శ్రీకాకుళం

జర్మనీతో అంబేద్కర్ వర్శిటీ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, డిసెంబర్ 19: భారత ప్రభుత్వం విదేశీ విద్యను ఇక్కడి విద్యార్థులకు అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా వివిధ వర్శిటీలు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా జర్మనీకి చెందిన యూరోపియన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, స్టెన్‌బీస్ట్ విశ్వవిద్యాలయంతో సోమవారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యను అందిపుచ్చుకునేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రాష్ట్ర ప్రతినిధిగా జిల్లా జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు హాజరై ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జర్మనీ వర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బెట్రమ్లో ముటెల్లార్‌తో అక్కడ విద్యావకాశాలపై ఇన్‌చార్జ్ వీసి ఎం.చంద్రయ్య, రిజిస్ట్రర్ జి.తులసీరావులు చర్చించారు. ఇక్కడ కోర్సులు, విద్యావిధానం, పరిశోధనా క్రమం వంటి విషయాలు కూడా జర్మనీ ఆచార్యులకు వివరించారు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎమ్మెస్సీ, పీహెచ్‌డి వంటి కోర్సులు అందిపుచ్చుకునేందుకు ఆసక్తి కనబరిస్తే ఫీజు రాయితీ, వర్శిటీకి కూడా కొంతమొత్తాన్ని పారితోషికంగా జర్మనీ విశ్వవిద్యాలయం చెల్లిస్తుందని అధికారులు స్పష్టంచేశారు. అంతర్జాతీయ విద్యామార్పిడి విధానంలో భాగంగా ఈఎంవోయు కుదుర్చుకున్నట్టు తెలిపారు. జర్మనీకి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఈ విశ్వవిద్యాలయానికి చేరుకొని ఇక్కడ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునేలా ఈఎంవోయు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌లేటర్‌గా వెంకటనాగరాజు వంగపండు, విశ్రాంత అధ్యాపకులు వి.జగన్నాథనాయుడు, అనీల్ తదితరులు వ్యవహరించారు. ప్రొఫెసర్ బి అడ్డయ్య, వర్శిటీ అధికారులు ఉన్నారు.

జెనిటిక్స్ అంశం కీలకం
* జెసి చక్రధరబాబు
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 19: జెనిటిక్స్ అంశం కీలకమైనదని జాయింట్ కలెక్టర్ కెవిఎన్ చక్రధరబాబు అన్నారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ బయోటెక్నాలజీ విభాగం సౌజన్యంతో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల జెనిటిక్స్ అండ్ జినోమ్ ఎనాలసిస్ ఫర్ నోవల్ తెరాఫిటిక్స్ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సును కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈసదస్సుకు జెసి చక్రధరబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.
సమాజంలో జెనిటిక్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. అనేక అంశాలకు జెనిటిక్స్ మూలమన్నారు. జెనిటిక్స్ అంశాన్ని సక్రమంగా వినియోగించి కౌన్సిలింగ్ అందించడం వలన అనేక మార్పులు రాగలవన్నారు. వైద్య పరమైన అంశాలకు కూడా జెనిటిక్స్ కౌన్సిలింగ్ వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ రంగంలో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులు ప్రతీ అంశాన్ని క్షున్నగా పరిశీలించాలని సమాజానికి అసవరమైన అంశాలపై నిజ్ఞాన ఉండాలన్నారు. విద్యార్థులుగా మంచి పరిజ్ఞానం పెంపొందించుకొని సమాజంలో ఎక్కడైతే లోటు ఉందో దానిని పూరించేందుకు వినియోగించాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య మానవునికి అందేటట్టు కృషి చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.బాబూరావు సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ జాతీయస్థాయి సెమినార్‌లను కళాశాలలో నిర్వహిస్తూ తద్వారావిద్యార్థులకు మంచి పరిజ్ఞానం కలిగేటట్లు చేస్తున్నామన్నారు. జెనిటిక్స్ విభాగంపై సదస్సు నిర్వహించడం ముదావహమన్నారు. ఈ సెమినార్‌లో బెంగుళూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ పాటూరి కొండయ్య కీలక ప్రశంగాన్ని చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి.లచ్ఛన్న, బయోటెక్నాలజీ విభాగం అధ్యాపకులు ఎం.ప్రదీప్, ఐక్యూ ఏసి సమన్వయ కర్త ఎన్‌ఎస్‌ఎన్ స్వామి, కార్యనిర్వహక కార్యదర్శి లక్ష్మున్నాయుడు, వై.పోలినాయుడు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.