శ్రీకాకుళం

నూతన సంవత్సర సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 1: నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటేలా జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు నేతలు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు జరుపుకోవడం కనిపించింది. పండగ వాతావరణంలో పల్లె పట్టణం అని తేడా లేకుండా యువత భాగస్వామ్యంతో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీలు, కేక్‌లు కట్ చేసి 2017కు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం సెలవు దినం కావడం అన్ని వర్గాల ప్రజలు ఈ పండగలో భాగస్వామ్యులయ్యేందుకు మరింత అవకాశం కలిసొచ్చింది. పొగమంచును కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే నేతి మిఠాయిలు, పండ్లు, కేక్‌లు చేతపట్టి బొకేలతో వారివారి వాహనాల్లో తమ తమ అభిమాన నేతల వద్దకు క్యూ కట్టారు. రాష్ట్ర కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్వగ్రామమైన నిమ్మాడ అభిమానులతో పోటెత్తింది. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డితోపాటు ఇచ్ఛాపురం నుండి పైడిభీమవరం వరకు పాతపట్నం నుంచి తీర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న అధికార పార్టీ కేడరంతా బాబాయ్-అబ్బాయ్‌ల వద్దకు పరుగులు తీసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. అభిమానుల కోలాహలం నడుమ బాబాయ్- అబ్బాయ్‌లు కేక్‌ను కట్ చేసి ఈ వేడుకలను జరుపుకొన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే టిడిపి రాష్ట్రఅధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ఉన్న రాజాం క్యాంపు కార్యాలయానికి పార్టీ నేతలంతా చేరుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా పాలకొండ డివిజన్‌లో ఉన్న పల్లెలన్నీ రాజకీయాలకు అతీతంగా కళా వద్దకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆమదాలవలసలోని తన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొన్నారు. అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గంతోపాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పెద్దయెత్తున ఈ పవర్‌సెంటర్‌కు క్యూ కట్టడం గమనార్హం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ, దంపతులు అరసవల్లిలోని వారి స్వగృహంలో వేడుకలను నిర్వహించారు. శ్రీకాకుళం నగరంతోపాటు గార, రూరల్ మండలాల నుండి కేడర్ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అరసవల్లి పరిసరాలు జనసంద్రంతో నిండిపోయాయి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ నారాయణమూర్తి ఎస్‌ఎంపురంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జిల్లా పరిషత్ సిబ్బంది పార్టీ కేడర్ కోలాహలం నడుమ కేక్‌ను కట్ చేసి ఆనందోత్సవాలతో నూతన సంవత్సర సంబరాలను నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి చైర్‌పర్సన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ వేడుకలను కేడర్ మధ్య జరుపుకొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు ఇందులో పాల్గొన్నారు. పలాస ఎమ్మెల్యే శివాజీ విదేశీయానంలో ఉండటంవలన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష , విసి ఈ వేడుకల్లో పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉన్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు అధికారులు పాల్గొని శిరీషకు శుభాకాంక్షలు తెలిపారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతీ, పాలకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్జి నిమ్మక జయరాం వేడుకల్లో పాల్గొని వారివారి పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకున్నారు.
మాజీ మంత్రి ధర్మాన వేడుకలకు దూరం : నూతన సంవత్సర వేడుకలను బహిష్కరించాలని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపుఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు వేడుకలకు దూరంగా గడిపారు. దేశానికి వెన్నుముక అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకుండా వారి జీవన ప్రమాణాలు దిగజారే రీతిలో బాబు సర్కారు వ్యవహరించడంతో మాజీమంత్రి ధర్మాన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా శ్రీకాకుళం నగరంలో ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాన్ని ఆయన కొనసాగించారు. ఈ కారణంగా వైకాపా నేతలంతా ధర్మాన శిబిరంలోనే గడిపారు.