శ్రీకాకుళం

సంక్రాంతి కోసం పల్లెల్లో సరకుల నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, డిసెంబర్ 30: సంక్రాంతి పర్వదినం అనగానే హిందువులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అటువంటి పండగలు మరో 10 రోజుల్లో జరుగుతున్నందున మారుమూల పల్లెల్లో పలువురు వ్యాపారులు ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను దిగుమతులు చేసుకొని నిల్వలు చేసుకున్నారు. పలు రాష్ట్రాల్లో సుదీర ప్రాంతాల్లో ఉన్న వలసకూలీలు, ఉద్యోగులు స్వగ్రామాలకు చేరుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
పల్లెల్లో సొంత ఇళ్లకు సున్నాలు, రంగులతో అలంకరిస్తున్నారు. ఈ ఏడాది పంటలు అనుకూలంగా ఉన్నందున సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాలువ పనులు పూర్తిచేయండి
ఎచ్చెర్ల, డిసెంబర్ 30: మడ్డువలస రెండోదశ నిర్మాణాల్లో భాగంగా మిగిలివున్న కాలువ పనులను సత్వరంగా పూర్తిచేసి ఎస్‌ఎం పురం పెద్ద చెరువుకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని జడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మడ్డువలస ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. పొందూరు మండలం బొట్లపేట, కోటిపల్లి సమీపంలో రెండు కిలోమీటర్ల కాలువ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. 2010లో కాలువ తవ్వకాలు ప్రారంభించగా ఆరేళ్లు కావస్తున్న అసంపూర్తిగా మిగలడం వలన ప్రభుత్వ లక్ష్యం ఇంకా ఎప్పుడు నెరవేరుతుందని అధికారులను ప్రశ్నించారు. సిఎం చంద్రబాబు ప్రతి ఏకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా పనిచేయడం లేదని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి కల్వర్టుల నిర్మాణాలు తీసుకున్నారా లేదని ప్రశ్నించారు. దీనిపై ఇఇ ప్రదీప్ మాట్లాడుతూ భూసేకరణ పనులు పూర్తిచేశామని త్వరలో పెద్ద చెరువుకు స్పష్టం చేశారు. చౌదరి బాబ్జీ, డిఇ శ్యామసుందరరావు, ఎఇ నాగేంద్రలు ఉన్నారు.

‘జన్మభూమి మా ఊరు’కు సిద్ధం కండి
జి.సిగడాం, డిసెంబర్ 30: జనవరి 2 నుండి 11వరకు జరగనున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపిపి బి.మహాలక్ష్మి కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపిపి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో నాలుగో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులంతా గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారంతో విధిగా హాజరుకావాలన్నారు. ఎంపిడివో మోహన్‌కుమార్ మాట్లాడుతూ గత జన్మభూమిలో వచ్చిన శాఖలవారీగా దరఖాస్తులు ఎన్ని పరిష్కరించాం, కాలేదు, అని పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. తహశీల్దార్ టి.నరసయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు వ్యక్తిగత, కుటుంబ గ్రామ వికాసాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. జన్మభూమి కార్యక్రమంలో 31 గ్రామ పంచాయతీల్లో అర్హులైన దరఖాస్తు దారులకు 1470 రేషన్‌కార్డులు, 83 పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఉపాధ్యక్షుడు భూపతి శ్రీరామమూర్తి, డి.వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు జన్మభూమి కమిటీ సభ్యులు మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.