శ్రీకాకుళం

తెరపైకి రూపే కార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 18: ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు నిర్ణయానికి పది రోజులు కావస్తున్నా వందనోట్లు లేమి అన్నివర్గాల ప్రజలకు చిల్లర కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులకు నగదు మార్పిడి సేవలు పుష్కలంగా అందుతున్నాయని సామాన్యులకు మాత్రం కష్టాలే మిగిలాయన్న కథనం శుక్రవారం ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తీవ్రంగా స్పందించి తెరపైకి రుపేకార్డులు అమలు చేసి చిల్లర సమస్యకు చెక్ పెట్టాలన్న వ్యూహానికి పదునుపెట్టారు. శనివారం హుటాహుటిన లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి రామారావు, డుమా పీడి కూర్మనాథ్, డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్‌లకు రుపేకార్డు వినియోగం నగదు రహిత లావాదేవీలపై అధ్యయనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ అధికారుల బృందానికి చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులను అనుసంధానం చేసి ఎక్కడెక్కడ చిల్లర సమస్య ఉందన్న విషయాన్ని గుర్తించి వాటిని
పరిష్కరించేందుకు ఆన్‌లైన్ బాట పట్టేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఏటిఎంల వినియోగాన్ని కూడా మరింత జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వేగవంతం చేసింది. వ్యవసాయ సీజన్‌లో పనులు ఊపందుకుని కూలీలు ఏ రోజు డబ్బు ఆరోజు చేరేలా రుపేకార్డు వినియోగంపై దృష్టి సారించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను కూడా జిల్లా యంత్రాంగం సేకరించింది. జన్‌ధన్‌ఖాతాలు 4.80 లక్షల మందికి ఉండగా రుపే కార్డులు మాత్రం 2.32 లక్షల మందికే ఉన్నాయి. మిగిలిన వారికి కూడా ఈ కార్డులు అందేలా చర్యలు చేపట్టారు. డ్వాక్రా సంఘాలు 5.20 లక్షల మంది ఉండగా 515 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ 67వేల మందికే రుపేకార్డులు పంపిణీ అయ్యాయి. మిగిలిన వారికి కార్డులు అందజేసి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని కొనసాగించి చిల్లర సమస్యను నివారించాలని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు దారులు 7.10లక్షల మంది ఉండగా బ్యాంకు ఖాతాలు 4.12లక్షలమందికి ఉన్నాయి. అయితే 2.84లక్షల మందికి మాత్రమే రుపేకార్డులు జారీ అయినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. అందుబాటులో ఉన్న రుపే కార్డులు లబ్ధిదారులకు తొలుత నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించి వినియోగం పెంచాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో రుపేకార్డుల వినియోగం ఎటువంటి ఫలితాలు ఇస్తుందో.... ఎలా చిల్లర సమస్యను జిల్లా యంత్రాంగం అధిగమిస్తుందో వేది చూడాలి మరి.
* ఏ టి ఎం కార్డుల వినియోగం పెంచాలి: కలెక్టర్
పెద్దనోట్లు రద్దుతో తలెత్తిన సమస్యను అధిగమించేందుకు ఏటి ఎం కార్డుల వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పలువురు అధికారులతో చిల్లర సమస్యపై సమీక్ష నిర్వహించారు. తక్షణమే రూ.30కోట్లు వందనోట్లు జిల్లాకు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు ఆయన వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ వినియోగంలో ఎంబి ఏ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఓ పి ఎస్ మిషన్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 536 ఎఫ్ పి షాపుల్లో ఏ టి ఎం కార్డులు వినియోగించుకునేలా ఖాతాదారులకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎల్ డి ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు 1000 ఓ పి ఎస్ మిషన్లు కావాలని ప్రతిపాధనలు ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు.

బూటకపు ఎన్‌కౌంటర్లతో
ఉద్యమాల్ని ఆపలేరు
వజ్రపుకొత్తూరు, నవంబర్ 18: రాజ్యహింస రాజ్యమేలుతుందని, ప్రభుత్వం పోలీసులను నరహంతకులుగా తయారు చేసి బూటకపు ఎన్‌కౌంటర్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె సతీమణి, అమరుల బంధుమిత్రుల సంఘ నాయకురాలు శిరీష అన్నారు. ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్‌లో అమరులైన 31 మందిలో కుందనాలు అలియాస్ మమత స్వగ్రామం బాతుపురంలో శుక్రవారం సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోపిడీ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ తన తండ్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్నారని హాస్యాస్పదమైన ప్రకటనలు ఇస్తున్నారని, వాస్తవంగా వారు పని చేస్తున్నది తమ కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. పీడిత ప్రజల కోసం ఉద్యమబాట పట్టిన ఆర్‌కె బాటలోనే తన కుమారుడు పృద్వి అలియాస్ మున్నా నడుస్తుంటే కర్కశంగా పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌తో పొట్టన పెట్టుకున్నారన్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం ఒక్క ఉద్యమకారులకే సాధ్యమవుతుందన్నారు. ఆదివాసీల జీవించే హక్కును హరించే అధికారం పాలకులకు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యహింసతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. అమరుల బంధుమిత్రుల సంఘ కార్యదర్శి పద్మకుమారి మాట్లాడుతూ పరిపాలన చేతకాక ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్త్తోందన్నారు. ఉద్యమకారులు పట్టుబడితే చట్టాలకు అప్పగించాల్సిందిపోయి జీవించే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పోలీసులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూపోతే ఉద్యమించాల్సిన వస్తుందని హెచ్చరించారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైతన్య మహిళాసంఘ రాప్ట్ర అధ్యక్షురాలు దేవేంద్ర, ఉత్తరాంధ్ర అమరుల బంధుమిత్రుల సంఘ కార్యదర్శి జోగి కోదండరావు, సంఘ రాప్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, పోతనపల్లి జయమ్మ, తాండ్ర ప్రకాష్, నర్సన్న తదితరులు పాల్గొన్నారు.