శ్రీకాకుళం

పర్యావరణ పరిరక్షణకు వైజ్ఞానిక సదస్సులు వేదిక కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, నవంబర్ 6: పర్యావరణం పెంపొందించేందుకు విద్యా వైజ్ఞానిక సదస్సులు వేదిక కావాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. ఆదివారం జిల్లా స్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక సదస్సుల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర పరంగా ఎంతోఅభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణ కోసం మాత్రం అంతగా స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇటీవల దేశ రాజధానిలో మూడు రోజులపాటు జరిగే సదస్సులకు తాను వెళ్లడం జరిగిందని అయితే ఢిల్లీ రాజధానిలోనే పర్యావరణం సరిగ్గా లేకపోవడం అక్కడి ప్రజలు ఏయిల్ క్యూరిఫైర్ వాడుతుండటం కనిపించిందని ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితి మనకు భవిష్యత్‌లో మన ప్రాంతాల్లో రాకుండా చేసేందుకు గాను ఈ ప్రదర్శనలు మూలకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సులు విద్యార్థులకు ఎంతో అవసరమని ప్రతీ ఒక్కరూ శాస్తప్రరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే సభకు అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు నరసన్నపేట వేదిక కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో సైన్స్‌విభాగాలపైన విద్యార్థుల్లో అవగాహన పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని వివరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైజ్ఞానిక ప్రదర్శనలను జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీలించారు. గత ఏడాది ఇన్స్‌ఫెయిర్ అవార్డుల ద్వారా ఎంపికైన ఆరుగురు విద్యార్థులకు నగదు పురష్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, జెడ్పిటీసీ శకుంతల, ఎంపిపి శిమ్మ పార్వతమ్మ, సర్పంచ్ చిట్టిబాబు, ఏఎంసి అధ్యక్షులు బైరి భాస్కరరావు, డిఎస్పీ భార్గవరావునాయుడు, ఎంఈఓలు పాల్గొన్నారు.