమతులు వచ్చాయన్నారు. 2013లో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రూ.16.88 లక్షల విలువలు గల సామాగ్రిని అందజేసిందని రాష్ట్ర రెడ్‌క్రాస్ సంస్థ రూ.10లక్షల విలువగల సామాగ్రిని అందజేయగా మాజీ ఎమ్మెల్యే భుక్త సూచిన మేరకు జిల్లాకు చెందిన ఎన్ ఆర్ ఐ పి.సూర్యనారాయణమూర్తి రూ.10లక్షల విరాళాన్ని, యాక్సిస్ బ్యాంకు రూ.1లక్ష, పారిశ్రామిక వేత్త ఎం. ఆనందరావు రూ.3లక్షలు అందజేశారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ రూ.10లక్షలు మంజూరు చేయగా విశాఖ రెడ్‌క్రాస్ సంస్థ కొత్త సామాగ్రిని సమకూర్చిందన్నారు. మొత్తం కోటి రూపాయల విలువగల సామాగ్రి రక్తకణ విభజన కేంద్రానికి సమకూరిందని తెలిపారు. దీని మంజూరులో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్‌నాయుడుల పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రక్తవిభజన సమన్వయ కర్త కర్ణాని, డికె దాసుబాబు, లక్ష్మునాయుడు, బ్లడ్‌బ్యాంకు వైద్యులు, టిడిపి నాయకులు ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, పి వి రమణ, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.