శ్రీకాకుళం

ఎసిబి వలలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, జనవరి 3: రాజాం ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సూపర్‌వైజర్ ఎస్.మీరాంజలి మంగళవారం ఎసిబి వలలో చిక్కారు. రాజాంలోని చెరువుగట్టు వీధిలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సి.హెచ్.విశాలాక్షికి ప్రతినెలా వంట చెరకు, గది అద్దె, డిఎ నాలుగు బిల్లులు మంజూరుకి రూ.5 వేలు లంచం అడగ్గా, అంత ఇచ్చుకోలేమని చెప్పినప్పటికీ సూపర్‌వైజర్ వినిపించుకోలేదు. రూ.5 వేలు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు కార్యకర్త ఎసిబిని ఆశ్రయించింది. ముందు ప్రణాళిక ప్రకారం రూ.5 వేలు పట్టుకొని మెంతిపేట ఎస్పీకాలనీ కార్యకర్త నిర్మలతో కలిసి ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్లగా అప్పటికే పిఒ అక్కడ ఉండడంతో ఇక్కడ వద్దు బుక్కావీధిలోని తన ఇంటికి డబ్బులు తీసుకురావాలని కోరడంతో వారిద్దరు సూపర్‌వైజర్ ఇంటికి చేరుకొని రూ.5 వేలు నోట్లు చెల్లిస్తుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారు ఇచ్చిన నోట్లు ముందస్తుగా ఏసిబి అధికారులే ఇవ్వడంతో రసాయన పరీక్షలు చేసి నిర్ధారించిన తర్వాత సూపర్‌వైజర్‌తో ఐసిడిఎస్ కార్యాలయానికి చేరుకొని పిఒ వసుంధరాదేవి, సాక్షుల సమక్షంలో విచారణ జరిపారు. ఈ సంఘటనలో ఏసిబి డిఎస్పీ రాజేంద్ర, సిఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. నాకు ఎటువంటి పాపం తెలియదని సూపర్‌వైజర్ చెబుతున్నా కార్యకర్త మాత్రం ఆమె డిమాండ్ చేయడం, తాను చెల్లించడం నిజమేనన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు.

రాష్ట్భ్రావృద్ధి, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
* జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరి ధనలక్ష్మీ
వీరఘట్టం, జనవరి 3: రాష్ట్ర అభివృద్ధితోపాటు నిరుపేదల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరి ధనలక్ష్మీ అన్నారు. మంగళవారం సాయంత్రం బిటివాడ పాఠశాల ఆవరణలో జన్మభూమి గ్రామసభలో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం రూ.16 వేలకోట్ల మేరలోటు బడ్జెట్ ఉన్నప్పటికీ దానిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత చంద్రబాబుకే ఘనత దక్కుతుందన్నారు. అందరికీ సమన్యాయం జరిపిస్తూ నిరుపేదలకు అండగా ఉండి నిరంతరం రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్నారని తెలిపారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒకేసారి సుమారు రూ.2 వేల కోట్లు నిధులు సాధించిన ఘనత ఆయనదే అన్నారు. అంతకుముందు గ్రామంలోని 56 గ్రూపులకు చెందిన 532 మంది మహిళలకు రూ.15 లక్షల రూపాయల చెక్కును అందించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ నిమ్మక పాండురంగ, జన్మభూమి కమిటీ సభ్యులు మాట్లాడుతూ జన్మభూమిద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడమే కాకుండా గ్రామ సమస్యలు లక్ష్యమన్నారు. ఈ గ్రామసభలో సర్పంచ్ లింగాల కృష్ణవేణి, లింగాల అప్పన్న, పాలకొండ, బిటివాడ ఆసుపత్రి కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, వీరఘట్టం టిడిపి అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేకాధికారి వై.వి.శ్యామ్‌కుమార్, ఎంపిడి ఒ ఎస్.శంకరరావు, తహశీల్దార్ ఎం.వి.రమణ పాల్గొన్నారు. అంతకుముందు వండువ గ్రామసభలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొని గత మూడు జన్మభూముల సభల్లో ప్రజలు సమస్యలు తెలియజేసినా ఇంతవరకు పరిష్కారం కాలేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులను చైర్మన్ నిలదీసి ప్రశ్నించారు.