శ్రీకాకుళం

‘సర్వే’పైనే మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 20: నియోజకవర్గాలు తమ జాగీరులన్న రీతిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికివారే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మావే బి.్ఫరాలు అంటూ ధీమా వ్యక్తం చేసే రోజులకు కాలం చెల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనహితం కోరిన పాలకులకే రానున్న ఎన్నికల్లో బి.్ఫరాలు అందుతాయంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు. అమరావతిలో మంగళవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎం.పి., పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో సర్వసభ్యసమావేశంలో ఆయన జిల్లా నేతలకు ప్రత్యేకంగా క్లాసు తీసుకున్నారు.
ముందుగా జనచైతన్యయాత్రలను విజయవంతం చేసినందుకు అభినందించారు. అనంతరం జిల్లాకు ఇచ్చిన 2.11 లక్షల సభ్యత్వాల లక్ష్యానిగాను, 2.54 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసినందుకు క్షేత్రస్థాయి క్యాడర్ పనితీరును మెచ్చుకున్నారు. జిల్లాలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో 40,000 సభ్యత్వాలు నమోదు చేయించారు. 34 వేల సభ్యత్వ లక్ష్యానికి గతసారి 38 వేలు నమోదు చేయగా, ఈసారి 40 వేలు చేసినట్టు కళా ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. పాలకొండ నియోజకవర్గంలో లక్ష్యానికి 80 శాతం సభ్యత్వాలే పూర్తి చేసినట్టు తెలిపారు. మావోల ప్రభావిత ప్రాంతాల్లో సభ్యత్వ నమోదులు మందగొండిగా ఉండడంతోనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయారంటూ వివరించారు. అలాగే, ప్రజల్లో సానుకూలత, పాలనలో పారదర్శకత కనపరిచిన శాసనసభ్యులకు తిరిగి బి.్ఫరాలు దగ్గుతాయని చెప్పకనేచెప్పారు. దీనిపై కూడా పల్స్ సర్వే మాదిరిగా ‘పాలనాపరమైన సర్వే’ను నిర్వహించి, వీటి ఆధారంగానే బి.్ఫరాలు అందిస్తామన్నారు. ప్రజలు, కార్యకర్తలతో సంత్సంబంధాలు కలిగిన ఎమ్మెల్యేలకే రానున్న ఎన్నికల్లో ఛాన్స్ ఉంటోందన్న విషయాన్ని గమనించాలంటూ బాబు పేర్కొన్నట్టు తెలిసింది. ప్రతీ మూడుమాసాలకోసారి నిర్వహించే ఈ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సక్రమంగా ప్రజలమధ్య లేకపోయినా, 80 శాతం వారి ఆశీస్సులు పార్టీ పట్ల కొరవడిన వారికి బి.్ఫరాలు ఇచ్చేందుకు కష్టమవుతోందన్న విషయాన్ని బాబు సిక్కోల్ నేతలకు సుస్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
నగదు రూపంలో వచ్చే పింఛన్లు మంజూరు చేస్తామని బాబు జిల్లా నేతలకు భరోసా ఇచ్చారు. అలాగే, జూన్ నాటికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. ప్రతీ పోలింగ్ బూత్‌లోనూ సభ్యత్వం, పార్టీ కమిటీ ఉండాలని సూచించారు. విపక్షం 2019 నాటికి పూర్తిగా ఉండకూడదన్నదే ఎమ్మెల్యేలు లక్ష్యంగా పనిచేయాలని హెచ్చరించారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష పాల్గొన్నారు.