శ్రీకాకుళం

ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 20: కాంట్రాక్ట్ ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. బుధవారం చిలకపాలెం కూడలిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తెలుగుదేశం ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపరిచి నేడు అధికారంలోనికి వచ్చినాక మాట మారుస్తుందని విమర్శించారు. ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడికి పాల్పడే చర్యలకు పూనుకుంటుందని ద్వజమెత్తారు. పి ఆర్ సి అమలులో భాగస్వామ్యులు చేయకపోవడం, బేసిక్ వేతనాలు అందివ్వకపోవడం సమంజసంగా లేదని ప్రభుత్వతీరును తప్పుపట్టారు. ఈనెల 28,29వ తేదీల్లో శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించనున్న సీటు మహాసభలను విజయవంతం చేయాలన్నారు. మేడేను పురష్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్.సురేష్‌బాబు, సీటు నేతలు పి.తేజేశ్వరరావు, ఎన్ వి రమణలు ఉన్నారు.

ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 20: అప్రమత్తంగా ఉండటం ద్వారా అగ్నిప్రమాదాలు నివారించవచ్చని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో బాగంగా బుధవారం సాయంత్రం స్థానిక పాతబస్టాండు వద్దనున్న అగ్నిమాపక శాఖ కార్యాలయం వద్ద సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇళ్లలో గ్యాస్ వినియోగంతో పాటు అగ్నిప్రమాదాల పట్ల తగు జాగ్రత్తలు అవసరమన్నారు. ఒకవేళ ఎంతలా అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రమాదం సంబవిస్తే ప్రాణరక్షణ, ఆస్తిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్బంగా అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం గత వారం రోజులుగా అగ్నిమాపక శాఖ నిర్వహిస్తున్న విన్యాసాలు, అవగాహనా సదస్సులో నిర్వహించే క్విజ్‌పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీదేవి, ఎస్‌ఎఫ్‌వో ఆర్.వెంకటరమణ; ఎల్‌ఎఫ్‌వో ఎం.అబ్బాయినాయుడు, సిబ్బంది డి.ప్రసాద్, భీమరాజు, బి.ప్రసాద్, హరికృష్ణ, డి.గోపి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

అగ్రికమ్‌తో అంబేద్కర్ వర్శిటీ ఒప్పందం
ఎచ్చెర్ల, ఏప్రిల్ 20: మండలంలోని ఏఏ వలస పరిధిలో ఉన్న నాగార్జునా అగ్రికమ్‌తో అంబేద్కర్ విశ్వవిద్యాలయం క్షేత్రస్థాయి అనుభవాన్ని విద్యార్థులకు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ వెల్లడించారు. బుధవారం విసి ఛాంబర్‌లో ఈ ఎంవోయుకు సంబంధించిన అంశాలను ఆయన వెల్లడించారు. క్యాంపస్‌లో ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన విద్యార్థులకు ఏడాది పాటు క్షేత్రస్థాయి అనుభవం అగ్రికమ్‌లో ఇచ్చేందుకు యాజమాన్యం ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ అనుభవం వలన ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థుల్లో రసాయనిక పరిశ్రమల్లో అవసరాలను తెలుసుకోవడమే కాకుండా మానవవనరుల వినియోగంపై మరింత పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. తద్వారా ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు ఏడాది క్షేత్రస్థాయి అనుభవం పరిశ్రమలో శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. ప్రథమ, తృతీయ సంవ్సరాలు క్యాంపస్‌లో చదవాల్సి ఉంటుందని ఈ ఒప్పందంలో పొందు పరచడం జరిగిందన్నారు. విసితోపాటు ఆగ్రికమ్ వైస్ ప్రెసిడెంట్ వివి రాజులు, డిజిఎం కోటేశ్వరరావు, రెక్టార్ ఎం. చంద్రయ్య, రిజిస్ట్రార్ జి.తులసీరావు, తదితరులు ఉన్నారు.

ప్రజాభాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
జలుమూరు, ఏప్రిల్ 20: ప్రజాభాగస్వామ్యంతోనే అభివృద్ది సాధ్యపడుతుందని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మండలం చల్లవానిపేట గ్రామంలో రూ.13లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ తరాల వారికి తాగునీటి కష్టాలురాకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలుగా భూగర్భజలాలను కాపాడాలని ప్రజలను సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఇంకుడు గుంతల కార్యక్రమంపై ప్రతీ కుటుంబం గ్రామ యువత నడుం బిగించాలని స్పష్టంచేశారు. తదుపరి ఈ సేవలను చూసి అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి తమవంతు సమకారం అందిస్తానన్నారు. శతశాతం మరుగుదొడ్లు నిర్మించిన గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. నాలుగు మండలాల కూడలిలో ఉన్న చల్లవానిపేట పంచాయతీని అందరినీ ఆకట్టుకునే విధంగా అభివృద్ది చేస్తామని మరో మూడేళ్ల అధికారంలో అభివృద్ధి చేసి నిరూపిస్తామన్నారు. అన్నివీధుల్లో సీసీరోడ్లు, కాలువలు నిర్మించి ప్రతీ ఇంటికి తాగునీటిని అందించే విధంగా అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రూ.13లక్షలతో భవనం నిర్మించిన పంచిరెడ్డి సోదరులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని పేదల కోసం మంజూరు చేసిన సంక్షేమ పథకాలు, విద్యుత్ సరఫరా, రైతు రుణమాఫీ పలు అంశాలను వివరించారు. ఇటువంటి కార్యక్రమంలో అధిక శాతంలో మహిళలు పాల్గొనడం ఆనందదాయకమని చేసిన అభివృద్ధికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. సర్పంచ్ పంచిరెడ్డి లలిత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి కొయ్యాన సుశీల, ఎంపిటీసీ పాగోటి రోహిణి, ఏ ఎం సి అధ్యక్షులు వెలమల చంద్రభూషణ, ఎంపిడివో వాసుదేవరావు, తహశీల్దార్ ప్రవల్లిక ప్రియ , పిఏసిఎస్ అధ్యక్షులు వాన కనకయ్య, మండల దేశం పార్టీనేతలు కొర్ని ప్రసాద్, అరవింద్, మాజీ ఎంపిపి వెలమల కృష్ణారావు, సారవకోట మండల పార్టీ అధ్యక్షులు సాదు కృష్ణారావు, చల్లవానిపేట జన్మభూమి సభ్యులు చల్ల రమణయ్య, డి ఇ రాంబాబు, జె ఇ నర్శింగరావు, కరవంజ, శ్రీముఖలింగం, రాణ, బి ఎల్ పాడు సర్పంచ్‌లు, ఎంపిటీసీలు పాల్గొన్నారు.

