శ్రీకాకుళం

పవన్ కల్యాణ్ సభకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, జనవరి 1 : ఉద్దానంలోని కిడ్నీ రోగులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 3వతేదీన జరపనున్న ముఖాముఖి కార్యక్రమ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ కోశాధికారి ఎం.రాఘవయ్య చె ప్పారు. కార్యక్రమ వేదికైన స్థానిక మణికంఠ థియేటర్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులకు సీట్లు కేటాయి ంచాలన్నారు. అభిమానులు థియేటర్ వరకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక అభిమానుల ప్రతినిధులు సంతోష్ యాదవ్, దాసరి రాజులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ 3వతేదీ ఉదయం నేరుగా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన ఇచ్ఛాపురం చేరుకుంటారని చెప్పారు. థియేటర్‌లోకి రోగులతోపాటు సహాయకులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అవసరమైతే వైద్యసహాయం అందించేందుకు వైద్యుడిని సిద్ధం చేస్తామన్నారు. ముఖాముఖిలో రోగుల సమస్యలను, కష్టాలను పవన్ కల్యాణ్ తెలుసుకుని ప్రభుత్వాల దృష్టికి వచ్చేలా చేస్తారని చెప్పారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వేరు కాదని, అందరూ జనసేన కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ సందేహలు ఉండనక్కర లేదన్నారు. కిడ్నీ రోగులకు మేలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట పార్టీ మీడియా ఇన్‌చార్జి హరిప్రసాద్, తెలంగాణ పార్టీ ఇన్‌చార్జి శంకర గౌడ్, ప్రతినిధులు సందీప్, కీర్తేష్, హర్ష, తైక్వాండో లక్ష్మణ్, భానుచంద్ర పాల్గొన్నారు.

జిల్లాకు 7న సిఎం రాక
* త్రిపుల్ ఐటి భవనాలకు శంకుస్థాపన

శ్రీకాకుళం, జనవరి 1: జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 7వతేదీన జిల్లాకు విచ్చేస్తున్నట్లు టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు తెలిపారు. ఆదివారం ఆంధ్రభూమితో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మైలురాయిగా నిలిచే త్రిపుల్ ఐటి ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. 340 ఎకరాలు భూ కేటాయింపులు జరుపుతూ సిఎం జీవో కూడా జారీ చేశారన్నారు. త్రిపుల్ ఐటి తరగతుల నిర్వహణ నూజివీడు కేంద్రంగా ప్రథమ సంవత్సరం ప్రారంభమైందన్నారు. ఇప్పటికే ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. 1000మంది విద్యార్థులకు అవసరమైన వౌలిక వసతుల కల్పనకు వీలుగా సిఎం భవనాల శంకుస్థాపన నిర్వహిస్తారన్నారు. అలాగే అంబేద్కర్ వర్శిటీ ఆవరణంలో ఉన్న అకడమిక్ బ్లాక్ భవనాలను కూడా సిఎం ప్రారంభిస్తారని తెలిపారు. చేనేత కార్మికుల కోసం నిర్మించిన భవన సముదాయాన్ని రాజాంలో సిఎం ప్రారంభిస్తారని కళా వెల్లడించారు.

దట్టమైన పొగమంచు
* వాహన చోదకులకు అవస్థలు
ఎచ్చెర్ల, జనవరి 1: వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా చలిగాలుల తీవ్రత మరింత పెరిగింది. దీనికి పొగమంచు తోడు కావడంతో వాహనచోదకులు నానా అవస్థలు పడుతున్నారు. గత వారం రోజులుగా జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారులన్నీ మంచు దుప్పట్లతో కప్పుకోవడం వల్ల జనజీవనం కూడా స్తంభించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ప్రయాణం సాగించే వాహనచోదకులు రోడ్డు తెలియక ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించలేని రీతిలో మంచు కురుస్తుంది. ఈ కారణంగా వాహన ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. ఉదయం 9గంటల వరకు మంచు పడటంతో వ్యవసాయ పనులకు ఆటంకంగా మారింది. మంచు కారణంగా జీడిమామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పూత మాడిపోయే ప్రమాదం ఉందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప పంట సాగుచేసే రైతులు కూడా దిగాలు చెందుతున్నారు. ఉబ్బసం, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉపశమనం కోసం చలిమంటలు, ఉన్ని దుస్తులను ఆశ్రయించక తప్పడంలేదు.

