శ్రీకాకుళం

ఖరీఫ్ సాగు అయ్యే ప్రతి ఎకరాలోనూ రబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, డిసెంబర్ 6: ఖరీఫ్ కాలంలో సాగు అయ్యే ప్రతి ఎకరాలోనూ రబీలో పంటల సాగు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రబీలో కూడా పంటల సాగు జరిగితే రైతాంగానికి మరింత ఆర్థిక ఆసరా కలుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు కె.్ధనుంజయరెడ్డి స్పష్టం చేశారు. మండలం అంపోలు పంచాయతీ గ్రామంలో అపరాలు సాగును ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడారు. వేసవి పెసరకు వచ్చే తెగుళ్లును తట్టుకునే విధంగా విత్తనాలు తయారీపై దృష్టి సారించాలని ఎన్.ఎఫ్. ఎస్.ఎం. రాష్ట్ర అధికారి ఎన్.డి.ఆర్.కె. శర్మను సూచించారు. నాణ్యమైన విత్తనాలు, పోషక విలువలుతో కూడిన ఎరువులు సకాలంలో రైతాంగానికి సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులను సూచించారు. అధునాతన పరికరాలుపై స్థానిక రైతాంగానికి అవగాహన ఉందని, ఈ నేపథ్యంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు మంజూరుకై నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఈ సందర్భంగా రాష్ట్ర సంచాలకులను కోరారు. రైతాంగానికి ఎంతో అవసరమైన టార్పాలిన్లు సరఫరా చేయాలని ఈ సందర్భంగా వ్యవసాయాధికారి బి.వి. తిరుమలరావు కోరగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రైతాంగానికి అధిక దిగుబడులు ఇచ్చే నూతన వంగడాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే విధంగా సూచనలు సలహాలు అందజేయాలని ఈ సందర్భంగా సంచాలకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జె.డి. రామారావుతో పాటు పలువురు వ్యవసాయాధికారులు ఉన్నారు.