శ్రీకాకుళం

నగర పాలక సంస్థకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 1: శ్రీకాకుళం నగర పాలక సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా గుర్తిస్త్భూరత ప్రభుత్వం స్వచ్ఛ్భారత్‌మిషన్ స్వచ్ఛ ధృవీకరణ పత్రంను అందజేసిందని నగర పాలక సంస్థ కమీషనర్ పి ఏ శోభ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ్భారత్ మిషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇటీవల నగర పాలక ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారన్నారు. వారి పరిశీలన మేరకు నగరపాలక సంస్థ పరిధిలో పన్నులపై సంతృప్తి చెంది ఈ పురస్కారాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో భాగస్వామ్యులైన నగర ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో బహిరంగ బలవిసర్జన రహిత ప్రాంతంగా చేపట్టుటకు అనేక చర్యలు చేపట్టామని వీటన్నింటిలో ప్రజలు సహకరించడం వలన ఇది సాధ్యమైందన్నారు. ఈకార్యక్రమంలో భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులకు , అధికారులకు, ప్రజలకు ధన్యవాధాలు తెలియజేశారు. ఈ ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఆమె కోరారు. తద్వారా స్వచ్ఛనగరంగా ఉండటమే కాకుండా ఇతర ప్రాంతాలకు స్ఫూర్తివంతంగా , ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు.
గాంధీ విగ్రహం ఆవిష్కరణ
ఎచ్చెర్ల, డిసెంబర్ 1: మండలంలోని డీ మత్స్యలేశం ఉన్నత పాఠశాల ఆవరణంలో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా హెచ్‌ఎం రమణ మాట్లాడుతూ బావి భారత పౌరులంతా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సత్యం, అహింస అనే సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్దించేలా బ్రిటీష్‌పాలకులపై పోరు సలిపిన మహనీయుడని కొనియాడారు. ఎంపిటీసీ మూగి శ్రీరాములు మాట్లాడుతూ గాంధీ సిద్దాంతాన్ని ఆచరించి విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ విగ్రహాన్ని డ్రాయింగ్ ఉపాధ్యాయురాలు విజయశ్రీ భర్త టేకి ఆచారి(్ధర్మవరం) విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ అద్యాపకులు చిగిలిపల్లి శ్రీనివాసరావు, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు ఉన్నారు.