శ్రీకాకుళం

నాగావళి నుండి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణస్థలం, నవంబర్ 6: నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.100 కోట్లతో ప్రణాళికలు సిద్ధమయ్యాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఆదివారం ఆయన బంటుపల్లి, తిరపతిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగావళి నది నుండి అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. తోటపల్లి ద్వారా నీరు రావడంత నియోజకవర్గంలో భూములన్నీ పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. నీరు రావడం వలన అన్ని వర్గాల వారి అభివృద్ధి, అన్ని ప్రాంతాల వారీ అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన కూడా తాగునీటి ప్రాజెక్టులపై ఉందన్నారు. మడ్డువలస, తోటపల్లి కాలువల ద్వారా నీరు విడుదలవ్వడం వలన 17 లక్షల మందికి ఉపయోగపడిందన్నారు. తోటపల్లి మరికొద్ది రోజుల్లో పూర్తవుతుందని ఏడాదిలో అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, ట్రిపుల్ ఐటి వంటి విద్యా సంస్థలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమం దృష్ట్యా డ్వాక్రా మహిళలు రూ.3వేలు కోట్లు విడుదలచేశారని వీటిని మహిళలు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. టిడిపి నాయకులు ఎన్. ఈశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతానికి తోటపల్లి కాలువ ద్వారా వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అనేక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమానికి ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత కళా వెంకటరావును జాతీయ రహదారి నుండి ఊరేగింపుగా గ్రామంలోనికి కార్యకర్తలు తీసుకువచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపిపి గొర్లె విజయకుమార్‌నాయుడు, టిడిపి నాయకులు ,సత్యేంద్రవర్మ, డి జి ఎం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.