అరసవల్లిలో తిరుమంగయాళ్వార్ చరిత్ర సంవాదం
శ్రీకాకుళం(కల్చరల్), ఏప్రిల్ 20: అరసవల్లిలో నిర్వహిస్తున్న వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి తారుమంగయాళ్వారు చరిత్ర సంవాదం స్వామివారి ఉద్యానవనంలో ఆసక్తికరంగా సాగింది. విష్ణ్భుక్తుడు, ఛాయాదేవి బంధువు అయిన తిరుమంగయాళ్వారును స్వామివారి వివాహానికి ఆహ్వానించకపోవడంతో ఆయన ఆగ్రహించి చేసిన పనులు, స్వామివారితో వాదించడం, చివరకు తప్పు తెలుసుకొని స్వామిని శరణాగతి చేయడం, స్వామి అనుగ్రహించ డం దీని సారాంశం. సంప్రదాయంగా వస్తున్న ఈ సంవాదంలో సంవాదకులుగా భాస్కరభట్ల నర్శయ్యశర్మ, శ్రీరామమూర్తి, పులఖంఢం శ్రీనివాసరావు, గోపాలరావులు పాల్గొన్నారు. తొలుత ఉషాపద్మినిఛాయ సమేత సూర్యనారాయణస్వామివారి ఉత్సవ మూర్తులను సింహావాహనంపై ఊరేగించి ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పైసా ఖర్చులేకుండా పేదలకు వైద్యం
టెక్కలి, ఏప్రిల్ 20: వైద్య రంగాన్ని సమూలంగా మార్పు చేసి రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ పైసా ఖర్చులేకుండా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న సంచార వైద్య చికిత్సను రూపొందించారని కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. బుధవారం చంద్రన్న సంచార వైద్య చికిత్స కార్యక్రమాన్నిమంత్రి ప్రారంభించారు. ఈ సంచార వైద్య చికిత్స కార్యక్రమంలో వైద్యాధికారి, స్ట్ఫా నర్సు, ల్యాబ్‌టెక్నీషియన్, సిబ్బంది గ్రామాలకు నేరుగా వెళ్లి ప్రజలకు న్యాయమైన వైద్యసేవలను అందించేలాకార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. స్థానిక ఏరియాసుపత్రులలో ఎన్టీ ఆర్ వైద్య పరీక్షల పథకం కింద టెలీ, రేడియాలజీ, సిటీ స్కాన్, సార్వత్రిక వ్యాధి నిరోదక టీకా కార్యక్రమం కింద రోటా వైరస్ టీకా, ఐపివి టీకాను ప్రారంభించారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభించడం జరిగిందని త్వరలో ఆన్‌లైన్ విధానంలో వైద్య పరీక్షల నివేదికల పరిశీలన ప్రారంభం కానుందన్నారు. ఈ ఔషిదిని చక్కగా వినియోగించుకోవచ్చునని పరిమితిలేకుండా మందులు వినియోగించుకోవచ్చునన్నారు. టెక్కలి ఆసుపత్రిని రూ.22కోట్లతో నిర్మాణానికి టెండర్లు పిలిచామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఆసుపత్రుల సమన్వయ అధికారి వీరాస్వామి, డి ఎం అండ్ హెచ్ వో శ్యామల, మెండ ప్రవీణ్, ఎల్ ఎల్ నాయుడు తదితరులు ఉన్నారు.

ఘనంగా విశే్వశ్వర ఆలయ పునఃప్రతిష్ఠ
జి.సిగడాం, ఏప్రిల్ 20: మండలం కేంద్రమైన జి.సిగడాం గ్రామంలో విశే్వశ్వర పార్వతీ వినాయక శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మొదలగు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు బ్రహ్మశ్రీ రవిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారంనుండి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ప్రతిష్ఠామహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఉదయం విఘ్వేశ్వర పూజ, పున్యాహవచనం వేదపండితులు నిర్వహించారు. ముందుగా గ్రామపురవీధులలో ప్రతిష్ఠించిన విగ్రహ మూర్తులను భక్తుల దర్శనార్థం ఊరేగించారు. సాయంత్రం అగ్నిప్రతిష్ఠ, హోమాలు విగ్రహాలకు ఆదివాసాలతోపాటు హారతి మంత్రపుష్పం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మల్లపురాజు శర్మ, చిరంజీవి, మూర్తి, కృష్ణచైతన్య, సంతోష్‌కుమార్, శ్రీనివాస, చంటి శర్మ, ఎర్రగుంట శర్మతోపాటు పురోహితులువేమూరి శ్రీనివాసశర్మలు పాల్గొన్నారు.