శ్రీకాకుళం

ప్రతీ నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ : ఎంపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 14: ప్రతీ నియోజకవర్గంలో మోడల్ గ్రంథాలయాలు నెలకొల్పి అక్షరాస్యత దిశగా యువత పయణించాలని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక కేంద్ర గ్రంథాలయంలో 49వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని యువత వీటిని అధ్యయనం చేసుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పూర్వం స్వాతంత్య్ర సమయోధులు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి ప్రజల్లో చైతన్యం తెచ్చేవారన్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ గ్రంథాలయాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పాఠశాలల్లో విద్యార్థులచే పఠనోత్సవ కార్యక్రమాలను చేపట్టాలని ఉపాధ్యాయులను సూచించారు. సమావేశానికి జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్‌రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కథానిలయం అధ్యక్షుడు బివి ఏ రామారావునాయుడు, గాయిత్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులఖంఢం శ్రీనివాసరావు, గ్రంథాలయాధికారి బి.గోపాలరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివివేకానంద పుస్తకాన్ని ఆవిష్కరించారు.