శ్రీకాకుళం

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 14: కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలో గృహిణులు భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వ్రతాలు చేసుకున్నారు. కార్తీక సోమవారం రోజంతా ఉపవాసం చేపట్టి శివాలయాల్లో పూజలు చేశారు. వరిదుబ్బికి పసుపు-కుంకుమలతో అలంకరించి పలు రకాల ఫలాలతో ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన నోము తోరణాలను చేతికి కట్టుకొని కేధారీశ్వరుని వ్రతం జరుపుకొన్నారు. పెరసబూరెలు స్వీకరించడం తరతరాలుగా వస్తోంది. ఈ సందర్భంగా అనేక ఆలయాల్లో మహిళలు దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు.
నాగావళి నదీ తీరంలో కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ సభ్యులు బెహర నాగేశ్వరరావు నదీ తీరంలో దీపారాధన కార్యక్రమం చేపట్టారు. సంతోషిమాత, రాజరాజేశ్వరి, శైవ, వైష్ణవ క్షేత్రాల్లో మహిళలు కుంకుమ పూజలు, దీపారాధనలు చేశారు.