శ్రీకాకుళం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.సిగడాం, నవంబర్ 14: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. సోమవారం సర్వేశ్వరపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. సర్వేశ్వరం నుండి జి.సిగడాం మీదుగా పొగిరి సెంటర్ వరకు నాబార్డు నిధులు రూ.1.60కోట్లతో ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
ఎన్నికల వాగ్దానాల్లో ప్రజలకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీరందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం లక్షకోట్లు వృథా చేస్తున్నారే తప్ప రైతులకు సాగునీరు కోసం తోటపల్లి గుర్తురాలేదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తోటపల్లి శంకుస్థాపన చేసి రూ.250కోట్లు మంజూరు చేసి పూర్తిచేసిందన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు రోజుకు 16గంటలు పనిచేస్తున్నారన్నారు. పింఛన్లమంజూరు కోసం రూ.6వేల కోట్లు వెచ్చిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీని బడుగు బలహీనవర్గాల వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మహాలక్ష్మి, ఏఎంసి ఉపాధ్యక్షుడు భూపతి శ్రీరామమూర్తి, ఎంపిటిసి మామిడి బలరాం, గోపాలకృష్ణరాజు, బి.వెంకటేశ్వరరావు, సురేష్, తనుబుజ్జి దాలినాయుడు, ఎంపిడివో మోహన్‌కుమార్, తహశీల్దార్ నర్శయ్య, ఇవో పిఆర్డి భాస్కరరావు, త్రినాథరావు, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.