శ్రీకాకుళం

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతశ్రీకాకుళం, డిసెంబర్ 9: రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు ఈనెల 10,11వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం రోడ్డు మార్గంలో 9:30గంటలకు రాజాం చేరుకుంటారు. 10:30గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాత్రి బస చేస్తారు. ఆదివారం ఉదయం 8 గంటలకు రాజాం నుండి బయలుదేరి 9గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 10గంటలకు బ్రాహ్మణ అవగాహన సదస్సులో పాల్గొంటారు. 11:30గంటలకు కలెక్టర్ ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి
జిల్లా పర్యటన
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 9: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి పరిటాల సునీత శనివారం జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శనివారం ఉదయం 10:20గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 11:50గంటలకు శ్రీకాకుళం చేరకుంటారని చెప్పారు. మధ్యాహ్నం 12గంటలనుండి సాయంత్రం 5గంటల వరకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన డిజిటల్ పేమెంట్స్, క్షేత్రస్థాయి, నగదురహిత లావాదేవీలపై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొంటారు. సాయం త్రం 5 గంటలకు నరసన్నపేట నుండి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో వెల్లడించారు.
అవినీతి నిర్మూలనపై పరీక్షలు
జలుమూరు, డిసెంబర్ 9: అవినీతి నిర్మూలనకు జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులకు పరీక్షలను నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలంలోని అల్లాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రథమస్థానం దక్కించుకున్నారు.
ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీనృసింహం చేతులమీదుగా జ్ఞాపికలను అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శుక్రవారం మధ్యాహ్నం అల్లాడ హైస్కూల్‌లో హెచ్‌ఎం, ఎంఈవోలు అభినందించారు.