నేటి నుంచి జన్మభూమి
* అపరిష్కృతంగా అర్జీలు
* అందని రేషన్ కార్డులు
* దరిచేరని పింఛన్లు - ఇళ్లు

శ్రీకాకుళం, జనవరి 1: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఆసక్తి పథకాల్లో జన్మభూమి కార్యక్రమం ఒకటి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి అక్కడి సమస్యలు గుర్తించడంతోపాటు పరిష్కార మార్గాలు కూడా అనే్వషించడం కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యం. గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్న సిఎం ఆలోచన క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జన్మభూమి కమిటీలకు ప్రభుత్వ పథకాలు లబ్దిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించడం వలన రాజకీయ గ్రహణం పట్టి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాల్గవ విడత జన్మభూమి-మావూరు కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. కుటుంబ సంక్షేమం, వికాసం కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గత మూడు విడతలుగా వేలాది మంది జిల్లాలో రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్న ఇప్పటికీ మంజూరు కాలేదు. ఎఫ్‌పి షాపుల ద్వారా నిత్యావసర సరుకులను బయోమెట్రిక్ విధానంలో పంపిణీ ప్రారంభించిన తర్వాత అనేక యూనిట్లు మిగలడం, బినామీ రేషన్ కార్డులు ఎక్కడికక్కడే బయటపడడం పరిపాటిగా మారాయి. వీటి స్థానే ఎప్పటికప్పుడు కార్డులు లేని కుటుంబాలకు అందించగలిగితే ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేది. ఇందుకు భిన్నంగా బాబుసర్కార్ వ్యవహరించడంతో రేషన్ కార్డుల కోసం అర్హత ఉన్న కుటుంబాలకు నిరీక్షణ తప్పడం లేదు. కార్డు లేకపోవడం వలన ఎన్టీఆర్ వైద్యసేవ, పిల్లలు ఫీజుల రాయితీ కీలక అవసరాలు గట్టెక్కడం లేదని ఆ కుటుంబాలు వాపోతున్నాయి.
ఇదిలాఉండగా పింఛన్లు మంజూరు చేయాలని కుప్పలు, కుప్పలుగా దరఖాస్తులు కార్యాలయాల్లో పడి ఉన్నాయి. ఐదు రెట్లు పింఛను అందిస్తున్నామని ఆర్భాటంగా చెప్పుకుంటున్న పాలకులు వయోపరిమితిని 65 ఏళ్లుకు పెంచడం వలన వృద్ధులు ఒకింత అభద్రతా భావానికి లోనవుతున్నారు. సాంకేతిక కారణాలను ఎత్తిచూపి అర్హులకు పింఛన్లు ఇవ్వకపోవడం దరఖాస్తు దారుల్లో ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియోజకవర్గానికి రెండు వేల చొప్పున పింఛన్లు ఇస్తామని ప్రకటన చేశారే తప్ప ఈ జన్మభూమిలో లబ్దిదారులకు అందజేసి తీపి కబురు అందించే పరిస్థితి లేకపోవడం అర్హులు మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. పక్కా ఇళ్లు కోసం కూడా దరఖాస్తు చేసుకున్న వారికి నిరాశే ఎదురవుతుంది. ప్రభుత్వ ఏర్పడి 30 నెలలు కావస్తున్న ఇప్పటికీ బడుగు, బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణాలు జరపకపోవడంతో ఆ కుటుంబాల్లో కళ్లల్లో ఒత్తులు వేసుకుని సొంతింటి కల కోసం వేచి చూస్తున్నారు.
నియోజకవర్గానికి 1250 ఇళ్లు కేటాయించామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న ఎక్కడా ఇళ్లు నిర్మాణాలు ప్రారంభించక పోవడం అర్హులను మరింత కలవరానికి గురిచేస్తుందనే చెప్పాలి. ఇళ్ల స్థలాలు, గ్రామాలకు రహదారులు సామాజిక భవనాలు, పాఠశాల భవనాలు వంటి వౌలిక వసతులు కోసం ఇచ్చిన దరఖాస్తులకు అతీగతి లేకుండా పోయింది. నిధులు లేకపోవడం వలన ఇటువంటి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ధాన్యం పండించే రైతులు కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడం, కనీసం దళారీలకు కూడా లావాదేవీలు జరపకపోవడంతో మరింత ఇబ్బందికి ఆ కుటుంబాలు లోనవుతున్నాయి. పట్టుమని 10 రోజులు కూడా సంక్రాంతి పండగ లేకపోవడం వలన అన్నదాతలు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్ద నోట్ల రద్దు, చిల్లరి సమస్యలు ఇబ్బందులను తెచ్చిపెట్టగా, తాజాగా ధాన్యం విక్రయాలు లేమి ఈ కుటుంబాలను మనస్థాపానికి గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జన్మభూమి సభలు రసాభాసగా జరుగుతాయా లేకుంటే జనం లేక వెలవెలబోతాయా అన్న దిగులు తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి.

జన్మభూమి పోస్టర్‌ను విడుదల
చేసిన మంత్రి
శ్రీకాకుళం(రూరల్), జనవరి 1: జనవరి 2 నుండి 11వతేదీ వరకు జరిగే నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎం.పి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిపి స్వగ్రామమైన నిమ్మాడలో ఆదివారం ఉదయం విడుదల చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం జన్మభూమి-మాఊరు పోస్టర్లను జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్‌తో కలిసి ఆదివారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.