శ్రీకాకుళం

హామీలు నెరవేరుస్తున్నాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటబొమ్మాళి, నవంబర్ 4: ఇచ్చిన హామీలను అమలు చేయడం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి జనచైతన్యయాత్రలో ప్రజలకు ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలో వాడ్రండ గ్రామంలో మండల టిడిపి అధ్యక్షుడు బోయిన రమేష్ అధ్యక్షతన శుక్రవారం జనచైతన్యయాత్రలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ కుటిల రాజకీయాలు వల్ల రాష్ట్రం రెండుగా చీలిపోయి ఎపికి నష్టం జరిగిందన్నారు. గడిచిన రెండున్నర ఏళ్లుగా అమరావతి రాజధానిగా ఎంతో ప్రగతి సాధించామన్నారు. వాడ్రండ పంచాయతీకి ఎత్తిపోతల పథకం ద్వారా రానున్న జూన్ నాటికి సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి కుటుంబం కనీస ఆదాయం నెలకు 10 వేల రూపాయలు వచ్చే విధంగా గొర్రెలు, ఆవులు, కోళ్లు పెంపకానికి రెండు లక్షల రూపాయలు చొప్పున రుణసదుపాయం కలుగుజేయనున్నట్లు మంత్రి తెలిపారు. రెండు కోట్ల మంది కార్మికులకు 280 కోట్ల రూపాయలతో చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫైబర్‌గ్రిడ్ ద్వారా 148 రూపాయలకు ఇంటింటికి ఇంటర్‌నెట్ కనెక్షన్, టివిలో 200 ఛానల్స్ చూసే విధంగా రెండు ఉచిత ఫోన్‌లతో త్వరలో సెట్‌బాక్స్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌతు శిరీషా ప్రభుత్వ పథకాలు గూర్చి వివరించారు. ఎంపిపి రామకృష్ణ, జడ్‌పిటిసి పద్మజశ్రీనివాస్, సర్పంచ్ పి.దమయంతి, దేశం నాయకులు కామేశ్వరరావు, విజయలక్ష్మి, సూర్యనారాయణ, అప్పారావు, నాగయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.