శ్రీకాకుళం

గజరాజుల అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, నవంబర్ 6: అటవీ ప్రాంతంలో సంచరించే ఏనుగులు మైదాన ప్రాంత ప్రజలను గజగజలాడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, పంటపొలాలు, తోటలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టిస్తున్న సంఘటనలు గిరిజన గ్రామాల్లో నెలకొంటున్నాయి. దీంతో భయం గుప్పెట్లో గిరిజనులు కాలం వెల్లదీస్తున్నారు. మండలంలోని ఎగువ రుగడ గిరిజన గ్రామంలో శనివారం రాత్రి జరిగిన నష్టాలు అద్దం పడుతున్నాయి. గ్రామంలోని అంగన్‌వాడీ భవనం, క్రైస్తవ ప్రార్థనామందిరం కూల్చివేశాయి. ఆదివారం తహశీల్దార్ కాళీప్రసాద్ గ్రామాన్ని సందర్శించారు. వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంతకాలంగా ఎగువ రుగడ గ్రామంలో తిష్టవేశాయి. గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ వరి, అరటి, చెరకు తదితర పంటలను విలువైన టేకు, మామిడి, సరుగుడు తోటలను ధ్వంసం చేశాయి. గ్రామంలోకి ప్రవేశించి అంగన్‌వాడీ భవనం గోడను కూల్చివేసి అందులో ఉన్న పౌష్టికాహార పదార్థాలను తినివేశాయి. అలాగే క్రైస్తవ ప్రార్థనామందిరాన్నికూల్చివేశాయి. దీంతో గిరిజనులు భయాందోళనకుగురయ్యారు. గ్రామ పొలిమేరల్లో ఏనుగుల నుంచి రక్షణ చర్యలు చర్యలు చేపట్టారు. మంటలను కాల్చివేసి ఏనుగులు రాకుండా చర్యలు చేపట్టారు. ఏనుగులు ఏ సమయంలో గ్రామంలోకి ప్రవేశిస్తాయన్న జాగారం చేశారు. ఏనుగులు వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తహశీల్దార్ పేర్కొన్నారు.
* జాడలేని అటవీ అధికారులు...
ఏనుగుల గుంపుతో పంటలు, ఆస్తులు నష్టం జరిగినప్పటికీ అటవీ అధికారులు గ్రామాన్ని సందర్శించలేదని గిరిజనులు రామయ్య, సోమయ్య తదితరులు ఆరోపించారు. ఎటువంటి రక్షణ చర్యలుచేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ, చర్చిల నిర్మాణం చేపట్టాలని కోరారు.