ఖమ్మం

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 4: గిరిజన విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజన సంక్షేమశాఖ విద్యార్థుల కోసం కార్పోరేట్ స్థాయిలో వసతిగృహాలు నిర్మించిందని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యతో పాటూ పౌష్టికాహారం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై కూడా పూర్తి చొరవ చూపాలన్నారు. ఈ శిక్షణ ద్వారా మీరు పొందిల మెళుకువలు విద్యార్థుల ఉత్తీర్ణతపై పూర్తి సత్ఫలితాలు చూపాలన్నారు. విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివేందుకు ఈ శిక్షణ చాలా దోహద పడుతుందన్నారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారి జయదేవ్ అబ్రహాం మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత భద్రాద్రి జిల్లాలో తొలిసారి ఉపాధ్యాయులు, వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వసతిగృహా నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలు, విద్యార్థుల సంరక్షణ బాధ్యత, విధి విధానాలు అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా అందుతున్న సౌకర్యాలు విద్యార్థులకు పూర్తిగా ఉపయోగించాలన్నారు. 10వ తరగతిలో ప్రతి విద్యార్ధి ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని, విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. అశ్వాపురం జ్లి పరిషత్ హెచ్‌ఎం అరుణపాణి, ఎం.నాగరాజు, శేఖర్, ఏటీడబ్య్లూవో జహీరుద్దీన్, రిటైర్డ్ ఏడీడబ్య్లూవో సీతారాములు శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ డీఈవో రవీందర్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రావు, ఏటీడబ్య్లూవోలు సత్యనారాయణ, లక్ష్మణ్‌బాబు, ఏటీఏ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.